ఎడారి నడి మధ్యలో వింత ఆకారాలు, ఏలియన్స్ సిగ్నల్స్ ఇచ్చాయా - 2 వేల ఏళ్ల మిస్టరీ
Mysterious Shapes: పెరూలోని ఎడారిలో నడి మధ్యలో వింత ఆకారాలు కనిపించగా ఇప్పటికీ ఆ మిస్టరీ వీడలేదు.
Mysterious Shapes in Desert:
పెరూ ఎడారిలో మధ్యలో గీతలు..
ఏలియన్స్ (Aliens) కాన్సెప్ట్‌పై ఎన్నో డిబేట్‌లు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు గ్రహాంతర వాసులు భూమిపైకి వచ్చి వెళ్తుంటారని, తమ ఉనికిని తెలియజేసేందుకు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటారని కొందరు వాదిస్తుంటారు. ఇదంతా ట్రాష్ అని కొందరు కొట్టి పారేస్తే...నిజమే అని ఇంకొందరు వాదిస్తారు. కానీ...ఇప్పటికీ సైంటిఫిక్‌గా ఏది నిజం అన్నది తేలలేదు. పలు సందర్భాల్లో UFOలు కనిపించడం మరింత మిస్టరీగా మారింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలోనే అక్కడక్కడా కొన్ని "అనూహ్య" సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరూ లేని ఎడారి ప్రాంతంలో నడి మధ్యలో ఓ చోట అంతు పట్టని సింబల్స్ కనిపించాయి. అమెరికాలోని పెరూ ఎడారిలో కనిపించాయివి. ఇవి ఎవరు గీశారు..? వాటి అర్థమేంటి అన్నది క్లారిటీ రావడం లేదు. కానీ ఇవి గీసి దాదాపు 2 వేల ఏళ్లు దాటినట్టు తెలుస్తోంది. అసలు ఎగ్జాగ్ట్‌గా ఆ సింబల్స్ ఏం చెబుతున్నాయన్నది సైంటిస్ట్‌లు ఎంత బుర్రలు బద్దలు కొట్టుకున్నా అర్థం కావడం లేదు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే...ఇవి సాధారణ మనుషులు గీసినట్టుగా కనిపించడం లేదు. అందుకే ఏలియన్స్ ఈ సింబల్స్ గీసి ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్లే ఇక్కడికి వచ్చి ఇవన్నీ గీసి మనుషులకు ఏదో సిగ్నల్స్ ఇవ్వాలని ట్రై చేసి ఉంటారని ఓ వాదన వినిపిస్తోంది.
ఏంటీ షేప్స్..?
పెరూలోని Nazca ఎడారిలో కనిపించిన ఈ షేప్స్‌లో కొన్ని మనిషి ఆకారాన్ని పోలి ఉన్నాయి. మరి కొన్ని పిల్లి, సాలీడు ఆకారంలో కనిపించినట్టు సైంటిస్ట్‌లు వెల్లడించారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే...ఈ ఒక్కో ఆర్ట్ ఎత్తు 121 అడుగులుగా ఉంది. స్పేస్‌లో నుంచి చూసినా ఇవి చాలా క్లియర్‌గా కనిపిస్తాయట. అంటే ఎంత పెద్దగా గీశారో అర్థం చేసుకోవచ్చు. ఏలియన్స్ UFOలో వచ్చి ఇక్కడే ల్యాండ్ అయ్యి వీటిని గీసి ఉంటారని కొందరు వాదిస్తుంటే...ఈ షేప్స్‌ని చూసిన తరవాతే గ్రహాంతర వాసులు ఇక్కడికి వచ్చి ఉండొచ్చని ఇంకొందరు చెబుతున్నారు. ఎక్స్‌పర్ట్స్ మాత్రం పెరూలో ఒకప్పటి "ఇరిగేషన్ సిస్టమ్"ని సూచించే షేప్స్ అయ్యుండొచ్చని ప్రాథమికంగా వివరిస్తున్నారు. అయితే...ఈ థియరీని ప్రూవ్ చేయలేకపోయారు.
ఎప్పుడు కనుగొన్నారు..?
ఈ షేప్స్‌ని 83 ఏళ్ల క్రితమే కనుగొన్నారు. దగ్గరికెళ్లి చూస్తే అవేంటో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అందుకే స్పేస్‌లో నుంచి వీటిని ఫొటోలు తీశారు. వీటిలో కొన్ని మనుషులు, జంతువుల ఆకారాలను పోలి ఉన్నాయని అప్పుడే అర్థమైంది. ప్రపంచంలోనే మనుషులు అసలు తిరగని ఎడారి ప్రాంతాల్లో Nazca ఎడారి ఒకటి. ఓ స్విస్ రైటర్ Erich von Daniken తన Chariots of the Gods బుక్‌లో దీని గురించి ప్రస్తావించారు. ఇది కచ్చితంగా ఏలియన్స్ చేసిన పనే అని, అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తేల్చి చెప్పారు. కానీ సైంటిస్ట్‌లు మాత్రం దీన్ని ధ్రువీకరించడం లేదు.
Also Read: మీడియా సంస్థలపైనా AI టూల్స్ ఎఫెక్ట్, ఎడిటర్స్ కొంప ముంచుతున్న టెక్నాలజీ