Solar Storm : భూమికి గండం - దూసుకొస్తున్న అతి భారీ సౌర తుఫాన్ - పవర్ గ్రిడ్లు, ఇంటర్నెట్ పై ఆశలు వదులుకోవాల్సిందేనా ?
సూర్యుడిపై ఏర్పడిన అతి భారీ సౌరతుఫాన్ భూమి వైపు దూసుకొస్తోంది. దీని వల్ల పవర్ గ్రిడ్లు, ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడవచ్చని నాసా చెబుతోంది.
సూర్యుడు మండిపోతున్నాడు. ఎండాకాలం కదా ఇది సహజమే అనుకోవచ్చు. అతి అతి పెద్ద సౌరతుఫాన్ ఒకటి సూర్యుడిపై ప్రారంభమైందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA), నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) తాజాగా గుర్తించాయి. ఈ సౌర తుఫాన్ గతంలో వచ్చినటువంటివి కావని..దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనావేస్తున్నారు.
భారత్‌లో ఎవరూ హ్యాపీగా లేరా? ఆ జాబితాలో మనకంటే ముందే పాక్!
గత పదకొండేళ్లుగా సూర్యుడు అంతకంతకూ వేడెక్కుతున్నాడు. దీని ఫలితంగా సౌర తుఫానులు పదే పదే ఉత్పన్నమవుతున్నాయి, ఇవి క్రమం తప్పకుండా భూమిని తాకుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఇప్పటివరకు ఎటువంటి విధ్వంసం కలిగించలేదు. కానీ రెండు రోజుల క్రితం ఏర్పడిన సౌర తుఫాన్‌మాత్రం అతి భారీతనంతో ఉందని నాసా తెలిపింది. ఈ సౌర తుఫాను వల్ల భూమి దెబ్బతింటుందని.. బలం పూర్తి స్థాయిలో అంచనా వేయలేకోపుతున్నారు కానీ ప్రాథమిక అంచనాలను బట్టి తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు.
ఇమ్రాన్ రన్ అవుట్ ఖాయం - ఆర్మీ అడ్డం పడినా మ్యాచ్ నిలబడటం కష్టమే !
ప్రస్తుత సౌర తుఫాను బహుశా భూమిని తాకవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌర తుఫాను పెద్దదైతే అది ఆకాశంలో ఉన్న ఉపగ్రహాలను మరియు భూమిపై ఉన్న ఇంటర్నెట్ మరియు పవర్ గ్రిడ్‌లను నాశనం చేస్తుందని నాసా తేల్చేసింది. ఈ సౌర తుఫానులు వాటి బలాన్ని బట్టి చాలా విధ్వంసం కలిగిస్తాయి. ఇప్పటికే ఈ సౌర తుఫాన్ భూమి వైపు దూసుకొస్తోంది. రెండు రోజుల్లో తాకే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ చాలా సౌర తుఫానులు వచ్చాయి కానీ.. భూమికి పెద్ద నష్టం జరగలేదు.
నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ!
సౌరతుఫాన్లు భూమిని తాకుతూనే ఉంటాయి. వాటి మనుగడను చూడలేము, వినలేదు. కానీ భూవాతావరణంలో తీవ్రమైన మార్పులకు కారణమవుతాయి. సూర్యునిలో సంభవించే ఈ అసాధారణ చర్యతో విద్యుదావేశాలు, అయస్కాంత క్షేత్రాలు ప్రవాహంలా భూమి వైపునకు గంటకు 30 లక్షల మైళ్ళ వేగంతో దూసుకొని వచ్చి తాకినప్పుడు మిరుమిట్లు కొలిపే నార్దరన్ లైట్స్ (Northern lights) ఆర్కిటిక్ మృత సమీప పర్యావరణంలో కనిపిస్తాయి. దీనినే సౌర తుఫాన్ అంటారు. కరోనల్ మాస్ ఎజెక్షన్లు భూ అయస్కాంత తుఫాన్లు ఏర్పడి కృత్రిమ ఉపగ్రహాలకు, విద్యుత్ పవర్ గ్రిడ్లకు అంతరాయం కలిగిస్తాయి. అదే ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటోంది .