US Red Dye : వంటల్లో రెడ్ కలర్ వినియోగం నిషేధం - అమెరికా కీలక నిర్ణయం - మరి మన సంగతేంటి ?
US: అమెరికాలో వంటల్లో రెడ్ కలర్ వినియోగాన్ని ఎఫ్‌డీఏ నిషేధించింది. క్యాన్సర్ కారకంగా గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

FDA has banned the use of red color in cooking in America: వంటలకు కలర్ కనిపించేందుకు .. ఆకర్షణీయంగా కనిపించేలా చేసేందుకు ఫుడ్ కలర్స్ వాడుతూ ఉంటారు. అవి చాలా ప్రమాదకరమన్న చర్చ ఎప్పుడూ ఉంటుంది. కానీ వాటిని ఎప్పుడూ బ్యాన్ చేయడం లేదు. అమెరికాలోనూ ఇలాంటి ఆందోళనే వ్యక్తం కావడం.. క్యాన్సర్ కారకం అన్న ఆరోపమలు రావడంతో రెడ్ డై 3 అనే రంగును ఆహారపదార్థాల్లో వాడటాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
క్యాన్సర్ కారకం రెడ్ డై 3
ఆహార పదార్థాలు, డ్రింక్స్ ఆకర్షణీయంగా కనిపించేందుకు వాడేందు రెడ్ డై త్రీ అనే సింథటిక్ రంగును అమెరికన్ తయారీ కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. చెర్రీ పండ్లలాంటి ఎర్రని రంగు వచ్చేలా చేస్తుంది. స్వీట్స్, కేకులు, కుకీలు, ఫ్రోజెన్ డెజర్ట్స్, ఫ్రాస్టింగ్‌తో పాటు కొన్ని మందులలో ఉపయోగిస్తారు. రెడ్ డై 3 ని ఎరిత్రోసిన్ అని కూడా పిలుస్తారు. ఈ రెడ్ డై 3 క్యాన్సర్ కారకం అన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ సింథటిక్ రంగును లాబొరేటరీలో మగ ఎలుకలపై ప్రయోగించి అధ్యయనం జరిపినప్పుడు అందులో క్యాన్సర్ కారక లక్షణాలు ఉన్నాయని తేలింది. అమెరికా చట్టం ప్రకారం క్యాన్సర్‌కు ఏదైనా లింక్ కనుగొంటే అలాంటి పదార్థాలపై నిషేధం తప్పనిసరి.
Also Read: సిజేరియన్లకు పరుగులు పెడుతున్న ప్రెగ్నెంట్ మహిళలు - పిల్లలకు పౌరసత్వం కోసం అమెరికాలో కొత్త హడావుడి !
కాస్మోటిక్స్‌లో వినియోగం మూడు దశాబ్దాల కిందటే నిలిపివేత
కాస్మొటిక్స్‌లో రెడ్ డై 3 ఉపయోగించకుండా 35 సంవత్సరాల కిందటే అమెరికా నిషేధం విధించింది. అయితే పిల్లలు తినే బేకరీ ఐటమ్స్ లో వాడవచ్చని అనుమతి ఇచ్చారు. నిషేధం విధించలేదు. దీని వాడకంపై సెంటర్ ఫర్ సైన్స్ ఇన్ పబ్లిక్ ఇంటరెస్ట్ సహా అనేక సంస్థలు 2022లో ఎఫ్‌డీఏకు ఫిర్యాదు చేశాయి. అమెరికాలో వినియోగదారులు.. ప్రత్యేకించి పిల్లలు తినే తినుబండారాలలో దీనిని విస్తృతంగా ఉపయోగించడం వల్ల, క్యాన్సర్‌తో లింక్ ఉన్న ఈ రంగును నిషేధించాలని వారు వాదించారు. ఆధారాలను సమర్పించారు. చివరికి నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే చాలా కంపెనీలు స్వచ్చందంగా నిలిపివేత
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ యూరోపియన్ యూనియన్ దేశాలు ‘రెడ్ డై’పై ఆంక్షలు విధించాయి. కొంతమంది తయారీదారులు ఇప్పటికే రెడ్ డై 3 ఉపయోగాన్ని నిలిపివేశాయి. చాలా కంపసెనీలు ఇప్పటికే రెడ్ డై త్రీ తమ ఉత్పత్తుల్లో ఉండని ప్రత్యేకంగా చెప్పేవి. మన దేశంలో ఫుడ్ కలర్స్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటిని కూడా పరిశీలన చేసి బ్యాన్ చేయాలన్న డిమాండ్లు ఆరోగ్య రంగంలో ఉద్యమాలు చేసే వారి నుంచి వస్తున్నాయి.ఆహారపదార్ధాల్లో కల్తీ, నాసిరకం సామాగ్రి ఉపయోగించడం మన దగ్గర చాలా ఎక్కువ.
Also read: నాలుగో తరగతిలో బిల్ గేట్స్ రాక్స్ - టీచర్ షాక్స్ - ఆవు మూత్రపిండాలు తీసుకెళ్లాడట మరి !





















