ఇజ్రాయేల్ ఎయిర్ ఫోర్స్ భీకర దాడులు, మరో హమాస్ కమాండర్ హతం
Hamas Palestine Attack: ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో హమాస్ కీలక కమాండర్ హతమయ్యాడు.
Hamas Palestine Attack:
హమాస్ కమాండర్ మృతి..
హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయేల్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. వరుస పెట్టి అన్ని బంకర్‌లనూ ధ్వంసం చేస్తోంది. ఈ దాడుల్లో పౌరులూ ప్రాణాలు కోల్పోతున్నా వెనక్కి తగ్గడం లేదు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేసి దాడులు కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయేల్ ఎయిర్ ఫోర్స్ ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే హమాస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ హతమయ్యాడు. ఇప్పుడు మరో హమాస్ కమాండర్‌ని మట్టుబెట్టింది ఇజ్రాయేల్ సైన్యం. ఇజ్రాయేల్ సరిహద్దు గ్రామాలైన నిరిమ్, నిర్ ఆజ్ ప్రాంతాలపై దాడులను లీడ్ చేసిన కమాండర్ బిలాల్ అల్ కెద్రా ఉన్న భవనాన్నే లక్ష్యంగా చేసుకుని రాకెట్‌ల వర్షం కురిపించింది. ఇజ్రాయేల్ ఎయిర్ ఫోర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రటించింది. ఈ దాడులకు సంబంధించిన వీడియోనూ ట్విటర్‌లో షేర్ చేసింది.
"ఇజ్రాయేల్ ఎయిర్ ఫోర్స్ వరుస దాడులతో గాజా సరిహద్దు వద్ద ఉన్న హమాస్ ఉగ్రవాదులు చెల్లాచెదురయ్యారు. ఈ దాడుల్లో హమాస్ కమాండర్ బిలాల్ హతమయ్యాడు. సరిహద్దు గ్రామాల్లో హమాస్ దాడులను బిలాల్ లీడ్ చేశాడు. మరి కొన్నిచోట్లా దాడులు జరిగాయి. జేటన్, ఖాన్ యూనిస్, వెస్ట్ జబలియా ప్రాంతాల్లో ఇజ్రాయేల్ మిలిటరీ పెద్ద ఎత్తున మొహరించింది. ఈ దాడుల కారణంగా హమాస్ బాగా దెబ్బ తింది. ఆపరేషనల్ కమాండ్ సెంటర్స్‌నే లక్ష్యంగా చేసుకుంటున్నాం. ఇస్లామిక్ జిహాద్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌కి చెందిన కమాండ్ సెంటర్‌లనూ నేలమట్టం చేశాం."
- ఇజ్రాయేల్ ఎయిర్ ఫోర్స్
As part of the extensive IAF strikes of senior operatives and terror infrastructure in the Gaza Strip, the IDF and ISA killed the Nukhba commander of the forces in southern Khan Yunis, who was responsible for the Kibbutz Nirim massacre pic.twitter.com/UTspdQYgSN
— Israeli Air Force (@IAFsite) October 15, 2023
గాజా వద్ద జరిగిన దాడుల్లో హమాస్ ఏరియల్ ఫోర్స్ హెడ్ మురద్ అబ్ మురద్ (Murad Abu Murad) మృతి చెందినట్టు తెలిపింది. గాజాలో హమాస్ ఉగ్రవాదులకు ఓ హెడ్‌క్వార్టర్స్ ఉంది. అందులో నుంచే ఇజ్రాయేల్‌పై మెరుపు దాడులకు ప్లాన్ చేశారు. గగనతలం నుంచి దాడులు చేశారు. ఇప్పుడా భవనంపై ఇజ్రాయేల్ సైన్యం దాడి చేసింది. అందులో ఉన్న మురద్ అబ్ మురద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు The Times of Israel స్పష్టం చేసింది. ఉగ్రవాదులను ముందుండి లీడ్ చేసిన మురద్ని మట్టుబెట్టినట్టు తెలిపింది. హమాస్ కమాండో ఫోర్సెస్ దాక్కుని ఉన్న అన్ని ప్రాంతాలనూ ధ్వంసం చేస్తోంది ఇజ్రాయేల్ సైన్యం. హమాస్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటోంది. గత వారం హమాస్ ఉగ్రవాదులు ఉన్నట్టుండి ఇజ్రాయేల్‌పై మిజైల్స్ పంపారు. భవనాలు నేలమట్టం అయ్యాయి.
Also Read: ఇది కేవలం ముస్లింల సమస్య కాదు, మోదీ సాబ్ కాస్త ఆలోచించండి - పాలస్తీనా వివాదంపై ఒవైసీ