Imran Khan Speech Highlights: అమెరికా బానిసలు పాకిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు చూస్తున్నారు- విశ్వాస పరీక్షకు ముందు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కామెంట్స్
మంచివైపు నిల్చుంటారో చెడువైపు చూస్తారో దేశం నిర్ణయించుకోవాలి అని అన్నారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. విశ్వాస పరీక్ష ఎదుర్కోబోతున్న ఆయన ప్రజలను ఉద్దేశించి కీలక కామెంట్స్ చేశారు.
పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి ఆమెరికా బానిసలు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని సీరియస్ కామెంట్స్ చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. ఇలాంటి టైంలో దేశం ఎటువైపు నిలబడాలో నిర్ణంచుకోవాలని పిలుపునిచ్చారు. మంచివైపు ఉంటారా చెడువైపు చూస్తారా అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్న ప్రతిపక్షాలు అధికారం చేజిక్కించుకుంటే అమెరికాకు బానిసత్వానికి పాల్పడతాయన్నారు.
ఆదివారం నాటి అవిశ్వాస తీర్మానానికి ముందు ప్రధాని ఈ సంచలన కామెంట్స్ చేశారు. "మంచి వైపు నిలబడాలో లేదా చెడు వైపు నిలబడాలో దేశం నిర్ణయించుకోవాలి" అని అతను బహిరంగ ప్రసంగంలో చెప్పినట్టు పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ట్వీట్ చేసింది.
"Even our Parliament Committee has seen this official document, which says that if you remove Imran you will have good terms with America," Pakistan PM Imran Khan in a public address, a day ahead of trust-vote pic.twitter.com/JJ8OlXB7GB
— ANI (@ANI) April 2, 2022
దుష్పరిపాలన ఆర్థిక అసమర్థత అని తనను విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలపై కూడా ఇమ్రాన్ ఖాని తీవ్ర ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (PML-N) నాయకుడు ఖవాజా ఆసిఫ్‌ను ప్రశ్నించడానికి కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు ఇమ్రాన్ ఖాన్.
"మీరు ఇన్నాళ్లూ ప్రభుత్వంలో ఖవాజా... పాకిస్తాన్‌ను ప్రాణాలను రక్షించే యంత్రంలో ఉంచింది మీరు కాదా?" అని ఖాన్ ప్రశ్నించారు.
ఇమ్రాన్‌ను తొలగిస్తే అమెరికాతో సత్సంబంధాలు నెలకొంటాయని చెబుతున్న అధికారిక పత్రాన్ని పార్లమెంటు కమిటీ కూడా చూసిందన్నారు ఇమ్రాన్ ఖాన్.