ఆ దేశంలో సెటిల్ అయితే చాలు, ఉద్యోగం చేయకుండానే రూ.లక్షలు సంపాదించొచ్చు
Ireland Offer: ఐర్లాండ్‌లో సెటిల్ అయిన వాళ్లకు రూ.71లక్షలు ఇస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
Ireland Offer:
ఐర్లాండ్ ఆఫర్..
అబ్రాడ్‌కి వెళ్లాలని చాలా మంది కలలు కంటారు. కొందరైతే అక్కడే సెటిల్ అవ్వాలనీ అనుకుంటారు. ఇది చెప్పినంత సింపుల్ కాదు. అక్కడి వాతావరణానికి సెట్ అవ్వాలి. ఖర్చులకు తగ్గ జీతం వచ్చే ఉద్యోగమూ ఉండాలి. ఇదంతా అవ్వాలంటే ముందు మనం గట్టిగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ...ఓ దేశం మాత్రం "మీరు మా దగ్గరికొచ్చి ఉండండి. మేమే తిరిగి డబ్బులిస్తాం" అని బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐర్లాండ్ కంట్రీ ఇచ్చిన ఆఫర్ ఇది. మరి ఎందుకింత దయ..? అనేగా మీ డౌట్. అందుకు ఓ కారణముంది. అక్కడ జనాభా తగ్గిపోతోందట. ఎలాగైనా సరే పాపులేషన్ పెంచుకోవాలని చూస్తున్న ఆ ద్వీప దేశం ఈ ఆలోచనతో ముందుకొచ్చింది. "Our Living Islands" పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ఆ దేశ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం...ఐర్లాండ్‌లో సెటిల్ అయిన వాళ్లకు ఆ ప్రభుత్వం 80వేల యూరోలు ఇస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.71లక్షలు. అవర్ లివింగ్ ఐల్యాండ్స్ పాలసీ దాదాపు 30 ద్వీప దేశాల్లో అమలవనుంది. ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉండే ఈ దేశాల ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ విధానం తీసుకొచ్చారు. అక్కడి కమ్యూనిటీస్‌తో కమ్యూనికేషన్ పెరగడానికీ ఇది ఉపకరించనుంది. "మేమూ ఈ భూమ్మీదే ఉన్నాం. మమ్మల్నీ పట్టించుకోండి" అని తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారన్నమాట. ఐడియా అదిరిపోయింది కదా.
కండీషన్స్ ఏంటి..?
ఐర్వాండ్‌లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్లు కచ్చితంగా అక్కడ ఏదో ఓ ప్రాపర్టీ కొనుగోలు చేయాలి. ఆ ప్రాపర్టీ 1993కి ముంది నిర్మించిందై ఉండాలి. కనీసం రెండేళ్ల పాటు ఖాళీగా ఉన్న ప్రాపర్టీస్‌ని మాత్రమే కొనుగోలు చేయాలని రూల్ పెట్టారు. ఇక ప్రభుత్వం ఇచ్చే రూ.71 లక్షల మొత్తాన్ని ఆ ప్రాపర్టీ మెయింటేనెన్స్ ఖర్చులకే వినియోగించాలి. అంటే...ఆ ఇంటిని రెనొవేట్ చేసుకోడానికి లేదంటే అందంగా కనిపించేలా తీర్చి దిద్దేందుకు మాత్రమే ఆ డబ్బుని ఖర్చు పెట్టాలి. ఈ ఆఫర్ నచ్చిన వాళ్లు జులై 1వ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని కండీషన్స్‌కి ఓకే అనుకుంటేనే అప్లై చేసుకోవాలని ఐర్లాండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఐల్యాండ్‌ని కొనేశాడు..
ఇసుక పోసి కృత్రిమంగా తయారు చేసిన ఓ ఐల్యాండ్‌ని (Dubai Island) కోట్లు పెట్టి మరీ కొన్నాడు దుబాయ్‌కి చెందిన ఓ వ్యక్తి. అక్కడి మార్కెట్‌లో ఇదో రికార్డు. ఆ ద్వీపాన్ని కొనుగోలు చేసేందుకు రూ.3.4 కోట్లు ఖర్చు పెట్టాడు. 24,500 స్క్వేర్ ఫీట్‌ల స్థలం అది. దుబాయ్ మెయిన్ ల్యాండ్‌కి ఈ ద్వీపానికి మధ్యలో బ్రిడ్జ్ కూడా ఉంది. సో...ట్రావెలింగ్‌కి కూడా పెద్ద ఇబ్బంది లేదు. అందుకే అంతగా అక్కడ డిమాండ్ పెరిగింది. స్క్వేర్ ఫీట్‌కి 5 వేల దిర్హాంలు ఫిక్స్ చేశారు. అయితే...ఈ ఐల్యాండ్‌ని ఎవరు కొన్నారన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇది కొన్నది UAE వ్యక్తి కాదని మాత్రం తెలుస్తోంది. కేవలం హాలిడేలో ఎంజాయ్ చేసేందుకు ఆ వ్యక్తి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాడట. ఫ్యామిలీతో పాటు వెకేషన్‌కి వచ్చినప్పుడు ఇక్కడే ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట.