Afghanistan Crisis: ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజల తిరుగుబాటు... ఆందోళనకారులపై తాలిబన్ల కాల్పులు
తాలిబన్లపై తిరుగుబాటు మొదలైంది. ప్రభుత్వ కార్యాలయాలపై ఆప్ఘనిస్థాన్ జాతీయ జెండా ఎగరేయాలని జలాలాబాద్ నగరంలో ప్రజలు నిరసనలు చేపట్టారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజలు తిరగబడుతున్నారు. తానిబన్లపై దండయాత్ర చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చి తాలిబన్‌లకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. జలాలాబాద్ నగరంలోని ప్రజలు వీధుల్లోకి ఆందోళనలు చేపట్టారు. తాలిబాన్ జెండాకు బదులుగా ఆఫ్ఘనిస్తాన్ జెండాను ప్రభుత్వ కార్యాలయాల్లో ఎగరేయాలని డిమాండ్ చేశారు.
ఇలా రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్న వారిపై తాలిబన్‌లు విచక్షణరహితంగా కాల్పులు జరుపుతున్నట్టు్ స్థానిక వార్తా సంస్థలు చెబుతున్నాయి. నిరసనలు కవర్ చేస్తున్న కొంతమంది జర్నలిస్టులుపై కూడా కాల్పులు జరిపారు. దొరికిన వారిని దొరినట్టటు చితక్కొటారు. ఓ వార్తా సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోల్లో వందల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ జెండాను తీసుకుని మార్చ్ చేయడం గమనించవచ్చు.
ఆందోళనకారులు ఆ ప్రాంతం నుంచి చెదరగొట్టడంతో బ్యాక్‌గ్రౌండ్‌లో కాల్పుల శబ్దం వినిపించింది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనేది ఇంకా ఏ వార్తా సంస్థ కూడా నిర్దారించలేదు. నిన్న ఆఫ్ఘనిస్తాన్ మహిళల బృందం తమ హక్కులను కోరుతూ మొదటిసారిగా రోడ్లపైకి వచ్చారు. బహిరంగ నిరసన చేపట్టారు. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన వీడియోల్లో తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. హక్కులు, సామాజిక భద్రత, కోసంం డిమాండ్ చేయడాన్ని వినవచ్చు.
#Taliban firing on protesters in Jalalabad city and beaten some video journalists. #Afghanidtan pic.twitter.com/AbM2JHg9I2
— Pajhwok Afghan News (@pajhwok) August 18, 2021
ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను తమ నియంత్రణలోకి తీసుకొచ్చిన తర్వాత మూడు రోజులు సైలెంట్‌గా ఉన్న ప్రజలు ఇప్పుడు వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దేశం విడిచి పెట్టి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. మరికొందరు వెళ్లిపోయారు. ఇంకా వెళ్లిపోవడానికి బోర్డర్స్‌లో, విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఏ చిన్న ఛాన్స్ వచ్చినా దేశం సరిహద్దులు దాటి ప్రాణాలు కాపాడుకుందామని చూస్తున్నారు.
Protest in Jalalabad city in support of National flag.#Afghanistan pic.twitter.com/oxv3GL0hmS
— Pajhwok Afghan News (@pajhwok) August 18, 2021
అందరూ స్వేచ్చగా జీవించ వచ్చని... ఎవరికీ హాని తలపెట్టబోమని తాలిబన్లు హామీ ఇస్తున్నప్పటికీ ప్రజల్లో నమ్మకం కలగడం లేదు. అందుకే దేశం దాటి పోవాలని కొందరు ప్రయత్నస్తుంటే.. మరికొందరు తాలిబన్లపై తిరుగుబావుటా ఎగరేస్తున్నారు.
ALSO READ: మహిళా న్యూస్ యాంకర్లపై తాలిబన్ల నిషేధం