News
News
X

Switzerland Unusual Laws: రాత్రి పది గంటల తర్వాత టాయిలెట్‌ ఫ్లష్ చేయడం స్విస్‌లో పెద్ద నేరం

ఒక వేళ ఎప్పుడైనా మీరు స్వీడ్జర్లాండ్‌ వెళ్తే మాత్రం వీటిని గుర్తు పెట్టుకోండి. లేకుంటే అక్కడ మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. లేదా జైలు పాలు కావాల్సి ఉంటుంది.

FOLLOW US: 

ప్రతి దేశం భిన్నంగా ఉంటుంది. ప్రతి దేశం చట్టాలు భిన్నంగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ చట్టాలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. మరికొన్ని భిన్నమైనప్పటికీ ఆయా దేశాల సాంస్కృతిక విలువలను సూచిస్తాయి. అలాంటి చాలా ఇంట్రస్టింగ్ చట్టాలు మనకు స్వీడ్జర్లాండ్‌లో కొన్ని కనిపిస్తాయి. అక్కడ ఉండే ఆ చట్టాలు వింటనే ఆశ్చర్య కలిగిస్తుంది. 

అలా భిన్నంగా కనిపించే కొన్ని చట్టాలను మీ కోసం ఇస్తున్నాం. ఒక వేళ ఎప్పుడైనా మీరు స్వీడ్జర్లాండ్‌ వెళ్తే మాత్రం వీటిని గుర్తు పెట్టుకోండి. లేకుంటే అక్కడ మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. లేదా జైలు పాలు కావాల్సి ఉంటుంది. 

స్వీడ్జర్లాండ్‌లో రాత్రి పది తర్వాత ఆ పని చేయడం నేరం

స్వీడ్జర్లాండ్‌లో రాత్రి పది గంటల తర్వాత టాయిలెట్స్‌ ఫ్లషింగ్ చేయడం నేరం. అంతే కాదండో..టాయిలెట్‌లో నిల్చొని మూత్రం పోయడం కూడా నేరమే. రాత్రి పది గంటల ముందే అలాంటి పనులేమైనా ఉంటే చూసుకోవాలి లేకుంటే అంతే సంగతులు. ఉదయం వరకు ఉగ్గపట్టుకొని ఉండాల్సిందే. ఇలా చేయడం వల్ల వచ్చే శబ్దం ఇతరులను ఇబ్బంది పెడుతుందన్న కారణంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఇక్కడి ప్రభుత్వం. 

అధికారులు ఆమోదిస్తే పిల్లలకు పేర్లు 

పిల్లలకు పేర్లు పెట్టడం పెద్ద టాస్క్. డెలివరీ కాక ముందు నుంచే చాలా మంది పేర్లపై కసరత్తు చేస్తుంటారు. అబ్బాయి పుడితే ఈ పేరు పెట్టాలి... అమ్మాయి పుడితే ఈ పేరు పెట్టాలనే డిస్కషన్ చేస్తుంటారు. పెద్ద లిస్టే రెడీ చేసుకుంటారు. మరికొందరు తాతముత్తాతల పేర్లు, ఇష్టదైవాల పేర్లు పెడుతుంటారు. ఏదైనా మనకు నచ్చిన పేరునే పెడుతుంటాం. 

స్వీడ్జర్లాండ్‌లో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్కడ పిల్లలకు పేర్లు పెట్టాలంటే మాత్రం అధికారుల అనుమతి తప్పనిసరి. ఫ్యామిలీ అనుకున్న పేర్ల లిస్ట్‌ను అధికారులకు ఇస్తే వాళ్లు దాన్ని పరిశీలించి ఆమోదించిన పేర్లు మీకు ఇస్తారు. అందులో నుంచి ఒక పేరును పిల్లలకు పెడతారు. అందులో భవిష్యత్‌ ఆ పిల్లాలు తన పేరు విని బాధ పడేకుండా ఉండేందుకు ఈ జాగ్రత్త తీసుకుంటారు. ఇతరులు అభ్యంతరం చెప్పకుండా జాగ్రత్త పడతారు. 

