అన్వేషించండి

దయచేసి నన్ను చంపొద్దు, పాలస్తీనా ఉగ్రవాదుల్ని వేడుకున్న యువతి - వైరల్ వీడియో

Israel Gaza Attack: కిడ్నాప్‌కి గురైన ఇజ్రాయేల్ యువతి చంపొద్దంటూ వేడుకున్న వీడియో వైరల్ అవుతోంది.

Israel Gaza Attack: 


ఇజ్రాయేల్‌లో అల్లకల్లోలం..

హమాస్ ఉగ్రవాదుల దాడులతో ఇజ్రాయేల్ పౌరులు (Israel Palestine War) అల్లాడిపోతున్నారు. మహిళల్ని, చిన్నారుల్ని కిడ్నాప్ చేస్తున్నారు. దారుణంగా హింసిస్తున్నారు. చిన్నారులనూ దారుణంగా చంపేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ 25 ఏళ్ల యువతి కిడ్నాప్‌కి గురైన వీడియో వైరల్ అవుతోంది. ఓ రేవ్ పార్టీలో ఉన్న నోవా అర్గమని (Noa Argamani) హమాస్ ఉగ్రవాదులు వచ్చి కిడ్నాప్ చేశారు. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉండగా అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పార్టీలో ఉన్న వాళ్లపై రాకెట్ దాడులు కూడా చేశారు. ఆ తరవాత ఆ యువతిని కిడ్నాప్ చేశారు. బైక్‌పై బలవంతంగా కూర్చోబెట్టి తీసుకెళ్లారు. ఆ సమయంలో యువతి గట్టిగా అరిచింది. దయచేసి చంపొద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఓ టెర్రరిస్ట్  (Hamas Attack) ఇదంతా వీడియో తీసి పోస్ట్ చేశాడు. పక్కనే ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నప్పటికీ నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఉగ్రవాదులు చుట్టుముట్టడం వల్ల ఏమీ చేయలేకపోయాడు.

ఆ తరవాత యువతి సోదరుడు మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చాడు. ఎమర్జెన్సీ టీమ్స్‌ అప్రమత్తమయ్యాయి. తనకు ఎన్ని సార్లు కాల్ చేసినా కలవడం లేదని, ఎలా ఉందో తెలియడం లేదని ఆమె సోదరుడు ఆందోళన చెందుతున్నాడు. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని, అంతా షాకింగ్‌గా ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. మరో యువతి కూడా కిడ్నాప్‌కి గురైంది. ఆమెని చిత్రహింసలకు గురి చేసి అత్యాచారం చేశారు. ఆ తరవాత నగ్నంగా వీడియో తీశారు ఉగ్రవాదులు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి రాక్షసానందం పొందారు. ఆ యువతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తన కూతురు ఆచూకీ ఎక్కడుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
Embed widget