India Pakistan Attack News: బుద్ధి మార్చుకోని పాకిస్థాన్- భారత్‌పై నెపం నెట్టేందుకు విఫలయత్నం
India Pakistan Attack News: కిందపడినా సరే తమదే పైచేయి అన్నట్టు పాకిస్థానా వాదిస్తోంది. ఇంత జరుగుతున్నా నెపాన్ని భారత్‌పై నెట్టేసేందుకు శతవిధాలుగా ట్రై చేస్తోంది.

India Pakistan Attack News :భారత్‌పై తాము దాడులకు యత్నించామని పాకిస్థాన్ అంగీకరించింది. పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఓ వీడియో విడుదల చేశారు. సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య శనివారం మూడు కీలక వైమానిక స్థావరాలపై భారత్ క్షిపణులను ప్రయోగించిందని పాకిస్థాన్ పేర్కొంది. వాటిని చాలా వరకు అడ్డుకున్నామని తెలిపింది.
పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి వీడియో విడుదల చేశారు. భారత్ దాడుల తర్వాత తమ దేశ వైమానిక దళ ఆస్తులు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని భారత క్షిపణులే పంజాబ్‌ను తాకాయని ఆరోపించారు.
పాకిస్తాన్ ప్రకారం... దాడి జరిగిన వైమానిక స్థావరాల్లో ఇవి ఉన్నాయి: నూర్ ఖాన్ (చక్లాలా, రావల్పిండి), మురిద్ (చక్వాల్), రఫికి (ఝాంగ్ జిల్లాలోని షోర్కోట్). పాకిస్తాన్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం రాజధాని ఇస్లామాబాద్ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.
AP నివేదిక ప్రకారం, జమ్మూ కశ్మీర్‌లోని పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని భారత వైమానిక స్థావరాలు, క్షిపణి నిల్వ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ సైన్యం మీడియం-రేంజ్ ఫతే క్షిపణులను ఉపయోగించింది. ఈ ప్రాంతాల నివాసితులు శ్రీనగర్, జమ్మూ సహా అనేక ప్రదేశాల్లో పెద్ద పేలుళ్ల శబ్దాలు విన్నారని చెప్పారు.
దేశంలోని వైమానిక స్థావరాలపై దాడిని షరీఫ్ "అత్యున్నత స్థాయి రెచ్చగొట్టే చర్య"గా అభివర్ణించారు. కొన్ని భారత క్షిపణులు ఆఫ్ఘనిస్తాన్‌లోకి వెళ్లాయని పేర్కొన్నారు.
"భారత్ అడంపూర్ నుంచి ఆరు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని తెలియజేయాలనుకుంటున్నాను" అని షరీఫ్ చెప్పినట్లు AP ఉటంకించింది. "బాలిస్టిక్ క్షిపణుల్లో ఒకటి అమృత్‌సర్‌ను తాకింది." అని కూడా ఆయన ఆరోపించారు.
వరుసగా రెండో రోజు రాత్రి శుక్రవారం నాడు కూడా పాకిస్తాన్ డ్రోన్ దాడులను ప్రారంభించింది. జమ్మూ కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు విస్తరించి ఉన్న 26 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, భారత దళాలు విమానాశ్రయాలు, వైమానిక స్థావరాలు సహా కీలక ప్రదేశాలకు నష్టం కలిగించకుండా డ్రోన్‌లను విజయవంతంగా నిరోధించాయి.
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో మాత్రమే కొందరికి గాయాలు అయ్యాయి. అక్కడ ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ఈ దాడిలో గాయపడ్డారు. ముందుజాగ్రత్త చర్యగా, పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేశారు.





















