చైనాలోని కోల్‌మైన్ ఆఫీస్‌లో ఘోర అగ్నిప్రమాదం, 25 మంది మృతి - పలువురికి తీవ్ర గాయాలు
China Fire Accident: చైనాలోని ఓ బొగ్గు గని ఆఫీస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.
China Coal Mine Fire Accident:
అగ్ని ప్రమాదం..
చైనాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. లులియాంగ్‌లోని ఓ కోల్ మైన్‌లో జరిగిన ప్రమాదంలో 25 మంది చనిపోయినట్టు ప్రస్తుత సమాచారం. కోల్ కంపెనీ ఆఫీస్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఉదయం 6.50 నిముషాలకు ఈ ప్రమాదం సంభవించింది. 50 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బిల్డింగ్ నుంచి 63 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. విచారణ చేపట్టిన తరవాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. చైనా మీడియా వివరాల ప్రకారం...CC కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. Yongju Coal Company బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. చైనాలో ఈ తరహా అగ్నిప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది బలి అవుతున్నారని కొంత మంది వాదిస్తున్నారు.
25 people were killed in a fire at a coal company's office building in China's northern Shanxi province. The fire broke out at 6:50 a.m. at the four-story Yongju Coal Industry Joint Building in the country's top coal-producing hub of Shanxi: Reuters
— ANI (@ANI) November 16, 2023