టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో కుదుపులు, పెద్ద శబ్దాలు - ఎమర్జెన్సీ ల్యాండింగ్
Delta Airlines Flight: డెల్టా ఎయిర్‌లైన్స్ ప్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే కుదుపులకు లోనై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.
Delta Airlines Flight:
డెల్టా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఘటన..
మిలాన్ నుంచి న్యూయార్క్‌కి వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ (Delta Airlines) ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. టేకాఫ్ అయిన కాసేపటికే ల్యాండ్ అయింది. ఉన్నట్టుండి గాలి వీచే దిశ మారిపోవడం, ఒత్తిడి పెరగడం వల్ల విమానం కుదుపులకు లోనైంది. ముందు భాగంలో స్వల్పంగా ధ్వంసమైంది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. కుడి వైపు రెక్కలతో పాటు ఇంజిన్ కూడా డ్యామేజ్ అయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవలేదు. అయితే...ఫ్లైట్‌కి మాత్రం బాగానే డ్యామేజ్ అయింది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ ప్రాణనష్టం వాటిల్లేది. ప్రస్తుతం ఈ ఫ్లైట్ డ్యామేజ్ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో 215 మంది ప్రయాణికులున్నారు. వాళ్లతో పాటు 8 మంది సిబ్బంది, ముగ్గురు పైలట్‌లు ఉన్నారు. వీళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు.
"ఎప్పటిలాగే టేకాఫ్ అయ్యాం. పైకి వెళ్లిన కాసేపటికే పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. విమానం అదుపుతప్పింది. ప్లేన్ రూఫ్‌పై శబ్దాలు వినిపించాయి. ఓ ప్రయాణికుడు కిటికీలో నుంచి బయటకు చూశాడు. గాలి భయంకరంగా వీస్తోంది. రెక్కలు ఊగిపోతున్నాయి. మొత్తం ఫ్లైట్ పేలిపోతుందని భయపడిపోయాం. రోలర్‌కోస్టర్ ఎక్కిన ఫీలింగ్ కలిగింది. ఎలాగోలా సేఫ్‌గా ల్యాండ్ అయ్యాం"
- ప్రయాణికులు
Delta Boeing 767-300 (N189DN) flight #DL185 from Milan to New York JFK encountered hailstorms and severe turbulence after takeoff from Milan Malpensa Airport. The crew decided to divert to Rome Fiumicino. The aircraft received damage to its wings, engines, and radome. pic.twitter.com/2Se7hFpOtS
— Sαƈԋιɳ Kυɱαɾ ʋҽɾɱα (@Imsachin_kv) July 25, 2023
విమానం ముందు భాగం డ్యామేజ్ అవడం వల్ల నావిగేషన్ సిస్టమ్ కూడా పని చేయకుండా పోయింది. రెండు ఇంజిన్‌లూ ధ్వంసమైనట్టు అధికారులు వెల్లడించారు.