Viral News: డ్యూటీ టైంలో లవర్‌తో శృంగారం చేస్తూ చచ్చిపోయాడు - పనిలో ప్రమాదం అని కంపెనీతో పరిహారం ఇప్పించిన కోర్టు !
China Court: అతడు ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. అక్కడో లవర్ ఉంది. ఆమెతో డ్యూటీ టైంలో శృంగారం చేసేవాడు. ఇలా చేస్తున్నప్పుడు గుండెపోటుతో చనిపోయాడు. అక్కడ్నుంచి అసలు కథ ప్రారంభమయింది

Died During Workplace romance: చైనాలో ఓ అరవై ఏళ్ల సెక్యూరిటీ గార్డు మరణాన్ని అక్కడి కోట్లు పారిశ్రామిక ప్రమాదంగా నిర్దారించి ..కంపెనీ నుంచి పరిహారం ఇప్పించింది.అతను ఎలా చనిపోయాడో తెలిస్తే అది ఎలా ప్రమాదం అవుతుందని ఆశ్చర్యపోతారు. అసలేం జరిగిందంటే ?
సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న జాంగ్
చైనాలోని ఓ కంపెనీలో జాంగ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. అతను సెక్యూరిటీ గార్డు. వాయసు కూడా అరవై ఏళ్లు. అయితే అక్కడ అతనికి ఓ లవర్ ఉంది. ఆమెతో శృంగారం చేయాడానికి బాత్ రూమ్ ను ఉపయోగించుకునేవాడు. బాత్ రూమ్ బ్రేక్ పేరుతో ఇద్దరూ కలిసేవాళ్లు. అక్కడ పనులు పూర్తి చేసుకునేవారు. అయితే అతను ఇలా పనిలో ఉన్నప్పుడు హఠాత్తుగా చనిపోయాడు. అతను ఓ మహిళతో శృంగారం చేస్తున్న సమయంలో చనిపోయాడని తెలుసుకున్న కంపెనీ .. పరిహారం ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.
స్నేహితురాలితో శృంగారం చేస్తూ మృతి
పోలీసు విచారణలో ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని , మరణం ప్రమాదవశాత్తు జరిగిందని తేల్చారు. ఒక సంవత్సరం తర్వాత, మిస్టర్ జాంగ్ కుమారుడు జాంగ్ జియావోషి మున్సిపల్ సోషల్ సెక్యూరిటీ బ్యూరోలో పరిహారం కోసం పిటిషన్ వేశాడు. కానీ అధికారులు దానిని తిరస్కరించారు. చనిపోయిన సమయంలో జాంగ్ తన స్నేహితురాలితో డేటింగ్ చేస్తున్నందున, తన విధులను నిర్వర్తించనందున మరణం పారిశ్రామిక ప్రమాదం కాదని వారు పేర్కొన్నారు.
పరిహారం ఇచ్చేది లేదన్న కంపెనీ - కోర్టుకెళ్లిన జాంగ్ కొడుకు
అయితే కుటుంబ సభ్యులు ఈ అంశంపై చైనాలో కోర్టును ఆశ్రయించారు. ఫ్యాక్టరీలో ఏకైక సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడని పైగా అతను ఎటువంటి సెలవు లేకుండా నిరంతరాయంగా పనిచేశాడని కోర్టుకు తెలిపారు. తన తండ్రి నిరంతరం పని చేయాల్సి వచ్చినందున, అతని మరణాన్ని కార్యాలయంలో జరిగిన మరణంగా పరిగణించాలని కోరాడు. జాంగ్ తన ఉద్యోగాన్ని వదిలి వెళ్ళలేకపోయాడు కాబట్టి.. తన సెక్యూరిటీ గదిలో స్నేహితురాలిని కలిశాడని వాదించారు. తన తండ్రి భావోద్వేగ అవసరాలు సాధారణమని జాంగ్ కుమారుడు జియావోషి కోర్టులో వాదించారు.
పారిశ్రామిక ప్రమాదంగా నిర్దారించిన కోర్టు
ప్రేమ సంబంధం కలిగి ఉండటం విశ్రాంతిలో ఒక భాగం అని.. అతను తన పని ప్రదేశంలోనే ఉన్నాడన్నారు. అందువల్ల, అతని అకాల మరణాన్ని పారిశ్రామిక ప్రమాదంగా గుర్తించాలని వాదించారు. కోర్టు ఈ వాదనలు వినిపి.. జాంగ్ మరణం పారిశ్రామిక ప్రమాదమేనని పరిహార ంఇవ్వాలని స్పష్టం చేసిది. మిస్టర్ జాంగ్ మరణాన్ని వృత్తిపరమైన ప్రమాదంగా నిర్దారరించినట్లుగా సామాజిక భద్రతా అధికారులు ధృవీకరించారు. కానీ అతని కుటుంబానికి ఎంత పరిహారం అందుతుందో అది పేర్కొనలేదు. ఈ కేసు చైనాలో వైరల్ అయింది.





















