అన్వేషించండి

Sri Lanka Crisis: 'మాకు ఏం సంబంధం లేదు'- ఆ వార్తలను ఖండించిన భారత్

Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు విదేశాలకు పారిపోవడానికి భారత్ సహకరించిందంటూ వస్తోన్న వార్తలను భారత్ హైకమిషన్ ఖండించింది.

Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పరారవడంలో భారత్ పాత్ర ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ప్రయాణానికి భారత్‌ సహకరించిందంటూ శ్రీలంకలోని కొన్ని మీడియా సంస్థలు నిరాధార వార్తలను ప్రసారం చేశాయి. వాటిని ఆ దేశంలోని భారత హైకమిషన్ తోసిపుచ్చింది.

" శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచివెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన దేశం దాటే విషయంలో భారత్ సహకరించిందనే నిరాధార, ఊహాజనిత వార్తలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. హైకమిషన్ వీటిని నిర్ద్వందంగా ఖండించింది. "
-                                       భారత రాయబార కార్యాలయం
 

సాయానికి రెడీ

మరోవైపు శ్రీలంక ప్రజలకు తమ మద్దతు కొనసాగుతుందని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఎలాంటి సాయానికైనా భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హైకమిషన్ వెల్లడించింది

పరార్

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేయకుండా దేశం విడిచి పారిపోయారు. ఆయన భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్​తో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పరారయ్యారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం కూడా ధ్రువీకరించింది.

మాల్దీవులు ప్రభుత్వం వెలనా విమానాశ్రయంలో రాజపక్సకు స్వాగతం పలికింది. మరోవైపు, శ్రీలంక ప్రభుత్వ ఆదేశాల మేరకే అధ్యక్షుడిని తరలించామని ఆ దేశ వాయుసేన ప్రకటించింది.

ఎమర్జెన్సీ

అధ్యక్షుడు పారిపోవడంతో నిరసనకారులు కొన్ని చోట్ల సంబరాలు చేసుకున్నారు. మరికొంతమంది గొటబాయను దేశం విడిచి పారిపోయేందుకు ప్రభుత్వం సహకరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. దేశంలో మళ్లీ హింసాత్మక ఆందోళనలు చెలరేగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించింది.

Also Read: Elon Musk vs Trump: ట్రంప్‌ రిటైర్‌ అవ్వాలంటూ మస్క్ ట్వీట్- షాకిచ్చిన నెటిజన్లు!

Also Read: Sri Lanka Crisis: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ- అధ్యక్షుడు పారిపోవడంతో తప్పలేదు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget