అన్వేషించండి

Nepal Earthquake: నేపాల్‌ భూకంపం అంతం కాదు ఆరంభమే!-పెద్ద భూకంపాలు వస్తాయని నిపుణుల వార్నింగ్!

Nepal Earthquake: నేపాల్‌ భూకంపం ఒక హెచ్చరిక అంటున్నారు నిపుణులు. హిమాలయ ప్రాంతంలో ఎప్పుడైనా పెద్ద భూకంపం రావచ్చని హెచ్చరిస్తున్నారు. భూకంపాలను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలంటున్నారు.

Earthquake In Nepal: 

నేపాల్‌లో 2015న వచ్చిన భూకంపం నాటి విషాదఛాయలు ఇప్పటికీ అక్కడి ప్రజలను కలవరపెడుతూనే ఉంటాయి. అయితే.. దానికి మించిన ప్రకృతి విలయం రాబోతోందని  హెచ్చరిస్తున్నారు నిపుణులు. నేపాల్‌లో నెల రోజుల్లో మూడు సార్లు భూమి కంపించింది. నిన్న రాత్రి వచ్చిన బలమైన ప్రకంపనలు పెను విషాదాన్ని మిగిల్చాయి. వందలాది  మందిని మింగేశాయి. నేపాల్ భూకంపం ప్రభావం ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశం మొత్తం కనిపించింది. అయితే... ఇది అంతం కాదని అంటున్నారు నిపుణులు. నేపాల్‌లో  మరిన్ని భారీ భూప్రకంపనలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. 

హిమాలయాలు, నేపాల్ మధ్య ప్రాంతంలోని ప్రజలు మరిన్ని భూకంపాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్ హెచ్చరించారు. నిన్న  అర్థరాత్రి వచ్చిన భూ ప్రకంపనల మూలం నేపాల్‌లోని దోటీ జిల్లాకు సమీపంలో ఉందని ఆయన తెలిపారు. నిన్న ఒకే ప్రాంతంలో వరుసగా పలుమార్లు ప్రకంపనలు వచ్చాయని  చెప్పారు. భూకంపం వచ్చిన ఈ ప్రాంతం నేపాల్ మధ్య భాగంలో ఉందని... అది ఆందోళన కలిగించే విషయమని అంటున్నారు భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్.

నవంబర్ 2022లో నేపాల్‌లోని దోటీ జిల్లాలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. నిన్న (అక్టోబర్‌ 3న) నేపాల్‌ను తాకిన వరుస భూకంపాలు కూడా ఇదే ప్రాంతంలో  ఉన్నాయి. నేపాల్ సెంట్రల్ బెల్ట్ నిరంతర శక్తి విడుదల రంగంగా గుర్తించబడిందని.. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు భూకంప శాస్త్రవేత్తలు. హిమాలయాలకు  సమీపంలో ఉన్న ఆ ప్రాంతంలో భారతీయ టెక్టోనిక్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ ఢీకొన్నందున ఆ ప్రాంతంలో ఎప్పుడైనా పెను భూకంపం వచ్చే అవకాశం ఉందని ఆయన  ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనే కాదు... చాలా మంది నిపుణులు అనేక సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. 

నాలుగైదు మిలియన్ సంవత్సరాల క్రితం, భారతీయ పలక హిందూ మహాసముద్రం నుంచి ఉత్తరం వైపు కదులుతున్నప్పుడు, యురేషియన్ ప్లేట్‌తో ఢీకొని హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. అయితే... మరోసారి భారత పలక ఉత్తరం వైపు కదలడం ప్రారంభించిందని నిపుణులు చెప్తున్నారు. ఫలితంగా.. హిమాలయాల కింద భూమిలో ఒత్తిడి పెరుగుతుందని... దీని వల్ల అతి భారీ భూకంపాలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆ భూకంపాల తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 8 పాయింట్ల కంటే ఎక్కువగా ఉండొచ్చని చెప్తున్నారు. అయితే... ఆ భారీ వైబ్రేషన్స్‌ ఎప్పుడు వస్తాయో మాత్రం కచ్చతంగా అంచనా వేయలేకపోతున్నామని అంటున్నారు భూకంప శాస్త్రవేత్తలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... అతి భారీ భూకంపాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు.

