Israel-Hamas War: ఎటు చూసిన శవాల దిబ్బలు, రక్తంతో తడిసిన వీధులు, అయినా తగ్గేదే లేదంటుున్న ఇజ్రాయెల్, హమాస్
Israel-Hamas War: ఇజ్రాయెట్, హమాస్ పరస్పర దాడులతో రెండు ప్రాంతాలు శవాల దిబ్బలుగా మారాయి. భవనాలు నేల కూలుతున్నాయి. గత మూడు రోజుల్లో ఇరువైపులా 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Israel-Hamas War: ఇజ్రాయెల్, హమాస్ పరస్పర దాడులతో రెండు ప్రాంతాలు శవాల దిబ్బలుగా మారాయి. భవనాలు నేల కూలుతున్నాయి. గత మూడు రోజుల్లో ఇరువైపులా 1,100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులతో సహా 700 మందికిపైగా పౌరులు మరణించారు. ఇప్పటికే మిలిటెంట్ సంస్థ హమాస్‌తో తాము యుద్ధంలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి నిర్ణయానికి అక్కడి సెక్యూరిటీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. నెతన్యాహు మాట్లాడుతూ హమాస్ దాడి సుదీర్ఘమైన, సవాలుతో కూడిన యుద్ధానికి నాది పలికిందన్నారు. మిలిటెంట్ గ్రూప్ యొక్క రహస్య స్థావరాలను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
గాజాలో తలదాచుకుంటున్న సుమారు 413 మంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) వెల్లడించింది. పదుల సంఖ్యలో వారిని బందీలుగా పట్టుకున్నామని ప్రకటించింది. దళాలు తొలుత గాజా సరిహద్దు వెంబడి నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నాయని తెలిపింది. ఇజ్రాయెల్ దళాలకు, హమాస్ ఉగ్రవాదులకు మధ్య కిఫర్ అజాలో భీకరపోరు కొనసాగుతోంది. ఈ ప్రాంతం గాజా సరిహద్దులో ఉంటుంది. దాంతో కనిపించిన ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టేందుకు ఐడీఎఫ్ ప్రయత్నిస్తోంది. అలాగే ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ దాడులను ఆపడం లేదు. ఆదివారం వేలాది రాకెట్లను ప్రయోగించారు. 100 మంది ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా తీకెళ్లిన వీడియాలోను విడుదల చేసింది. హమాస్ ఎంత మంది ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకుందో గుర్తించేందుకు ఐడీఎఫ్ ప్రత్యేకంగా సిచ్యూవేషన్ రూమ్‌ను ఏర్పాటు చేశాయి. హమాస్ గన్‌మెన్లు నిన్న భారీగా పిల్లలు, మహిళలు, పురుషులను ఈడ్చుకొని గాజాపట్టీలోకి తీసుకెళ్లారు.
సంగీత ఉత్సవంలో 260 డెడ్ బాడీలు
సంగీత ఉత్సవంపై హమాస్ దాడి చేసింది. అక్కడ దాదాపు 260 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెలీ రెస్క్యూ సర్వీస్ జకా నివేదించింది. దాడులు జరిగినప్పుడు ఉత్సవంలో ఉన్న ప్రజలు పరిగెత్తడం, వాహనాల్లో దాక్కోవడం వంటి వీడియోలు ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని అనేక మంది సభ్యులు ఆదివారం హమాస్‌ను దాడి ఖండించారు. ఏకాభిప్రాయం లేకపోవడంపై యునైటెడ్ స్టేట్స్ విచారం వ్యక్తం చేసింది. అత్యవసర సమావేశంలో యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ రెండూ పాలస్తీనా ఇస్లామిస్టులను గట్టిగా ఖండించాలని పిలుపునిచ్చాయి.
హమాస్ దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖంచించారు. ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించారు. డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ USS గెరాల్డ్ R ఫోర్డ్ విమాన వాహక నౌక, యుద్ధనౌకలను తూర్పు మధ్యధరా ప్రాంతానికి తరలించాలని నిర్దేశించారు. ఈ ప్రాంతంలో యుద్ధ విమానాల స్క్వాడ్రన్‌లను పెంచుతున్నట్లు అమెరికా తెలిపింది. వాల్ స్ట్రీట్ జర్నల్‌తో హమాస్ హిజ్బుల్లా సీనియర్ సభ్యులు మాట్లాడుతూ.. వారాంతంలో ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడులను నిర్వహించడంలో ఇరాన్ పాత్ర పోషించిందన్నారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధికారులు, గాజాలోని హమాస్, హిజ్బుల్లాతో సహా నాలుగు మిలిటెంట్ గ్రూపుల ప్రతినిధులు బీరుట్‌లో సమావేశాలు నిర్వహించారని, ఆపరేషన్ వివరాలు పక్కగా ప్లాన్ చేసినట్లు చెప్పారు.
అసోసియేటెడ్ ప్రెస్ సమాచారం మేరకు.. గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పాలస్తీనా కుటుంబానికి చెందిన 19 మంది మరణించారని నివేదించింది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు గాజాలో 800 కంటే ఎక్కువ ప్రాంతాలపై దాడులు చేసిందని, బీట్ హనౌన్ పట్టణంలోని చాలా వరకు వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెట్ సైన్యం తెలిపింది. ఇస్లామిక్ జిహాద్ చీఫ్ జియాద్ అల్-నఖలా ఆదివారం మాట్లాడుతూ.. 30 మందికి పైగా ఇజ్రాయెల్‌లను బందీలుగా ఉంచామని, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వేలాది మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేసే వరకు బందీలను వారి దేశానికి పంపించే ప్రసక్తే లేదన్నారు.
ఇజ్రాయెల్ దళాలు సోమవారం అనేక ప్రదేశాలలో ఉన్న ఉగ్రవాదులతో పోరాడుతూనే ఉన్నాయి. దక్షిణ భాగంలో హమాస్ ఉగ్రవాదులతో పోరాడేందుకు పదివేల మంది ఇజ్రాయెల్ దళాలు మొహరించారు. చాలా చోట్ల రోడ్లపై శవాలు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. మృతులు, గాయపడిన వారి రక్తంతో వీధులు తడిచిపోతున్నాయి. ఈ డాడులను "ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్"గా హమాస్ పేర్కొంది. అలాగే వెస్ట్ బ్యాంక్‌లోని ప్రతిఘటన యోధులు, అరబ్, ఇస్లామిక్ దేశాలు యుద్ధంలో చేరాలని పిలుపునిచ్చింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియెహ్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. మన భూమి కాపాడుకుంటూనే, అక్రమంగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు విడుదల అయ్యే వరకు యుద్ధం సాగుతుందని ప్రతిజ్ఞ చేశారు.