![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Watch Video: పార్లమెంట్‌లోనే బిడ్డకు పాలిచ్చిన మహిళా ఎంపీ, చప్పట్లతో మారుమోగిన ప్రాంగణం
Watch Video: ఇటలీలో ఓ మహిళా ఎంపీ పార్లమెంట్‌లోనే తన బిడ్డకు పాలిచ్చింది.
![Watch Video: పార్లమెంట్‌లోనే బిడ్డకు పాలిచ్చిన మహిళా ఎంపీ, చప్పట్లతో మారుమోగిన ప్రాంగణం Italian lawmaker gilda sportiello creates history becomes first mp to breastfeed baby in parliament watch video Watch Video: పార్లమెంట్‌లోనే బిడ్డకు పాలిచ్చిన మహిళా ఎంపీ, చప్పట్లతో మారుమోగిన ప్రాంగణం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/08/ce5c4fe795db3219d68ff8a420a8598a1686213962363517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Watch Video:
ఇటలీ పార్లమెంట్లో..
ఇటలీ పార్లమెంట్లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. అక్కడి ఎంపీ గిల్డా స్పోర్టిలో (Gilda Sportiello) తన బిడ్డకు పార్లమెంట్‌లోనే పాలిచ్చింది. ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే బిడ్డ ఆకలి తీర్చేందుకు వెనక్కి వెళ్లి ఓ బెంచ్‌పై కూర్చుని బ్రెస్ట్ ఫీడింగ్ (Breast Feeding) చేసింది. ఇది చూసిన సభ్యులు వెంటనే లేచి నిలబడ్డారు. చప్పట్లు కొడుతూ ఆమెని అభినందించారు. చాలా సేపటి వరకూ ఆ హాల్ చప్పట్లతో మారు మోగింది. "మీ అబ్బాయి నిండు నూరేళ్లు ఆనందంగా బతకాలని కోరుకుంటున్నాం" అని చెప్పారు. గతేడాది నవంబర్‌లో పార్లమెంటరీ ప్యానెల్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఎంపీలు ఎవరైనా తమ బిడ్డలకు పార్లమెంట్‌లోనే తమ ఛాంబర్లో పాలిచ్చేందుకు అనుమతినిచ్చింది. ఈ బిల్ పాస్ చేయడంలో స్పోర్టిలో ప్రత్యేక చొరవ చూపించారు. ఇప్పుడు ఆమే...తన బిడ్డకు పాలిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఉద్యోగం చేసే మహిళలు ఎప్పుడు పడితే అప్పుడు బిడ్డకు పాలివ్వడం కుదరదని, ఇది ఆలోచించే పార్లమెంటరీ ప్యానెల్ నిర్ణయం తీసుకుందని పలువురు నేతలు స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం తీసుకున్నాక ఇటలీ పార్లమెంట్లో బిడ్డకు పాలిచ్చిన తొలి మహిళగా నిలిచారు గిల్డా.
Italien, heute.
— TheMissRossi 🍋 (@TheMissRossi) June 7, 2023
Gilda Sportiello ist die erste Abgeordnete, die mit einem Neugeborenen in die Abgeordnetenkammer erscheint und ihr Baby Federico stillt. Der Applaus der gesamten Versammlung war lang und intensiv. pic.twitter.com/ZFytixegus
స్పెషల్ రూమ్ ఏర్పాటు
"కొంత మంది మహిళలు బిడ్డకు పాలివ్వడం కూడా కుదరదు. కచ్చితంగా ఉద్యోగానికి వెళ్లాల్సిన పరిస్థితులుంటాయి" అని చెబుతున్నారు స్పోర్టిలో. అందుకే ఈ బిల్ పాస్ అయ్యేందుకు చొరవ చూపినట్టు వెల్లడించారు. మహిళా హక్కుల కోసం చాన్నాళ్లుగా పోరాటం చేస్తున్న గిల్డా స్పోర్టిలో...లాయర్ కూడా. మిగతా దేశాల్లో అయితే...పార్లమెంట్లో చనుబాలివ్వడం సాధారణంగానే కనిపిస్తుండొచ్చు. కానీ...ఇటలీలోని పార్లమెంట్ సభ్యుల్లో పురుషుల సంఖ్యే ఎక్కువ. మూడింట రెండొంతులు వాళ్లే ఉన్నారు. ఇలాంటి సభలో మహిళల కోసం ఇలా ప్రత్యేకంగా బిల్ తీసుకురావడం ఆహ్వానించాల్సిన విషయమని అంటున్నారు అక్కడి ప్రజలు. ప్రస్తుతం పార్లమెంట్లో ప్రత్యేకంగా బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్‌ని కూడా ఏర్పాటు చేశారు.
Gilda Sportiello allatta il figlio in Aula alla #Camera. È la prima volta ed è un segnale importante. Auguri a lei e buona vita al suo piccolo Federico.
— Myrta Merlino (@myrtamerlino) June 7, 2023
La speranza è che diventi, e al più presto, la normalità, su tutti i luoghi di #lavoro. #GildaSportiello #donne pic.twitter.com/ehJKtY3OEX
న్యూజిలాండ్ మాజీ ప్రధాని కూడా..
గతంలో న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా కూడా ఇలానే వార్తల్లో నిలిచారు. ఓ సారి న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సమావేశం జరగ్గా...ఆ సమయంలో బిడ్డను తన భర్త వద్ద ఉంచి హాజరయ్యారు జెసిండా. అప్పట్లో ఈ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. రెండు సార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన జెసిండా...క్రైసిస్ మేనేజర్ బిరుదు సంపాదించుకున్నారు. న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఈ ఏడాది జనవరిలో తన పదవికి రాజీనామా చేసి అందరినీ షాక్‌కు గురి చేశారు. చాలా అద్భుతంగా పాలించారంటూ ప్రశంసలు అందుకున్న ఆమె ఉన్నట్టుండి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఆశ్చర్యపరిచింది. కరోనా సంక్షోభ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలపై అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. అయితే...కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాన్న కారణంతో ఆమె రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోతున్నానంటూ కొన్ని సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకత్వం వహించాలనుకునే మహిళలకు మాతృత్వం అడ్డుకాకూడదంటూ ఎమోషనల్ అయ్యారు.
Also Read: Conversion Racket: గేమింగ్ యాప్స్‌తో మత మార్పిడి, చిన్నారులే టార్గెట్ - దేశవ్యాప్తంగా భారీ నెట్వర్క్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)