Pakistani Jabardast Comedy: జబర్దస్త్ కామెడీలు చేస్తున్న పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ - చైనా ఫోటోలతో వీరత్వం - అక్కడి ప్రజలు పిచ్చోళ్లా ?
Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్ అతలాకుతలం అయిపోతే.. ఏదో పొడిచేసామని అటు అధ్యక్షుడు, ఇటు ఆర్మీ చీఫ్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది కామెడీగా మారుతోంది.

Pakistani Marshal Asim Munir: పాక్ ప్రధాని షాబాద్ షరీఫ్, మార్షల్ మునీర్ జబర్దస్త్ కామెడీ చేస్తున్నారు. ఇద్దరూ యుద్ధంలో ఇరగదీశామని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు 2019 చైనీస్ సైనిక డ్రిల్‌కు సంబంధించిన ఫోటోషాప్ చేసిన చిత్రాన్ని "ఆపరేషన్ బున్యాన్ అల్-మర్సూస్" స్మారకంగా బహుమతిగా ఇచ్చారు. ఒక ఉన్నత స్థాయి డిన్నర్ సందర్భంగా ఈ బహుమతి ఇచ్చారు.
మే 24, 2025న, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మరియు ఇటీవల నియమితమైన ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఒక ఉన్నత స్థాయి డిన్నర్ పార్టీను ఇచ్చారు . ఈ ఈవెంట్ పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం, సైనిక బలగాల "స్థిరమైన నిబద్ధత", "మార్కా-ఎ-హక్ - ఆపరేషన్ బున్యాన్ అల్-మర్సూస్" సమయంలో పాకిస్తాన్ ప్రజల "అజేయమైన మద్దతును"ను గౌరవించడానికి ఇచ్చినట్లుగా ప్రకటించుకున్నారు. ఈ డిన్నర్‌కు అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి ఇసాక్ దార్, సెనేట్ ఛైర్మన్ యూసుఫ్ రజా గిలానీ, ఇతర ఉన్నత స్థాయి సైనిక మరియు రాజకీయ నాయకులు హాజరయ్యారు.
Pak Army Chief Asim Munir gave PM Shehbaz Sharif a Chinese military drill photo, falsely claiming it showed a Pakistani strike on India. India, in contrast, shared verified visuals of damage to Pak airbases, exposing the propaganda, Op Bunyan al-Marsusa.@AugadhBhudeva@YkJoshi5 pic.twitter.com/22CNa6pogx
— Bhupinder Shahi (@budbhupi) May 26, 2025
ఈ డిన్నర్ సందర్భంగా, షెహబాజ్ షరీఫ్ అసిమ్ మునీర్‌కు ఒక ఫ్రేమ్ చేసిన చిత్రాన్ని బహుమతిగా ఇచ్చారు, ఇది భారతదేశంపై పాకిస్తాన్ "ఆపరేషన్ బున్యాన్ అల్-మర్సూస్"ను సూచిస్తుందని చెప్పుకొచ్చారు. "ఆపరేషన్ సిందూర్"కు ప్రతిస్పందనగా జరిగినట్లు పాకిస్తాన్ ప్రచారం చేసింది. కానీ నెటిజన్లు ఈ చిత్రం 2019లో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) సైనిక డ్రిల్‌కు సంబంధించిన ఒక పాత ఫోటో అని గుర్తించారు. ఈ ఫోటోలో చైనీస్ PHL-03 మల్టిపుల్ రాకెట్ లాంచర్ ఉంది. ఇది ఐదేళ్ల నుంచి ఆన్ లైన్ లో ఉంది. దీన్ని "ఆపరేషన్ బున్యాన్ అల్-మర్సూస్"కు సంబంధించినదిగా చిత్రీకరించారని ఎగతాళి చేస్తున్నారు.
Pakistan's latest masterpiece: Shehbaz Sharif presents a photoshopped painting from a 2019 Chinese drill to Failed Marshal Asim Munir 🎨💥
— Yash Rawat (@Yashfacts28) May 25, 2025
Guess when you can’t win on the battlefield, you win in Canva #LumberOneFauj pic.twitter.com/pteqdcsGqV
వినియోగదారులు ఈ చిత్రాన్ని గూగుల్ ఇమేజ్ సెర్చ్ ద్వారా గుర్తించి, దాని నిజమైన మూలాన్ని బహిర్గతం చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ 2019 చైనీస్ సైనిక డ్రిల్ ఫోటోను అసిమ్ మునీర్‌కు బహుమతిగా ఇచ్చారు, ఇది 'ఆపరేషన్ బున్యాన్ అల్-మర్సూస్' అని చెప్పారు. వారు తమ స్వంత సైనిక ఆపరేషన్ యొక్క అసలు విజువల్స్‌ను కూడా చూపించలేరని సెటైర్లు వేస్తున్నారు. షెహబాజ్ షరీఫ్,అసిమ్ మునీర్ తమ దేశాన్ని మోసం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.





















