అన్వేషించండి

Ukraine Russia War: ట్విట్టర్, ఫేస్‌బుక్ బాటలో యూట్యూబ్ - రష్యాకు మరో ఎదురుదెబ్బ !

Russia Ukraine Crisis: రష్యా ప్రభుత్వం చేస్తున్న పోస్టులను గమనించిన ఫేస్‌బుక్, ట్విట్టర్ సంస్థలు రష్యా స్టేట్ మీడియాకు చెందిన ఖాతాలపై కఠిన నిర్ణయం తీసుకోగా, యూట్యూబ్ సైతం అదే నిర్ణయం తీసుకుంది.

YouTube bans ads on RT and other Russian channels: ఉక్రెయిన్‌పై సైనిక చర్యతో యుద్ధానికి దిగిన రష్యాపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. అమెరికా, భారత్ లాంటి దేశాలు యుద్ధం సరైన నిర్ణయం కాదని ఇరుదేశాలకు సూచించాయి. కొన్ని దేశాలు రష్యాకు ఎగుమతి, దిగుమతులు నిషేధించాయి. సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు ఇదివరకే రష్యా ప్రభుత్వ అధికారిక అకౌంట్లపై ఆంక్షలు విధించాయి. సోషల్ మీడియా నుంచి క్యాష్ చేసుకోకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. యూట్యూబ్ సైతం ఫేస్‌బుక్, ట్విట్టర్ బాటలో నడుస్తూ ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచింది.

రష్యా యూట్యూబ్ ఛానెళ్లపై ఆంక్షలు..
రష్యాకు చెందిన అధికారిక యూట్యూబ్ ఛానెల్స్‌పై నిషేధం విధించాలని ఉక్రెయిన్ డిజిటల్ మినిస్టర్ మైఖెలో ఫెడోరోవ్ సంస్థను అభ్యర్థించారు. ఉక్రెయిన్‌లో పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నామని, రష్యా ప్రభుత్వానికి చెందిన అధికారిక యూట్యూబ్ ఛానెళ్లపై ఆంక్షలు అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలో ఎక్కడ కూడా రష్యా అధికారిక యూట్యూబ్ అకౌంట్లకు చెందిన యాడ్స్ నిషేధించింది. రష్యా అఫీషియల్ అకౌంట్స్‌లో మానిటైజేషన్ సైతం నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది యూట్యూబ్. ఈ నిర్ణయంతో అధికారిక యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా రష్యాకు ఎలాంటి నగదు చేతికి రాదు. ఉక్రెయిన్‌పై దాడులు లాంటి విషయాలు సైతం యూట్యూబ్‌లో ప్రసారం చేసినట్లు సంస్థ గుర్తించింది. అలాంటి వీడియోలను సైతం తాము డిలీట్ చేస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 

రష్యాకు ఫేస్ బుక్, ట్విట్టర్ షాక్..
రష్యా ప్రభుత్వానికి చెందిన అధికారిక అకౌంట్లపై ఫేస్‌బుక్, ట్విట్టర్ నిఘా ఉంచాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా ఎంతకూ వెనక్కి తగ్గకపోవడం, సామాజిక మాధ్యమాలతో రష్యా ప్రభుత్వం చేస్తున్న పోస్టులను గమనించిన ఫేస్‌బుక్, ట్విట్టర్ సంస్థలు రష్యా స్టేట్ మీడియాకు చెందిన ఖాతాలపై కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఖాతాలకు తమ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి యాడ్స్ (ప్రకటనలు) రావని ఆ యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ఇదివరకు ఉన్న పోస్టులు, వీడియోల ద్వారా కొంతకాలం వరకు క్యాష్ చేసుకోకుండా ఆంక్షలు విధించారు.

ఒక వర్గాన్ని, మతాన్ని, సంస్థను కించపరచడం, తక్కువగా చేయడం లాంటి పోస్టులను గమనిస్తే స్పందించి చర్యలు తీసుకునే సంస్థల్లో ట్విట్టర్ ఒకటి. అలాంటిది ఉక్రెయిన్ దేశంపై రష్యా చేస్తున్న మారణహోమంపై మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సైతం నిరాశ చెందింది. ఉక్రెయిన్‌కు, ఇతర దేశాలకు వ్యతిరేకంగా.. దేశ పౌరులను రెచ్చగొట్టే విధంగా రష్యా చేసిన పోస్టులను డిలీట్ చేసే పనిలో బిజీగా ఉంది. రష్యాకు చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతాలపై ఆంక్షలు విధించింది. మానిటైజేషన్ నిలిపివేయడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన అకౌంట్ల నుంచి చేసే పోస్టులపై నిఘా ఉంచింది. కొందరు నేతలకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించింది. ప్రజల రక్షణ, భద్రత లాంటి విషయాలకు ప్రాధాన్యం ఇస్తామని ట్విట్టర్ పేర్కొంది. 

Also Read: Russia-Ukraine War: దూకుడుగా సాగుతోన్న రష్యా సేనలు- దక్షిణ ఉక్రెయిన్ నగరాలు హస్తగతం

Also Read: Russia Ukraine War: చేతిలో భారత జెండా, దేశభక్తి ఊపిరి నిండా- భారతీయులకు రక్షణ కవచంగా త్రివర్ణ పతాకం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన దరఖాస్తుకు దరఖాస్తు చేయనివారు అప్లయ్ చేసుకోండి. ఫిబ్రవరిలో నిధులు విడుదలయ్యే అవకాశం
ఫిబ్రవరిలో పీఎం కిసాన్‌ యోజన పథకం నిధులు విడుదల- దరఖాస్తు చేసుకోనివారు త్వరపడండి
CMR College Issue: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
Mandapeta Rave Party: మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
Sydney Test Live Updates: సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 9/1
సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 9/1
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Indian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP DesamJC Prabhakar reddy Fires on BJP | బస్సు తగులబెట్టినవాళ్లపై బూతులతో విరుచుకుపడిన జేసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన దరఖాస్తుకు దరఖాస్తు చేయనివారు అప్లయ్ చేసుకోండి. ఫిబ్రవరిలో నిధులు విడుదలయ్యే అవకాశం
ఫిబ్రవరిలో పీఎం కిసాన్‌ యోజన పథకం నిధులు విడుదల- దరఖాస్తు చేసుకోనివారు త్వరపడండి
CMR College Issue: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
Mandapeta Rave Party: మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
Sydney Test Live Updates: సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 9/1
సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 9/1
Telangana News: తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Apple Siri Lawsuit: దొంగచాటుగా మాటలు విన్న 'సిరి' దొరికిపోయింది - రూ.800 కోట్లు ఇచ్చేందుకు ఆపిల్‌ 'సై'
దొంగచాటుగా మాటలు విన్న 'సిరి' దొరికిపోయింది - రూ.800 కోట్లు ఇచ్చేందుకు ఆపిల్‌ 'సై'
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
Embed widget