కుక్కలకు పన్ను 

స్విట్జర్లాండ్‌లో కుక్కలు పెంచుకుంటే పన్ను చెల్లించాలి. కొన్ని ప్రాంతాల్లో అన్నింటికి సాధారణమైన పన్ను రేటు ఉంటే... కొన్ని ప్రాంతాల్లో కుక్క పరిమాణం, బరువు ప్రకారం పన్ను వసూలు చేస్తారు. 1904 చట్టాన్ని బయటకు తీసిన రెకన్విలియర్‌లోని అధికారులు 2011లో కొత్త చట్టాన్ని చేశారు. యజమానులు పన్నులు చెల్లించకుంటే వారు పెంచుకునే కుక్కలను చంపేస్తామని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో వెనక్కి తగ్గిన అధికారులు చంపడం నుంచి సడలింపు ఇచ్చారు. 

పెంపుడు జంతువుకు తోడు ఉండాలి 
స్విట్జర్లాండ్‌లో జంతువులను పెంచుకుంటే కచ్చితంగా అవి ఆడుకోవడానికి అదే జాతికి చెందిన మరో జంతువును కూడా పెంచాలి. లేకుంటే అధికారులు జరిమానా విధిస్తారు. 2005లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇలా జంటలుగా జంతువులను పెంచుకోవాల్సి ఉంటుంది. వాటిని బోనుల్లో బంధించకుండా స్వేచ్ఛగా ఇంట్లో తిరిగేలా చూసుకోవాలి. బంధించినా అధికారులు యాక్షన్ తీసుకుంటారు. 

ఇంటింటికీ బంకర్ ఉండాల్సిందే

స్విట్జర్లాండ్‌లో ఇల్లు కట్టుకోవాలంటే మాత్రం బంకర్ ఉండాల్సిందే. అణు విస్పోటనం జరిగినప్పుడు సురక్షితంగా ఉండేందుకు ఈ బంకర్స్ ఉపయోగపడతాయని ఇక్కడి ప్రభుత్వం ముందజాగ్రత్త. అందుకే ప్రతి ఇంటికీ ఓ బంకర్ ఇండేలా చూస్తుంది. 

నగ్నంగా నడిస్తే నేరం 

స్విట్జర్లాండ్‌లో నగ్నంగా నడవడం పెద్ద నేరం. అలా చేసిన వాళ్లకు భారీ జరిమానా విధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. 

Published at : 23 Jul 2022 06:48 PM (IST) Tags: Switzerland Europe Guides And Tips Travel Trips Unusual Laws

సంబంధిత కథనాలు

UK Next PM: బ్రిటన్ ప్రధాని రేసులో లీడ్‌లో లిజ్ ట్రస్, రిషి సునక్‌పై వ్యతిరేకత ఉందా?

UK Next PM: బ్రిటన్ ప్రధాని రేసులో లీడ్‌లో లిజ్ ట్రస్, రిషి సునక్‌పై వ్యతిరేకత ఉందా?

Cairo church Fire : కైరో చర్చిలో అగ్నిప్రమాదం, 41 మంది సజీవదహనం

Cairo church Fire :  కైరో చర్చిలో అగ్నిప్రమాదం, 41 మంది సజీవదహనం

JK Rowling Death Threat: డోంట్ వర్రీ నెక్స్ట్ టార్గెట్ నువ్వే, హ్యారీపాటర్ రైటర్‌కి బెదిరింపులు

JK Rowling Death Threat: డోంట్ వర్రీ నెక్స్ట్ టార్గెట్ నువ్వే, హ్యారీపాటర్ రైటర్‌కి బెదిరింపులు

Revenge Lover : ప్రియుడు మోసగాడని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చిన లవర్ - తర్వాతే అసలు ట్విస్టులు

Revenge Lover : ప్రియుడు మోసగాడని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చిన లవర్ - తర్వాతే అసలు ట్విస్టులు

Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

టాప్ స్టోరీస్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?