అన్వేషించండి

Middle East War: పశ్చిమాసియాలో బాంబుల మోత! భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు! 

Middle East War: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఇరాన్‌లోని భారత్‌ రాయభార కార్యాలయం 48 గంటల పాటు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇరాన్‌లో భారతీయులకు 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని సూచన.
  • అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశం.
  • అనవసర ప్రయాణాలు, బహిరంగ ప్రదేశాలకు వెళ్లకుండా నివారించాలని సూచన.
  • అత్యవసర సహాయానికి భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసింది.

Middle East War: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న వైరం ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఉన్న భారత రాయభార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రత దృష్ట్యా అత్యంత కీలకమైన అడ్వైజరీని విడుదల చేసింది. 

మధ్య ప్రాచ్యంలో ముదురుతున్న సంఘర్షణల దృష్ట్యా ఇరాన్‌లో ఉన్న భారతీయులందరూ రాబోయే 48 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత ఎంబసీ ఆదేశించింది. పౌరులు తాము ఎక్కడ ఉన్నరో అక్కడే ఉండాలని చెప్పింది. అనవసరంగా బయటకు రావద్దని స్పష్టం చేసింది. ముఖ్యంగా బహుళ అంతస్తుల్లో ఉన్న వారు పై అంతస్తుల్లో ఉండొద్దని హితవు పలికింది. సురక్షితమైన కింది గదుల్లోకి మారాలని సూచించింది. ఎంబసీ ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో ఉంటున్న వారు తమ గదులను వదిలి బయటకు రావద్దని,, నిరంతతరం ఎంబసీ బృందాలతో టచ్‌లో ఉండాలని స్పష్టం చేసింది.

ఎందుకూ ఈ ఆదేశాలు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన గడువు ముగుస్తుంటడమే ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని లేని పక్షంలో ఇరాన్‌ ఒక నాగరితగా అంతరించిపోయే ప్రమాదం ఉందని ట్రంప్ సోషల్ మీడియా వేదికంగా హెచ్చరించారు. ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, వంతెనలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని అమెరికా హెచ్చరించడంతో ఆయా ప్రాంతాలకు భారతీయులు దూరంగా ఎంబసీ భావిస్తోంది. 

ఆదేశాలు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చాయంటే?

ఈ హెచ్చరికలు ఏప్రిల్ 7 నుంచి తక్షణం అమలులోకి వచ్చాయి. రాబోయే 48 గంటలు అంటే ఏప్రిల్ 9 వరకు అత్యంత కీలకమని ఎంబసీ పేర్కొంది,. ఈ కాలంలో ఎటువంటి రహదారి ప్రయాణాలు చేయకూడదని, ఒక వేళ అత్యవసరమైతే తప్పనిసరిగా ఎంబసీ సమన్వయంతోనే కదలాలని నిబంధన విధించింది. 

ఎలా అప్రమత్తంగా ఉండాలి?

భారతీయ పౌరులు సహాయార్థం ఎంబసీ నిరంతరం పని చేసే హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేసింది. 

అత్యవసర మొబైల్ నంబర్లు: +989128109115, +989128109102, +989128109109, +989932179359

ఈమెయిల్: cons.tehran@mea.gov.in

పౌరులు అధికారిక ప్రకటనలను నిరంతరం గమనిస్తూ ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దని ఎంబసీ కోరింది. విద్యుత్ గ్రిడ్లు, సైనిక స్థావరాలు, వ్యూహాత్మక భవనాలకు వీలైనంత దూరంగా ఉండటం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని సూచించింది. 

Frequently Asked Questions

పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమిటి?

అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇరాన్‌లో ఉన్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం ఎటువంటి సలహాలు ఇచ్చింది?

రాబోయే 48 గంటలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు రావద్దని, సురక్షితమైన కింది గదుల్లో ఉండాలని సూచించింది. ఎంబసీ వసతి గృహాల్లో ఉన్నవారు బయటకు రావద్దని, ఎంబసీతో నిరంతరం టచ్‌లో ఉండాలని ఆదేశించింది.

ఈ హెచ్చరికలు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చాయి?

ఈ హెచ్చరికలు ఏప్రిల్ 7 నుంచి తక్షణం అమలులోకి వచ్చాయి. రాబోయే 48 గంటలు, అంటే ఏప్రిల్ 9 వరకు అత్యంత కీలకమని ఎంబసీ పేర్కొంది.

భారతీయులు ఎలా అప్రమత్తంగా ఉండాలి?

అధికారిక ప్రకటనలను గమనిస్తూ, పుకార్లను నమ్మవద్దని సూచించారు. విద్యుత్ గ్రిడ్లు, సైనిక స్థావరాలు, వ్యూహాత్మక భవనాలకు దూరంగా ఉండాలి.

టాప్ హెడ్ లైన్స్

Japan Earthquake:జపాన్‌ను వణికించిన 7.1 భూకంపం: సునామీ హెచ్చరికతో హైఅలర్ట్!
జపాన్‌ను వణికించిన భూకంపం, 7.1 తీవ్రతతో కంపించిన భూమి, సునామీ హెచ్చరిక జారీ  
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Diamond Merchant Kidnap: మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget