Lab Grown Sperm: చర్మ కణాల నుంచి స్పెర్మ్ - ఎలుకలపై ప్రయోగం సక్సెస్
సంతానం లేక చాలా మంది దంపతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్ని వైద్యపరీక్షలు చేస్తున్నా సంతాన భాగ్యం లేదని తెలిసి కుంగిపోతున్నారు. అలాంటి వారికి శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెబుతున్నారు.
ఇంట్లో పిల్లలు ఆడుతుంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. అలాంటి ఆనందానికి చాలా మంది దంపతులు దూరంగా ఉండిపోతున్నారు. చాలా మంది సంతాన భాగ్యం లేక ఇంటాబయట అవమానాలు ఎదుర్కోంటున్నారు. టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నప్పటికీ సమస్య తీరే మార్కం లేక కుంగి పోతున్నారు. లక్షలు ఖర్చుపెట్టే స్థోమత ఉన్నప్పటికీ కొందరికి పిల్లలు కలగడం లేదు.
సంతానం లేని దంపతుల్లో ఏడింటిలో ఒక జంట సమస్య ప్రధానంగా మగవారిదేనంటున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతానికి ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలు మరికొన్ని నెలల్లో మనుషులపై కూడా ప్రయోగానికి సిద్ధమవుతున్నారు.
లాబ్‌లో స్పెర్మ్(Lab Grown Sperm) తయారీ విధానం విజయవంతం అయితే మాత్రం సైన్స్ రంగంలోనే అద్భతమే కాకుండా మగవారికి చాలా ప్రయోజనకరమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రయోగశాలలో మగ ఎలుక(Rat) చర్మం నుంచి కణాలు తీసుకొని ఈ కృత్రిమంగా స్పెర్మ్ రూపొందించారు. ఆ స్పెర్మ్‌ను ఆడ ఎలుక గర్భాశయంలో ప్రవేశ పెట్టారు. ఇప్పటికైతే ఇది మంచి ఫలితాలనే ఇచ్చిందని శాస్త్రవేత్తలు ఓ జనర్నల్‌కు చెప్పారు.
దీన్ని టూర్‌డి ఫోర్స్(tour de force)గా బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలుక ఎంబ్రియోస్ నుంచి కణాలను తీసుకొని స్పెర్మ్ తయారు చేశారు.
టోక్యోలోని యూనివర్శిటీ(University of Tokyo) చేసిన ఈ ప్రయోగంలో ఎంబ్రియోస్ నుంచి తీసుకున్న కణాలకు కెమికల్స్ మిక్స్ చేసి స్పెర్మ్‌గా మార్చారు.
స్పెర్మ్‌గా మారిన కణాలను మరింత వృద్ధి చెందడానికి వాటిని మగ ఎలుక జననాంగాల్లోకి పంపించారు. కొన్నిరోజుల తర్వాత ఐవీఎఫ్ ద్వారా ఆడ ఎలుక బాడీలోకి ఇంజెక్ట్ చేశారు.
Hope for infertile men as sperm is grown in lab from RAT cells in groundbreaking research
— Leeds News (@LeedsNews3) April 9, 2022
Scientists have now created lab-grown sperm cells (stock image) which, after being injected into male rats, were used to create babies. Daily Mail Science https://t.co/h9rAmvQxo6
ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటికే ఆ ఆడ ఎలుకకు చాలా పిల్లలు పుట్టినట్టు శాస్త్రవేత్తలు వివరించారు. దీనిపై లండన్ శాస్త్రవేత్తలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మానవ శుక్రకణాన్ని కృత్రిమంగా సృష్టించడం చాలా మంచి ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు.
ఇది విజయవంతమైతే... పురుషుడి చర్మ కణాలను మొదట మూలకణాలకుగా మార్చాలి. తర్వాత వాటిని స్పెర్మ్‌గా తీర్చిదిద్దవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు