News
News
X

Elon Musk vs Trump: ట్రంప్‌ రిటైర్‌ అవ్వాలంటూ మస్క్ ట్వీట్- షాకిచ్చిన నెటిజన్లు!

Elon Musk vs Trump: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. డొనాల్డ్ ట్రంప్‌పై కామెంట్ చేశారు. రాజకీయాల నుంచి ఆయన రిటైర్ కావాలని సూచించారు.

FOLLOW US: 

Elon Musk vs Trump: టెస్లా సీఈఓ, బిలియనీర్ ఎలాన్ మస్క్.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు తాజాగా మస్క్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ ఇక రాజకీయాల నుంచి రిటైర్ కావడం ఉత్తమమంటూ కామెంట్ చేశారు.

"  నాకు ట్రంప్ అంటే ఎలాంటి ద్వేషం లేదు, కానీ ఆయన రాజకీయాల నుంచి ఇక రిటైర్ అయి హాయిగా గడపాలి. అధ్యక్షుడు బైడెన్ పదవీకాలం ముగిసేనాటికి ట్రంప్‌ వయసు 82 ఏళ్లవుతుంది. అమెరికా సహా దేనికైనా సీఈఓగా వ్యవహరించడానికి ఆ వయసు చాలా ఎక్కువ. డెమోక్రటిక్‌ పార్టీవాళ్లు కూడా ట్రంప్‌పై విమర్శలు చేయడం మానుకోవాలి.                                                         "
- ఎలాన్ మస్క్, టెస్లా సీఈఓ

మరో ట్వీట్

దీంతో పాటు ట్విట్టర్‌లో మరో పోల్ పెట్టారు మస్క్. 'హేట్ ట్రంప్, హేట్ మస్క్'లో ఏది ఎన్నుకుంటారు అంటూ ట్వీట్ చేశారు. ఆ పిక్చర్‌లోనే ఎక్కువ మంది లెఫ్ట్ (ఎడమ వైపు) ఉన్నది సెలక్ట్ చేస్తారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇద్దరినీ హేట్ చేస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.

ట్రంప్

గత శనివారం అలస్కాలో జరిగిన ఓ కార్యక్రమంలో మస్క్‌పై ట్రంప్‌ పలు విమర్శలు చేశారు. ఇప్పటి వరకు తానెప్పుడూ రిపబ్లికన్‌ పార్టీకి ఓటు వేయలేదని మస్క్‌ ఇటీవల ఓ సందర్భంలో అన్నారు. దాన్ని ప్రస్తావించిన ట్రంప్‌.. మస్క్‌ తనకే ఓటేసినట్లు గతంలో ఓసారి తనకు చెప్పారన్నారు. మరోవైపు ట్విటర్‌ డీల్‌ నుంచి మస్క్‌ వెనక్కి తగ్గడంపైనా ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. అయితే మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటికీ తాను తిరిగి ఆ సోషల్ మీడియాను వినియోగించనని ట్రంప్ అంతకుముందు ఓసారి అన్నారు.

Also Read: Sri Lanka Crisis: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ- అధ్యక్షుడు పారిపోవడంతో తప్పలేదు!

 Also Read: Watch: నయాగరా అనుకున్నారా? జోగ్ జలపాతం, ఇది అంతకుమించి- కుదిరితే ఓసారి వెళ్లి రండి!

Published at : 13 Jul 2022 12:35 PM (IST) Tags: Trump sunset Elon Musk hits back former US President

సంబంధిత కథనాలు

తుపాకుల పాలనకు ఏడాది- ‘డెత్‌ టు అమెరికా’అంటూ నినాదాలు

తుపాకుల పాలనకు ఏడాది- ‘డెత్‌ టు అమెరికా’అంటూ నినాదాలు

UK Next PM: బ్రిటన్ ప్రధాని రేసులో లీడ్‌లో లిజ్ ట్రస్, రిషి సునక్‌పై వ్యతిరేకత ఉందా?

UK Next PM: బ్రిటన్ ప్రధాని రేసులో లీడ్‌లో లిజ్ ట్రస్, రిషి సునక్‌పై వ్యతిరేకత ఉందా?

Cairo church Fire : కైరో చర్చిలో అగ్నిప్రమాదం, 41 మంది సజీవదహనం

Cairo church Fire :  కైరో చర్చిలో అగ్నిప్రమాదం, 41 మంది సజీవదహనం

JK Rowling Death Threat: డోంట్ వర్రీ నెక్స్ట్ టార్గెట్ నువ్వే, హ్యారీపాటర్ రైటర్‌కి బెదిరింపులు

JK Rowling Death Threat: డోంట్ వర్రీ నెక్స్ట్ టార్గెట్ నువ్వే, హ్యారీపాటర్ రైటర్‌కి బెదిరింపులు

Revenge Lover : ప్రియుడు మోసగాడని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చిన లవర్ - తర్వాతే అసలు ట్విస్టులు

Revenge Lover : ప్రియుడు మోసగాడని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చిన లవర్ - తర్వాతే అసలు ట్విస్టులు

టాప్ స్టోరీస్

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ-  పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు !  విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?