By: Ram Manohar | Updated at : 12 May 2023 05:06 PM (IST)
ఇమ్రాన్ ఖాన్‌కు రెండు వారాల బెయిల్ ఇస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.
Imran Khan Gets Bail:
అల్ఖదీర్ ట్రస్ కేసులో బెయిల్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు ఊరటనిచ్చింది. రెండు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టు ప్రకటించింది. అల్ఖదీర్ ట్రస్ట్ కేసులో (Al-Qadir Trust case) బెయిల్ ఇచ్చింది. మే 17వ తేదీ వరకూ ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడానిలి వీల్లేదని తేల్చి చెప్పింది. త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య కోర్టులో హాజరయ్యారు ఇమ్రాన్ ఖాన్. ఈ విచారణ జరుగుతుండగానే..ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "నన్ను మళ్లీ ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లినా తీసుకెళ్తారు" అంటూ అసహనం వ్యక్తం చేశారు. భద్రతా కారణాల వల్ల విచారణ రెండు గంటల పాటు ఆలస్యమైంది. సెక్యూరిటీ కాన్వాయ్‌తో కోర్టుకు వచ్చారు ఇమ్రాన్. పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. చాలా రోజులుగా న్యాయపోరాటం చేస్తున్న ఇమ్రాన్‌కు ఈ తీర్పుతో ఉపశమనం కలిగింది. ఆ తరవాత ఆయన స్పందించారు. కోర్టులో గంటల పాటు కూర్చోవాల్సి వచ్చిందని, ఏ తప్పూ చేయకుండానే తనను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటవిక చట్టాలు రాజ్యమేలుతున్నాయంటూ మండి పడ్డారు. దేశంలో మార్షియల్ లా విధించినట్టు అనిపిస్తోందని ఫైర్ అయ్యారు.
Islamabad High Court bars authorities from arresting Imran Khan till May 17 in any new case: Pakistan's Geo News
— ANI (@ANI) May 12, 2023
Imran Khan granted bail in all cases, order not to arrest him in any case filed after May 9: Pakistan's ARY News and Samaa TV report pic.twitter.com/51UNSDg3h3
— ANI (@ANI) May 12, 2023
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌పై ఆ దేశ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా అక్రమేనని తేల్చి చెప్పారు. ఇస్లామాబాద్ హైకోర్టులో ఉండగానే ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడం న్యాయవ్యవస్థకే మచ్చ తెచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో భయానక వాతావరణం సృష్టించారంటూ మండి పడ్డారు. కోర్టులో ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు చీఫ్ జస్టిస్. ఎవరినైనా సరే కోర్టులో అరెస్ట్ చేయడం అక్రమం అని తేల్చి చెప్పింది. గంటలోగా ఇమ్రాన్ ఖాన్‌ను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ కోర్టుకి వచ్చే సమయంలో రాజకీయ నేతలు కానీ, కార్యకర్తలు కానీ కోర్టులోకి రావద్దని హెచ్చరించారు చీఫ్ జస్టిస్.
"ఓ వ్యక్తి కోర్టులో హాజరయ్యారంటేనే చట్ట పరంగా అన్ని నిబంధనలు పాటిస్తున్నట్టు లెక్క. అలాంటి వ్యక్తిని కోర్టులోనే అరెస్ట్ చేయడంలో అర్థమేంటి..? భవిష్యత్‌లో ఇంకెవరైనా సరే కోర్టుకి రావాలన్నా భయపడతారు. అక్కడా భద్రతా లేదని భావిస్తారు. అరెస్ట్ చేసే ముందు పోలీసులు రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాలి"
- చీఫ్ జస్టిస్, పాకిస్థాన్ సుప్రీంకోర్టు
Also Read: Whatsapp Bug: వాట్సాప్ ప్రైవసీ వివాదంలో మరో ట్విస్ట్, సెక్యూరిటీ బగ్ కనిపెట్టిన గూగుల్
School Girls Poisoned: ఆఫ్ఘన్లో బాలికలపై విషప్రయోగం, ఆస్పత్రిపాలైన 80 మంది విద్యార్థినులు
Kathleen Folbigg: 20 ఏళ్ల జైలుశిక్ష తర్వాత విడుదలైన 'సీరియల్ కిల్లర్'- ఫలించిన వైద్యులు, నోబెల్ గ్రహీతల పోరాటం
Rahul Gandhi: వెనుక అద్దం చూస్తూ ఇండియా కారును ప్రధాని నడుపుతున్నారు, మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు
Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్
Chinese Woman: షాపింగ్ చేయడానికి తోడు కావాలా? అయితే ఈ అమ్మాయి కంపెనీ ఇస్తుంది - కానీ కండీషన్స్ అప్లై
YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