JD Vance: అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
US Iran Peace Talks | స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న అమెరికా, ఇరాన్ శాంతిచర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఇరాన్, ఖతార్ ప్రతినిధులు పట్టించుకోలేదు.

బెర్న్: పశ్చిమాసియాలో ఇంకా వివాదం సద్దుమణగలేదు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలతో ఇరాన్ భగ్గుమంటోంది. ఈ క్రమంలో శాంతి చర్చల కోసం స్విట్జర్లాండ్‌లో జరిగిన అమెరికా- ఇరాన్ ప్రతినిధుల భేటీలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. చర్చలకు ముందు ఫొటో సెషన్‌కు నిరాకరించిన ఇరాన్ ప్రతినిధులు, డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై అసంతృప్తితో అక్కడి నుంచి వాకౌట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
జరిగిన పరిణామంతో మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ నేతలు నివ్వెరపోగా, జేడీ వాన్స్ సైతం ఆ వీడియోలో ఆందోళనగా గమనిస్తూ కనిపించారు. ఆ తర్వాత మరో మధ్యవర్తి ఖతార్ ప్రధాని సైతం పాక్ ప్రధాని షరీఫ్‌ను పలకరించి, కానీ పక్కనే ఉన్న వాన్స్‌ను పూర్తిగా పట్టించుకోలేదు. ఇది కచ్చితంగా దౌత్యపరమైన తిరస్కరణగా నెటిజన్లు పేర్కొంటున్నారు.
Vance 'HUMILIATED' hand blanked by Qatar 'REFUSING TO GREET HIM' pic.twitter.com/XDRfnR1nrm
— RT (@RT_com) June 22, 2026
ఇలాంటి పరిస్థితుల్లోనూ చర్చలు ప్రారంభమైనప్పటికీ, పశ్చిమాసియాలో శాంతిస్థాపన దిశగా కీలక ముందడుగు పడింది. ఇరాన్ అణు కార్యక్రమం నియంత్రణతో పాటు లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల నిలిపివేత, ఎలాంటి ఆంక్షలు లేకుండా హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోలు కొనసాగడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు.
ఇరాన్‌తో అమెరికాకుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (Memorandum of Understanding) డెమోక్రాట్లు, రిపబ్లికన్లు.. 2 పార్టీలకు చెందిన నేతలు విమర్శిస్తున్నారు. ఈ ఒప్పందాన్ని తప్పుబడుతూ చట్టసభల సభ్యులు, మాజీ అధికారులు, విధాన నిపుణులు.. ఈ ఒప్పందం వల్ల వాషింగ్టన్ కంటే కూడా టెహ్రాన్‌కే ఎక్కువ లాభం చేకూరుతుందా? అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్ స్విట్జర్లాండ్‌లో ఇరాన్ అధికారులతో చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ విమర్శలు వచ్చాయి. అయితే, ట్రంప్ ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ డీల్‌ను తమ సక్సెస్‌గా చూపిస్తూ సమర్థించుకుంటున్నారు. ఇరాన్ అణు ఆయుధాలను సాధించకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రారంభమైన దౌత్య ప్రక్రియలో ఇది తొలి అడుగు అని పేర్కొంటున్నారు.
ఒప్పందం ఫెయిల్ అయితే హర్మూజ్‌ను ట్రంప్ స్వాధీనం
సిబిఎస్ ఛానల్‌లో రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం మాట్లాడుతూ.. దౌత్యపరమైన చర్చలు కొనసాగించడంలో తప్పు లేదన్నారు. ఈ ఒప్పందంలో ఉన్న లోపాలను ఆయన అంగీకరించారు. "ఈ ఒప్పందంలో సమస్యలు ఉన్నాయా? అంటే.. అవునని చెప్పాలి. కానీ యుద్ధాన్ని కొని తెచ్చుకోవడం కంటే దౌత్యపరమైన మార్గాలను ప్రయత్నించడానికే మొగ్గు చూపడం మంచిది. ఒకవేళ ఈ దౌత్య ప్రయత్నం విఫలమైతే, అధ్యక్షుడు ట్రంప్ హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) స్వాధీనం చేసుకుంటారు. మేమే దానిని నిర్వహిస్తామని" గ్రాహం అన్నారు. ఈ చర్చల ద్వారా ట్రంప్ సొంత పార్టీ (రిపబ్లికన్)లోనే ఈ వ్యవహారంపై ఉన్న భేదాభిప్రాయాలు బయటపడ్డాయి.
ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇరాన్‌తో చర్చలను గమనిస్తోందని, ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను పొందకుండా చూడటంపై ఫోకస్ చేశాం. మనం ఈ ప్రక్రియకు ఒక అవకాశం ఇవ్వాలి. శాంతి చర్చలకు కచ్చితంగా ఒక ఛాన్స్ ఇవ్వాలి. చర్చలలో అమెరికా పటిష్ట స్థితిలో ఉంది. భవిష్యత్తులో జరిగే ఎలాంటి ఒప్పందాలైనా నమ్మకం మీద కాదు, నిరూపణ, పరిశీలన ఆధారంగా ఉంటాయని’ ప్రస్తావించారు.
Before You Go
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
ట్రెండింగ్ వార్తలు























