గాజా హాస్పిటల్ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, వాళ్లను వదలొద్దు అంటూ ట్వీట్
Gaza Hospital Attack: గాజా హాస్పిటల్ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
![గాజా హాస్పిటల్ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, వాళ్లను వదలొద్దు అంటూ ట్వీట్ PM Modi Condoles Deaths In Gaza Hospital Attack, Says 'Involved Should He Held Responsible; గాజా హాస్పిటల్ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, వాళ్లను వదలొద్దు అంటూ ట్వీట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/18/68a9c5c34d22ac269b7113eb7e38f9d41697618866743517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gaza Hospital Attack:
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని..
గాజాలోని హాస్పిటల్‌పై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయేల్,హమాస్‌కి జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా సాధారణ పౌరులు నలిగిపోవడం బాధారమని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
"గాజాలోని అల్ అహ్లీ హాస్పిటల్‌పై జరిగిన దాడి ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢన సానుభూతి తెలుపుతున్నాను. గాయపడ్డవాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఇజ్రాయేల్, హమాస్‌కి జరుగుతున్న యుద్ధంలో సామాన్య పౌరులు నలిగిపోతున్నారు. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది కచ్చితంగా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఈ దాడులకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు"
- ప్రధాని నరేంద్ర మోదీ
Deeply shocked at the tragic loss of lives at the Al Ahli Hospital in Gaza. Our heartfelt condolences to the families of the victims, and prayers for speedy recovery of those injured.
— Narendra Modi (@narendramodi) October 18, 2023
Civilian casualties in the ongoing conflict are a matter of serious and continuing concern.…
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇటీవలే నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఘర్షణలు, అక్కడి తాజా పరిస్థితుల గురించి నెతన్యాహు ఫోన్ చేసి తెలియజేశారు. హమాస్‌తో యుద్ధం వేళ ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే భారత్ ఖండిస్తుందన్నారు. హమాస్ ఘోర తప్పిదం చేసిందని, అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని నెతన్యాహు హెచ్చరించారు. యుద్ధాన్ని తాము మొదలుపెట్టకపోయినా, ముగించేది మాత్రం తామేననన్నారు. తమ ప్రతిదాడి హమాస్‌తో పాటు, ఇజ్రాయెల్ శత్రు దేశాలకు దశాబ్దాలపాటు గుర్తుండిపోతుందని నెతన్యాహు హెచ్చరించారు.
పాలస్తీనా ఆశలు..
అటు పాలస్తీనా కూడా భారత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇజ్రాయేల్‌ని ఎలాగోలా బుజ్జగించి తమ సమస్యను పరిష్కరిస్తారని భావిస్తోంది. ఇదే విషయాన్ని వెల్లడించారు...పాలస్తీనా రాయబారి అద్నాన్ మహమ్మద్ జబేర్ అబౌల్హైజా (Adnan Mohammad Jaber Abualhayjaa). ABP Newsతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన పాలస్తీనా సమస్య పరిష్కారంలో భారత్ చాలా కీలక పాత్ర పోషిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య మధ్యవర్తిత్వం చేస్తుందని ఆకాంక్షించారు. అంతే కాదు. ఈజిప్ట్, ఖతార్, టర్కీ దేశాలతో భారత్ మైత్రి కొనసాగించాలని పాలస్తీనా కోరుకుంటున్నట్టు చెప్పారు అద్నాన్ మహమ్మద్ జబేర్. ముఖ్యంగా గాజా సరిహద్దు వద్ద నివసిస్తున్న 22 లక్షల మంది పౌరులకు మానవతా సాయం అందించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయేల్, హమాస్ ఉగ్రవాదులకు జరుగుతున్న యుద్ధాన్ని ఇప్పటికిప్పుడు ఉపసంహరించుకునేలా భారత్ చొరవ చూపాలని అన్నారు.
Also Read: ఇజ్రాయేల్ ప్రజలకు నెతన్యాహు నచ్చడం లేదట, యుద్ధమే కారణం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)