నేపాల్‌లో ఇవాళ తెల్లవారుజామున కూడా నాలుగు సార్లు భూప్రకంపనలు సంభవించాయి. మృతుల కుటుంబాలకు నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహాల్‌ ప్రచండ సంతాపం  ప్రకటించారు. వైద్య బృందంతో కలిసి భూకంప ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. ఈ భూకంపంలో జజర్‌కోట్‌ జిల్లాలోని నల్‌గఢ్‌ మున్సిపాలిటీ డిప్యూటీ హెడ్‌ సరితా సింగ్‌ కూడా  మృతిచెందారు. భూకంప ధాటికి ఆమె ఉంటున్న ఇల్లు కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విపత్కర  పరిస్థితుల్లో నేపాల్‌కు అండగా ఉంటామని చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్‌పై కేసు నమోదు, వైసీపీ ఎమ్మెల్యే కోసం నంద్యాల పర్యటన వివాదాస్పదం
అల్లు అర్జున్‌పై కేసు నమోదు, వైసీపీ ఎమ్మెల్యే కోసం నంద్యాల పర్యటన వివాదాస్పదం
Andhra Elections 2024: ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
Aavesham: హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
Telangana Elections 2024: లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Jasprit Bumrah Bowled Sunil Narine | KKR vs MI IPL 2024 మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదే | ABP DesamGautam Gambhir Mentor KKR | IPL 2024 కోల్ కతా నైట్ రైడర్స్ కథ తిరగరాసిన గంభీర్ | ABP DesamRohit Sharma Viral Audio With Abhishek Nayar | ఐపీఎల్ లో అనూహ్యంగా ఫామ్ కోల్పోయిన రోహిత్ శర్మ | ABPKKR vs MI Match Highlights | IPL 2024 లో ప్లే ఆఫ్స్ అర్హత సాధించిన తొలి జట్టుగా కోల్ కతా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్‌పై కేసు నమోదు, వైసీపీ ఎమ్మెల్యే కోసం నంద్యాల పర్యటన వివాదాస్పదం
అల్లు అర్జున్‌పై కేసు నమోదు, వైసీపీ ఎమ్మెల్యే కోసం నంద్యాల పర్యటన వివాదాస్పదం
Andhra Elections 2024: ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు: ముఖేష్ కుమార్ మీనా
Aavesham: హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’ - కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైలాగ్
Telangana Elections 2024: లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
లోక్‌సభ ఎన్నికల కోసం భారీ బందోబస్తు, 48 గంటలపాటు 144 సెక్షన్: డీజీపీ రవిగుప్తా
Manchu Vishnu: ‘కన్నప్ప’లో ప్రభాస్‌కు నచ్చిన క్యారెక్టర్ చేస్తున్నాడు, ఎవరి మాటలు నమ్మొద్దు - మంచు విష్ణు
‘కన్నప్ప’లో ప్రభాస్‌కు నచ్చిన క్యారెక్టర్ చేస్తున్నాడు, ఎవరి మాటలు నమ్మొద్దు - మంచు విష్ణు
Vijayamma Supports YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం- షర్మిలకు మద్దతు ప్రకటించిన విజయమ్మ
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం- షర్మిలకు మద్దతు ప్రకటించిన విజయమ్మ
Salt side effects: ఉప్పు తగ్గించి తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే!
ఉప్పు తగ్గించి తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే!
IPL 2024: వర్షం వల్ల ఆలస్యం, ముంబై ముందు మోస్తరు లక్ష్యం
వర్షం వల్ల kkr తో ఆలస్యం, ముంబై ముందు మోస్తరు లక్ష్యం
Embed widget