ఇజ్రాయేల్, హమాస్ యుద్ధం వెంటనే ఆపేయాలి - టవర్ ఎక్కి వింత నిరసన
Israel Palestine Attack: ఇజ్రాయేల్, హమాస్ యుద్ధం ఆపేయాలంటూ పారిస్‌లో ఓ వ్యక్తి టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు.
Israel Palestine Attack:
పారిస్‌లో ఘటన..
ఇజ్రాయేల్,హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తక్షణమే ఆపేయాలంటూ పారిస్‌లో ఓ వ్యక్తి టవర్ ఎక్కాడు. ఫ్రాన్స్‌కి చెందిన అలైన్ రాబర్ట్ (Skyscraper Alain Robert) స్కైస్క్రాపర్. అంటే ఎత్తైన బిల్డింగ్‌లు, టవర్‌లు ఎక్కడం ఆయనకు అలవాటు. రాబర్ట్‌ని అందరూ Spiderman అని పిలుచుకుంటారు. అంత సింపుల్‌గా బిల్డింగ్‌లు ఎక్కేస్తాడు. అయితే..ప్రతిసారీ సరదాగా ఎక్కే రాబర్ట్ ఈ సారి మాత్రం ఓ బాధ్యత తీసుకున్నాడు. ఇజ్రాయేల్, హమాస్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిపోయి, మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలని కోరుకుంటూ Tour Hekla టవర్ ఎక్కాడు. ప్రస్తుతం ఆయన వయసు 48 ఏళ్లు. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఈ సాహసం చేశాడు. వీలైనంత త్వరగా ఈ రెండు ప్రాంతాల మధ్య శాంతి నెలకొల్పాలని కోరుకున్నాడు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి ఈ టవర్ ఎక్కాడు.
"శాంతియుత వాతావరణం నెలకొనాలనే లక్ష్యంతోనే నేనీ టవర్ ఎక్కాను. నాకు ఎవరివైపూ మాట్లాడాలని లేదు. పాలస్తీనా, ఇజ్రాయేల్‌లో ఎవరి తరపునా మద్దతునివ్వడం లేదు. కానీ అక్కడ ఉద్రిక్తతలు తగ్గిపోవాల్సిన అవసరముంది. అది ఎంత తొందరగా జరిగితే అంత మేలు. రెండు ప్రాంతాల మధ్య శాంతి ఒప్పందాలు జరగాలి. ఆ విధంగా ఎవరికి కావాల్సింది వాళ్లు దక్కించుకునేందుకు వీలవుతుంది. దాదాపు 70 ఏళ్లుగా ఈ ఘర్షణ జరుగుతూనే ఉంది. ఏదో ఓ సమయంలో దీనికి స్వస్తి పలకాల్సిందే. కూర్చుని మాట్లాడుకుని సమస్యని పరిష్కరించుకోవాలి"
- అలైన్ రాబర్ట్, స్కైస్క్రాపర్
View this post on Instagram
పరిష్కరించుకోవాలంటూ సూచన..
రెండు వైపుల వాళ్లు కూర్చుని ఏదో పరిష్కారం కనుగొనాల్సిన అవసరముందని అంటున్నాడు రాబర్ట్. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచం యుద్ధం వచ్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశాడు. ముస్లిం దేశాలన్నీ కలిసి ఇజ్రాయేల్‌పై దాడులు చేయడం మొదలు పెడితే పరిస్థితులు మరీ దారుణంగా దిగజారుతాయని అన్నాడు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని వాదించుకోవడం కన్నా శాంతియుతంగా సమస్యల్ని పరిష్కరించుకోవడం ముఖ్యం అని సూచిస్తున్నాడు. కొన్ని దేశాలు డాలర్ల కొద్ది నిధులు అందించి మరీ యుద్ధాన్ని ప్రోత్సహిస్తుండడం బాధాకరమని అన్నాడు.
పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయేల్ దాడులు (Israel Hamas War) కొనసాగుతూనే ఉన్నాయి. రోజురోజుకీ ఇవి ఉద్ధృతమవుతున్నాయి. అయితే ఈ దాడుల్లో ఉగ్రవాదులతో పాటు సాధారణ పౌరులూ ప్రాణాలు కోల్పోతున్నారు. గాజాలోని ఓ బిల్డింగ్‌పై ఇజ్రాయేల్ దాడులు చేయగా..30 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. శరణార్థుల క్యాంప్ ఉన్న చోటే ఈ దాడి జరిగింది. ఈ ధాటికి బిల్డింగ్ కుప్ప కూలింది. పరిసర ప్రాంతాల్లోని భవనాలూ నేలమట్టమయ్యాయి. గత 24 గంటల్లో ఇజ్రాయేల్ దాడుల కారణంగా 266 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు గాజా హెల్త్ మినిస్ట్రీ అధికారికంగా ప్రకటించింది. మృతుల్లో 117 మంది చిన్నారులే ఉన్నారు. అక్టోబర్ 7 నుంచి దాడులు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇజ్రాయేల్‌లో 4,600 మంది మృతి చెందారు. ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో మళ్లీ అలజడి మొదలైంది. ఈ క్రమంలోనే ఇజ్రాయేల్ మిలిటరీ సంచలన ప్రకటన చేసింది. లెబనాన్‌లో హిజ్బుల్లా (Hezbollah Cells) సెల్స్‌పై దాడి చేసినట్టు వెల్లడించింది.