By: ABP Desam | Updated at : 08 Apr 2022 03:34 PM (IST)
6,236 అడుగుల ఎత్తులో నడుస్తున్న వ్యక్తి
మేడపై నుంచి కిందికి చూడాలంటేనే కొందరు వణికిపోతారు. అలాంటిది ఆరువేల అడుగుల పై నుంచి చూడమంటే గుడ్లు తేలేస్తారు. ఓ వ్యక్తి మాత్రం చూడటంతోనే ఆగిపోలేదు.. ఏకంగా రెండు తాళ్లపై నడిచి గిన్నీస్‌బుక్‌లో చోటు దక్కించుకున్నాడు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇటీవల 'హయ్యస్ట్ స్లాక్‌లైన్ వాక్'కు సంబంధించిన గుండెలు అదిరే వీడియో షేర్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.
రాఫెల్ జుగ్నో బ్రిడి అనే 34 ఏళ్ల వ్యక్తి చేసిన సాహనానికి నెటిజన్లు అశ్చర్యపోతున్నారు. గుండెల్లో దమ్ముకున్న వాళ్లే ఈ వీడియో చూడాలని సూచనలు చేస్తున్నారు.
భూమిపై నుంచి 6,236 అడుగుల ఎత్తులో నడిచి అబ్బురపరిచాడు. రెండు హాట్ ఎయిర్ బెలూన్‌ల మధ్య కట్టిన స్లాక్‌లైన్‌పై చెప్పులు లేకుండా నడిచాడీ వ్యక్తి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫా కంటే రెట్టింపు ఎత్తులో చేసిన సాహసం ఇది.
గిన్నిస్ ప్రకారం 2021 డిసెంబర్ 2న బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలో ఇలాంటి సాహసం చేసిన బ్రెజిల్ వ్యక్తి పేరిట ఇప్పటి వరకు ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు దీన్ని జుగ్నోబ్రిడీ బద్దలు కొట్టాడు.
ఈ సాహసంపై బ్రిడి చాలా అద్భుతంగా వివరించాడు. "ఇది నా జీవితాశయం. హైలైన్‌పై నడుస్తున్నప్పుడు వచ్చే స్వేచ్ఛ చాలా ప్రత్యేకమైనది. ఇలా నడవాలని చాలా సార్లు అనుకున్నాను. కదులుతూ ఉన్న రెండు ఎయిర్ బెలూన్‌ల ఒకదాని నుంచి ఇంకొకటి క్రాస్ చేయడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. దీని కంటే థ్రిల్ ఏదీ తీసుకురాలేదు."
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా
Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం- త్రుటిలో తప్పిన ప్రమాదం!
Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి మూడు నెలలు- పుతిన్ సాధించిందేంటి?
Modi Hyderabad Tour Today: నేడే హైదరాబాద్‌కు ప్రధాని, రంగంలోకి 2 వేల మంది పోలీసులు - పూర్తి షెడ్యూల్ ఇదీ
Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు