ఇజ్రాయేల్ సైనికులకు ఫ్రీ మీల్స్ ఇస్తున్న మెక్‌డొనాల్డ్స్, రెస్టారెంట్‌లలో 50% డిస్కౌంట్ కూడా
McDonald's Free Meals: ఇజ్రాయేల్ సైనికులకు మెక్‌డొనాల్డ్స్ ఫ్రీగా మీల్స్ అందిస్తోంది.
McDonald's Free Meals:
ఫ్రీ మీల్స్..
పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయేల్ సైన్యం విరుచుకుపడుతోంది. బంకర్లకు గురి పెట్టి కాల్పులు జరుపుతోంది. ఏ మాత్రం వెనకాడకుండా యుద్ధం కొనసాగిస్తున్నారు సైనికులు. వీళ్లందరికీ ఉచితంగా ఆహారం అందించేందుకు ముందుకొచ్చింది మెక్‌డొనాల్డ్స్ (McDonald's Free Meals) సంస్థ. ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్‌కి చెందిన బలగాలతో పాటు అక్కడి పౌరులకీ రోజుకి 4 వేల మీల్స్ ఉచితంగా అందిస్తోంది. అంతే కాదు. మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌కి వచ్చే సైనికులకు, భద్రతా బలగాలకు 50% డిస్కౌంట్‌లు కూడా ఇస్తోంది. దీనిపై ట్విటర్‌లో స్పెషల్ పోస్ట్‌లూ పెట్టింది.
"IDF యూనిట్స్‌లోని బలగాలకు మెక్‌డొనాల్డ్స్ తరపున వేలాది మీల్స్‌ని ఉచితంగా అందిస్తున్నాం. పోలీసులకు, ఆసుపత్రుల్లోని రోగులకు, గాజాలోని యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని పౌరులకు ఉచితంగా ఆహారం ఇస్తున్నాం. ఇదే విధంగా ఇంకొన్ని రోజుల పాటు కొనసాగిస్తాం. దీంతో పాటు మా రెస్టారెంట్‌కి వచ్చే ఇజ్రాయేల్ సైనికులకు 50% డిస్కౌంట్‌లూ ఇస్తాం"
- మెక్‌డొనాల్డ్స్ యాజమాన్యం
Statement from McDonald’s Oman pic.twitter.com/SzKz7lhmgk
— McDonald’s Oman (@Mcdonaldsoman) October 14, 2023
5 స్పెషల్ రెస్టారెంట్‌లు..
ఈ ఫ్రీ మీల్స్ అందించేందుకే ప్రత్యేకంగా 5 రెస్టారెంట్‌లు తెరిచినట్టు ప్రకటించింది మెక్‌డొనాల్డ్స్. రోజుకి కచ్చితంగా 4 వేల ఫ్రీ మీల్స్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకూ దాదాపు 12 వేల మేర ఫ్రీ మీల్స్ ఇచ్చింది. ఈ నిర్ణయంపై చాలా మంది సానుకూలంగా స్పందించారు. ఇదే సమయంలో విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. వార్ జోన్‌లో ఇలా పూర్తిగా ఓ స్టాండ్ తీసుకుని ఇజ్రాయేల్ సైనికులకు మాత్రమే ఉచితంగా మీల్స్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా ముస్లిం వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. లెబనాన్‌లో మెక్‌డొనాల్డ్స్‌కి వ్యతిరేకత పెరిగింది. గాజాలో చాలా మంది ఈ సాయం అందడం లేదని కొందరు మండి పడుతున్నారు. పైగా ముస్లింలకు ఇవ్వడం లేదన్న వాదనలూ తెరపైకి వచ్చాయి. ఆ తరవాత మెక్‌డొనాల్డ్స్ మేలుకుంది. ట్విటర్‌లో ఓ నోట్ విడుదల చేసింది. గాజాకి ఎప్పటికీ మద్దతుగా ఉంటామని ప్రకటించింది. ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనాలని ప్రార్థిస్తున్నట్టు వెల్లడించింది. అప్పుడు కానీ ఈ వివాదం కాస్త సద్దుమణగలేదు.
Statement from Al Maousherji Catering Company - McDonald’s Kuwait pic.twitter.com/sQyiwgeLjI
— McDonalds Kuwait (@McDonaldsKuwait) October 14, 2023
అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడులు మొదలు పెట్టారు. గాజాలో ఓ మ్యూజిక్ ఫెస్ట్‌పైనా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. కొంత మందిని కిడ్నాప్ చేశారు. మరి కొందరిని అక్కడికక్కడే కాల్చి చంపారు. అప్పటి వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 7న గాజాలో ఓ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. ఆ ఫెస్ట్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఏ ఒక్కరూ ప్రాణాలు లేకుండా అందరినీ వెతికి వెతికి మరీ చంపారు. ఎంత దారుణం అంటే...టాయిలెట్స్‌లో ఎవరైనా ఉంటే బతికిపోతారని, అందులో దాక్కుని ఉంటారని అనుమానంతో వాటి డోర్స్‌పైనా బులెట్ల వర్షం కురిపించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
WATCH Hamas terrorists indiscriminately shoot at bathrooms during the Nova Music Festival.
— Israel Defense Forces (@IDF) October 13, 2023
This just shows you that Hamas does not care who—they just kill. pic.twitter.com/Ve0u9HRLWT
Also Read: ఇది కేవలం ముస్లింల సమస్య కాదు, మోదీ సాబ్ కాస్త ఆలోచించండి - పాలస్తీనా వివాదంపై ఒవైసీ