Rental Wifes: టూరిస్టులకు ఆ దేశంలో అద్దెకు భార్యలు దొరుకుతారు - రెంట్ ఎంత ఉంటుందో తెలుసా ?
Rental Contracts: సమాజం ముందుకెళ్తుందో..వెనక్కి వెళ్తుందో చెప్పలేం కానీ ఇప్పుడు కొత్తగా రెంటల్ వైఫ్స్ కూడా వచ్చేశారు. అయితే మన దేశంలో కాదు. తరవాత రాదని చెప్పలేం.
Thailand Offers Wives On Rent Rental Contracts: ఎవరైనా జల్సా చేయాలనుకుంటే ఏ దేశానికి వెళ్తారు?. ముందుగా మనం లిస్ట్ రాసుకుంటే అందులో ఉండే మొదటి పేరు థాయ్ ల్యాండ్. ఎందుకంటే అక్కడ టూరిజం మొత్తం జిల్ జిల్ జిగా జిగా అనే చెప్పుకుంటారు. బీచ్‌లు.. నైట్ లైఫ్..మసాజులు కూడా సరదా పురుషుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. అందుకే విలాసాల పర్యాటకులకు థాయ్‌ల్యాండ్ నెంబర్ వన్ కంట్రీగా ఉంది.
అయితే థాయిల్యాండ్‌లో ప్రాస్టిట్యూషన్ నేరం. ఎవరైనా డబ్బులకు వ్యభిచారం చేస్తే ఫైన్ వేస్తారు. అందుకే అక్కడ టూరిజం ఇండస్ట్రీకి చెందిన చాలా మంది కలిసిస ఓ ప్లాన్ అమలు చేశారు. అదేమిటంటే.. అద్దెకు భార్యల్ని సమకూర్చడం. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ధాయ్ ల్యాండ్ పర్యాటకులకు అక్కడ ఇప్పుడు భార్యల్ని అద్దెకు ఇస్తారు. అంటే ఎవరైనా ధాయ్ ల్యాండ్ కు ఒంటరిగా వెళ్లినా మగ గుంపుతో వెళ్లినా ఎవరికి వారు ఓ జంటను వెదుక్కోవచ్చు. వారితో లీగల్ గా పెళ్లి చేసుకోకపోవచ్చు కానీ భార్యను అద్దెకు తీసుకోవచ్చు. వారితో అన్ని పనులు చేసుకోవచ్చు.
కొన్నాళ్ల క్రితం ప్లెజర్ మ్యారేజెస్ పేరుతో ధాయ్ ల్యాండ్ లో విస్తృత ప్రచారం జరిగింది. ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకుని ఎంజాయ్ చేసి వెళ్లిపోతూంటారు. వాటి స్థానంలో ఇప్పుడు రెంటల్ వైఫ్స్ విధానం వచ్చింది. ఈ విధానం ప్రకారం ఓ అగ్రిమెంట్ చేసుకుంటారు.ఓ ధాయ్ లాండ్‌కు వెళ్లాక.. అవసరాలు తీర్చడానికి ఓ భార్య కావాలనుకుంటే.. బ్రోకర్లను సంప్రదిస్తే వారే తీసుకు వస్తారు. అమ్మాయికి తగ్గట్లుగా రేటు ఉంటుంది. పదహారు వందల డాలర్లనుంచి లక్షా పదహారు వేల డాలర్ల వరకూ వివిధ ధరల్లో భార్యలు అద్దెకు దొరుకుతారు.
నైట్ లైఫ్ ఉండే ప్రాంతాల్లో ఇలాంటి వారు చాలా సులువుగానే దొరుకుతూంటారని పర్యాటకులు చెబుతున్నారు. మరి ఇది ఆ దేశంలో నేరం కాదా అంటే.. ఇప్పటి వరకూ ఈ రెంటల్ వైఫ్స్ విధానంపై అక్కడి చట్టాలు ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. చట్టాలు కూడా వ్యతిరేకంగా లేవు.అందుకే ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. అంటే ఇందులో ఏమైనా సమస్యలు వచ్చి తమ దేశ మహిళలకు ఏమైనా సమస్యలు వస్తాయనుకుంటే ప్రభుత్వం అప్పుడు ఏమైనా రెగ్యులేషన్స్ తెస్తుందేమో కానీ .. ఇప్పుడు మాత్రం ఏ సమస్యలూ లేవు.
ధాయ్ ల్యాండ్ పూర్తిగా పర్యాటక రంగంపై ఆధారపడిన దేశం. అక్కడి ప్రజలు కూడా టూరిస్టుల మీద వచ్చే ఆదాయంతోనే ఎక్కువ గడుపుతూంటారు. నైట్ లైఫ్ కోసం వచ్చేవారే ఎక్కువ కావడంతో ధాయ్ ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.