అన్వేషించండి

Russia-Ukraine : ఉక్రెయిన్‌లో షాపుపై రష్యా రాకెట్‌ దాడి-51 మంది మృతి

ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో రష్యా రాకెటు దాడిలో కనీసం 51 మంది పౌరులు మృతి.

రష్యా సేనల రాకాసి దాడులతో  ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ దాడులు ఉక్రెయిన్‌‌లో అపార ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీస్తున్నాయి.  భీకరంగా సాగుతున్న ఈ  యుద్ధంలో ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు నేలమట్టమయ్యాయి. అన్నింటినీ  ఎదుర్కొంటూనే సాధారణ జీవనం ప్రారంభించిన ఉక్రెయిన్‌ బుధవారం దాడితో మళ్లీ ఉలిక్కిపడింది. రష్యా చేసిన మిస్సైళ్ల ఎటాక్‌తో సూపర్‌ మార్కెట్‌ ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది.  గురువారం మధ్యాహ్నం కుప్యాన్‌స్క్‌ జిల్లాలోని హ్రోజా గ్రామంలో ఒక షాపు, కేఫ్‌పై రష్యా రాకెట్ల దాడి జరిగినట్లు ఆ ప్రాంత గవర్నర్‌ తెలిపారు. ఈ రాకెట్‌ దాడిలో సుమారు 51 మంది మరణించారని, బిల్డింగ్‌ శిథిలాల్లో కొందరు చిక్కుకున్నట్లు వెల్లడించారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిన్నట్లు టెలిగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

2022 ఫిబ్రవరి 22న ఉక్రెయిన్‌పై పుతిన్ సేనలు సైనిక చర్యను ప్రారంభించాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలై ఇప్పటికి ఏడాదిన్నర గడిచిపోయినా రక్తపాతం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. రోజురోజుకీ ఉక్రెయిన్ లో పరిస్ధితులు దిగజారుతున్నాయి. రష్యా చేస్తున్న దాడులతో ఇప్పటికే దీనావస్ధలోకి జారుకుంటున్న ఉక్రెయిన్ కు పాశ్చాత్య దేశాలు ఓ పక్క సహాయం చేస్తూనే ఉన్నా కోలుకోవడం కష్టంగానే ఉంటోంది. ఇక అడపా దాడపా. అమాయక ప్రజల జనావాసాలపై కూడా మాస్కో సేనలు క్షిపణిదాడులకు పాల్పడుతూ సామాన్యులను  పొట్టనపెట్టుకుంటోంది. తాజాగా రష్యా చేసిన మిస్సైళ్ల ఎటాక్‌తో ఒక సూపర్‌ మార్కెట్‌ ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. తలలు తెగి, చేతులు, కాళ్లు లేకుండా పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఈ దాడితో 51 మంది మృతి చెందగా, మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి  మరో 56  మందిని ఉక్రెయిన్ సైనికులు కాపాడారు. మిసైల్‌ ఎటాక్ జరిగిన ప్రాంతంలో భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే రష్యా చేసిన దాడిని ఉక్రెయన్‌ తీవ్రరంగా ఖండించింది. ఈ అంశాన్ని ఉక్రెయన్‌ అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు వెళ్ళటమే కాదు, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామమని చెబుతున్నారు ఉక్రెయిన్ సేనలు. 

 స్పెయిన్‌లో జరుగనున్న యూరప్‌ నేతల సదస్సులో పాల్గోనున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్కీ తాజా రష్యా దాడిపై స్పందించారు. గ్రోసరీ షాపుపై జరిగిన రష్యా రాకెట్‌ దాడిని క్రూరమైన ఉగ్రవాద దాడి అని ఆరోపించారు. రష్యా సరిహద్దుల్లో ఉన్న కుపియాన్స్క్ జిల్లాలోని హ్రోజా   ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకుందని, ఆ తరువాత ఉక్రెయిన్ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకోవడంతోనే రష్యా దళాలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని జెలెన్ స్కీ ఆరోపించారు. ఇలా  ఒక సాధారణ దుకాణంపై రాకెట్ దాడి చేసి ప్రజల ప్రాణాలు తీయడం రష్యా చేస్తున్నఉద్దేశపూర్వక ఉగ్రవాద చర్యగా  అభివర్ణించారు. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం కూడా దీనిపై స్పందించింది.  దాడిలో 51 మంది మరణించారని, మృతులలో చిన్న పిల్లాడు కూడా ఉన్నాడని తెలిపింది. 

నిజానికి రష్యా ముందు ఎంతో ఏంటో  చిన్నదైన ఉక్రెయిన్  కొన్ని వారల్లోనే లొంగిపోతుందని అంతా భావించారు. అయినా సరే అలాంటి ఆలోచనాలకి అవకాశం రానివ్వకుండా ఉక్రెయిన్  ఏడాదిన్నర కాలంగా పోరాడుతూనే  ఉంది. ఈ నేపధ్యంలో పలుమార్లు చర్చలకు సిద్ధమని రష్యా ప్రకటించింది. అయితే ఉక్రెయిన్ లో తాము ఆక్రమించుకున్న జపొరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలను చర్చల్లోకి తీసుకురావద్దని  చెబుతోంది. ఉక్రెయిన్ మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నంత కాలం చర్చల ప్రసక్తే లేదని చెబుతోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Embed widget