Nova Kakhovk dam: ఉక్రెయిన్‌లోని భారీ డ్యామ్ పేల్చివేత, 80 గ్రామాల్లో వరదలు - రష్యా పనేనా?
Nova Kakhovk dam destruction: సౌత్ ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌కి సమీపంలో భారీ డ్యామ్‌ని పేల్చి వేయడం వల్ల వరదలు ముంచెత్తాయి.
Nova Kakhovk Dam Blown Up:
ఎప్పటి నుంచో దాడులు..
అసలే యుద్ధంతో సతమతం అవుతున్న ఉక్రెయిన్‌కి మరో ప్రమాదం ముంచెత్తింది. రష్యా ఆక్రమిత ఖేర్సన్ ప్రాంతంలోని నోవా కకోవ్‌కా (Nova Kakhovka Dam) డ్యామ్‌పై దాడి జరిగింది. సోవియట్ కాలం నాటి ఈ డ్యామ్ కూలడం వల్ల ఒక్కసారిగా ఉక్రెయిన్ ఉలిక్కిపడింది. ముఖ్యంగా సౌత్ ఉక్రెయిన్‌లో ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ దాడి కారణంగా దాదాపు 80 గ్రామాలను వరదలు ముంచెత్తాయని వెల్లడించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. నీప్‌రో (Dnipro River) నదిపై ఉన్న ఈ డ్యామ్‌పై చాన్నాళ్లుగా రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. మెయిన్ గేట్‌లపై బాంబుల దాడి చేయడం వల్లే ఒక్కసారిగా డ్యామ్ పేలిపోయిందని చెబుతోంది. స్థానిక ప్రజలకు, రైతులకు ఈ నీళ్లే ఆధారం. ఇంత కీలకమైన డ్యామ్‌ని పేల్చివేసేందుకు రష్యా ఎప్పటి నుంచో కుట్ర పన్నుతోందన్నది ఉక్రెయిన్ ప్రధాన ఆరోపణ. ఐరోపాలోనే అతి పెద్ద న్యూక్లియర్ ప్లాంట్‌కీ ఇక్కడి నుంచే నీళ్లు సరఫరా చేస్తారు. రష్యా ఆక్రమిత క్రిమియా ప్రజలకూ ఈ నీళ్లే ఆధారం. రిజర్వాయర్ ఖాళీ అయ్యేంత వరకూ వరదలు ముంచెత్తుతూనే ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రష్యా సైనిక బలగాలు ఈ దాడి చేశాయని ఉక్రెయిన్ సైన్యం ఆరోపిస్తున్నా...అటు రష్యా మాత్రం "మాకేం సంబంధం లేదు" అని తేల్చి చెబుతోంది. కీవ్‌పైనా రష్యా దాడులు కొనసాగుతున్నాయి.
"అర్ధరాత్రి నుంచి రష్యా ఈ డ్యామ్‌పై దాడులు చేస్తూనే ఉంది. చాలా వరకూ గేట్ వాల్వ్‌లు ధ్వంసమయ్యాయి. నీళ్లు బయటకు వచ్చేశాయి. ఆ తరవాత మరింత పగుళ్లు రావడం వల్ల ఒక్కసారిగా వరద ముంచెత్తింది. నియంత్రించడానికి కూడా ఎలాంటి అవకాశం లేకుండా పోయింది."
- ఓ అధికారి
Russian terrorists. The destruction of the Kakhovka hydroelectric power plant dam only confirms for the whole world that they must be expelled from every corner of Ukrainian land. Not a single meter should be left to them, because they use every meter for terror. It’s only… pic.twitter.com/ErBog1gRhH
— Володимир Зеленський (@ZelenskyyUa) June 6, 2023
ఈ ఘటనపై జెలెన్‌స్కీ అప్రమత్తమయ్యారు. వెంటనే ఉన్నతాధికారులతో సమావేశమవ్వాలని ఆదేశించారు. నేషనల్ సెక్యూరిటీ విభాగానికి సంబంధించిన అధికారులతోనూ చర్చించనున్నారు. అంతకు ముందు ఈ డ్యామ్‌ని రష్యా చేజిక్కించుకుంది. చాలా రోజుల పోరాటం తరవాత ఉక్రెయిన్ తిరిగి తమ అధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి ఈ ప్రాంతంపైనే రష్యా ఫోకస్ చేసిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఉద్దేశపూర్వకంగా చేసిన దాడేనని తేల్చి చెబుతోంది.
Russian terrorists have once again proved that they are a threat to everything living. The destruction of one of the largest water reservoirs in Ukraine is absolutely deliberate. At least 100 thousand people lived in these areas before the Russian invasion. At least tens of… pic.twitter.com/ISjIwKc2QN
— Володимир Зеленський (@ZelenskyyUa) June 7, 2023
Also Read: Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్