Europe Hotel Jobs : రెజ్యూమ్ కూడా వద్దు ఉద్యోగం ఇచ్చేస్తామంటున్నారు - ఎక్కడో తెలుసా ?
యూరోపియన్ హోటల్ పరిశ్రమలో ఇప్పుడు ఉద్యోగాలు కుప్పలు తెప్పలుగా ఖాళీగా ఉన్నాయి. అనుభవం లేకపోయినా సరే చేస్తామని వచ్చే వారికి ఉద్యోగాలిచ్చేస్తున్నాయి. అయినా వారికి సరిపోవడం లేదు.
Europe Hotel Jobs : కరోనా కారణంగా దారుణంగా దెబ్బతిన్న పరిశ్రమల్లో హోటల్ పరిశ్రమ ఒకటి. ముఖ్యంగా టూరిజం ప్రధానంగా ఉండే దేశాల్లో హోటల్ పరిశ్రమ తీవ్ర ఇక్కట్ల పాలయింది. ఆ సమయంలో అనేక హోటళ్లు మూతపడ్డాయి. చాలా మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వారంతా ఇప్పుడు వేరే ఉద్యోగాలు వెదుక్కున్నారు. ఇప్పుడు కరోనా పరిస్థితి మెరుగయింది. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు సడలించారు. రెండేళ్ల పాటు ఇంట్లోనే మగ్గిపోయిన జనం ఇప్పుడు టూరిజం కేంద్రాల బాట పట్టారు. దీంతో ప్రఖ్యాత టూరిస్ట్ ప్లేసులు ఉన్న దేశాలు కిక్కిరిసిపోతున్నాయి. బిజినెస్ పెరుగుతోంది కానీ.. అక్కడి హోటళ్లకు మాత్రం పెద్ద చిక్కొచ్చి పడింది. హోటళ్లలో పని చేయడానికి సిబ్బంది మాత్రం లేరు.
యూరోప్ దేశాల్లో పెరుగుతున్న పర్యాటకులు - హోటళ్లలో ఉద్యోగుల కొరత
యూరోపియన్ దేశాల్లో ఇప్పుడు పర్యాటకుల సందడి కనిపిస్తోంది. హోటళ్లు అన్నీ కిక్కిరిసిపోతున్నాయి. అయితే వారి డిమాండ్‌కు తగ్గట్లుగా సేవలు అందించడానికి హోటళ్లు తంటాలు పడుతున్నాయి. దానికి తగ్గట్లుగా మ్యాన్ పవర్ లేకపోవడమే దీనికి కారణం. దీంతో హోటళ్లు అన్నీ " వియ్ ఆర్ హైరింగ్ " అని బోర్డులు పెట్టేశాయి. ఆన్ లైన్‌లో ప్రకటనలు ఇస్తున్నాయి. ఇందులో చాలా ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. ఇంటర్యూకి రావాలంటే కనీసం రెజ్యూమ్ కావాలి. అయితే రెజ్యూమ్ కూడా అక్కర్లేదు వచ్చేయండి అంటున్నాయి కంపెనీలు. రెజ్యూమే అక్కర్లేదు అంటూంటే ఇక అనుభవం మాత్రం అడుగుతాయా.. ఆ అనుభవం ఏదో తామే ఇస్తామని ముందు వచ్చి ఉద్యోగంలో చేరాలని ఆఫర్లు ఇస్తున్నాయి.
ఇంటర్యూ లేకుండా.. కనీసం రెజ్యూమ్ కూడా ఉద్యోగాలిస్తున్న హోటళ్లు
నార్త్ ఆఫ్రికా నుంచి కొంత మంది ఉద్యోగాలకు వస్తూంటే వారిని చేర్చుకుంటున్నారు. అయితే మ్యాన్ పవర్ లే్కపోవడంతకో చాలా హోటళ్లు వారానికి ఐదు రోజులు మాత్రమే తెరుస్తున్నారు. అనుభవం లేకపోయినా అత్యధిక వేతనం, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రోత్సాహకాలు ఇచ్చి మరీ చేర్చుకుంటున్నారు. యూరప్ దేశాలన్నింటికీ కలిపి కనీసం యాభై వేల నుంచి లక్ష మంది వరకూ హోటల్ మేనేజ్‌మెంట్ చదువుకున్న వాళ్లు అవసరం అని అంచనా వేస్తున్నారు. కాస్త అనుభవం ఉండి అత్యధిక జీతానికి మారే వారు కూడా ఎక్కువయ్యారు. ఈ కారణంగా యూరప్ దేశాల్లోని హోటల్ ఇండస్ట్రీల్లో పని చేస్తున్న వారి జీతాలు అరవై శాతం వరకూ పెరిగాయి.
ఇతర దేాశాల నుంచి వచ్చే వారికీ అవకాశాలు
ఆయా దేశాల్లో ఉన్న వారికే్ ఉద్యోగాలు ఇవ్వాలని ఆ కంపెనీలు రూలేం పెట్టుకోలేదు. కాస్త పనికి వస్తారు అనుకుంటే తీసుకుంటున్నాయి. వారు గంటల్లో క్రాష్ కోర్సు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చేస్తున్నాయి. ఇన్ని ఆఫర్లు ఉంటే మన దేశంలో హోటల్ మేనేజ్‌మెంట్ డిగ్రీ పొంది.. నిపుణులైన వారు ఊరుకుంటారా.. అవకాశాలు అందుకోరు. ఆ ప్రయత్నాలు యూరప్ హోటల్ చైన్ వెబ్ సైట్ల నుంచి చేసుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.