Rishi Sunak: మళ్లీ ఉద్యోగంలో చేరిన రిషి సునాక్ - 70 గంటలు పని చేయాలని నెటిజన్ల సలహాలు
Rishi Sunak Goldman Sachs: యూకే మాజీ ప్రధాని రిషి సునాక్ ఉద్యోగంలో చేరారు. తన జీతం మొత్తాన్ని చారిటీకి విరాళంగా ఇస్తారు.

Rishi Sunak takes job at Goldman Sachs: బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునక్ గోల్డ్‌మన్ సాక్స్‌లో సీనియర్ అడ్వైజర్‌గా ఉద్యోగంలో చేరారు. జూలై 2024లో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం నుంచి తప్పుకున్న ఏడాది తర్వాత, జూలై 8, 2025న గోల్డ్‌మన్ సాక్స్‌లో సీనియర్ అడ్వైజర్‌గా చేరినట్లు ప్రకటించారు. సునక్ గతంలో 2000లో గోల్డ్‌మన్ సాక్స్‌లో సమ్మర్ ఇంటర్న్‌గా, 2001-2004 మధ్య అనలిస్ట్‌గా పనిచేశారు. ఇప్పుడు సీనియర్ అడ్వయిజర్ గా చేరారు.
సునక్ గోల్డ్‌మన్ సాక్స్ క్లయింట్లకు భౌ జియోపొలిటికల్,ఆర్థిక విషయాలపై సలహాలు ఇస్తారు. అలాగే, సంస్థ ప్రపంచవ్యాప్తంగా సిబ్బందికి సలహాలిస్తారు. గోల్డ్‌మన్ సాక్స్ సీఈఓ డేవిడ్ సోలమన్, “సునక్ తిరిగి కంపెనీలో చేరడాన్ని సవాగతించారు.
Former UK PM Rishi Sunak returns to Goldman Sachs as Senior Adviser, 20 years after starting there as a junior analyst
— Nabila Jamal (@nabilajamal_) July 8, 2025
He'll advise on geopolitics & donate his pay to charity
Imagine casually adding Former Prime Minister of United Kingdom in your LinkedIn :) @RishiSunak pic.twitter.com/KyZxrO343D
సునక్ గోల్డ్‌మన్ సాక్స్‌లో చేరిన వార్త సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, గతంలో భారతీయ యువత “వారానికి 70 గంటలు పనిచేయాలి” అని చేసిన వ్యాఖ్యలను సునక్‌కు ముడిపెట్టి సెటైర్లు వేస్తున్నారు. రిషి సునక్ భార్య .. నారాయణమూర్తి కుమార్తె. రిషి సునక్ గోల్డ్‌మన్ సాక్స్‌లో చేరి వారానికి 70 గంటల పని కోటాను పూర్తి చేస్తారని జోలుకు వేస్తున్నారు.
Rishi Sunak has joined Goldman Sachs to complete the quota of 70 hours of work per week.
— Aditya Singh (@Aditya_Singh_45) July 9, 2025
కొంత మంది ఇన్ఫోసిస్‌లో చేరకుండా గోల్డ్‌మన్ సాక్స్‌లో చేరారా? నారాయణ మూర్తి పని గంటలు ఆయనను భయపెట్టాయా?” అని ప్రశ్నించారు. కొంతమంది నెటిజన్లు సునక్ కొత్త పాత్రను స్వాగతించారు, ఆయన ఆర్థిక నైపుణ్యం , అనుభవం గోల్డ్‌మన్ సాక్స్‌కు ఆస్తిగా ఉంటాయని ప్రశంసించారు
ఇప్పటికే కుబేరుడు అయిన సునక్ గోల్డ్‌మన్ సాక్స్ నుంచి వచ్చే జీతాన్ని రిచ్‌మండ్ ప్రాజెక్ట్ అనే ఛారిటీకి దానం చేయనున్నారు. ఈ ఛారిటీని సునక్ , ఆయన భార్య అక్షతా మూర్తి కలిసి స్థాపించారు. ఇది యూకేలో పిల్లలు, యువతలో గణితం, సంఖ్యాశాస్త్ర నైపుణ్యాలను మెరుగుపరచడానికి కార్యక్రమాలు చేపడుతుంది. బ్రిటన్ ప్రధానిగా చేసిన తర్వాత మళ్లీ ఉద్యోగం చేయడానికి అనుమతి తీసుకోవాలి. యూకే అడ్వైజరీ కమిటీ ఆన్ బిజినెస్ అపాయింట్‌మెంట్స్ (ACOBA) సునక్ నియామకాన్ని కొన్ని షరతులతో ఆమోదించింది. మాజీ మంత్రులు కనీసం రెండేళ్లపాటు ప్రభుత్వ లాబీయింగ్ చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. సునక్ తన ప్రధానమంత్రి పదవిలో అందుబాటులో ఉన్న గోప్యమైన సమాచారాన్ని ఉపయోగించకూడదని, యూకే ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరపకూడదని కమిటీ హెచ్చరించింది.
గోల్డ్‌మన్ సాక్స్‌లో సీనియర్ అడ్వైజర్ జీతం సంవత్సరానికి సుమారు రూ. 1.7 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఈ జీతాన్ని ఛారిటీకి దానం చేయనున్నందున, ఆయన వ్యక్తిగతంగా ఈ మొత్తాన్ని స్వీకరించరు.





















