Ericsson Layoffs : ఇక టెలికాం వంతు, 8500 మంది ఉద్యోగుల్ని తొలగించిన ఎరిక్సన్!
Ericsson Layoffs : ప్రముఖ టెలికాం కంపెనీ ఎరిక్సన్ ఉద్యోగాల్లో కోత పెట్టింది. మరో 8500 తొలగిస్తున్నట్లు మెమోలు జారీచేసింది.
Ericsson Layoffs : ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్ లు కొనసాగుతున్నాయి. మాంద్యం భయాలతో కాస్ట్ కట్టింగ్ కు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఎరిక్సన్ కంపెనీ ఉద్యోగులకు మెమో పంపినట్లు రాయిటర్స్ ధ్రువీకరించింది. ఇటీవల ఎరిక్సన్(Ericsson) స్వీడన్‌లో సుమారు 1,400 ఉద్యోగాలను తొలగించింది. టెక్ కంపెనీలు ఆర్థిక పరిస్థితుల కారణంగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా టెలికాం పరిశ్రమలో కూడా లేఆఫ్(Layoffs) ను స్టార్ట్ అయ్యాయి. ఎరిక్సన్ తీసుకున్న నిర్ణయం టెలికాం ఇండస్ట్రీని ప్రభావితం చేస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. "స్థానిక దేశ పరిస్థితులను బట్టి హెడ్‌కౌంట్ తగ్గించుకునే విధానం భిన్నంగా ఉంటుంది" అని ఎరిక్సన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్జే ఎఖోల్మ్ ఉద్యోగులకు ఇచ్చిన మెమోలో తెలిపారు. చాలా దేశాలలో ఈ వారంలో ఉద్యోగుల తొలగింపుపై తెలియజేస్తామని ఆయన అన్నారు.
Ericsson to lay off 8,500 employees -memo https://t.co/3GqXStNXkO pic.twitter.com/QcduzxEyIC
— Reuters Tech News (@ReutersTech) February 24, 2023
ఉద్యోగాల్లో కోతలు
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి బడా కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించాయి. తాజాగా టెలికాం పరికరాలు తయారు చేసే స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్ ఈ జాబితాలో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపిస్తున్నట్లు మెమోలు జారీచేసింది. తొలగించే ఉద్యోగుల సంఖ్య దేశాన్ని బట్టి మారుతుంటాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బోర్జే ఎకోల్మ్ స్పష్టం చేశారు. ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా ఇటీవలే స్వీడన్‌లో 1,400 ఉద్యోగులను ఎరిక్సన్ తొలగించింది. తాజా ప్రకటనతో దాదాపు 10 వేల మందికి ఎరిక్సన్ ఉద్వాసన పలికింది. భారత్‌లోనూ ఈ కంపెనీ కార్యకలాపాలు నడుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా 105,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్న ఎరిక్సన్ స్వీడన్‌లో సుమారు 1,400 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. ఎరిక్సన్ నిర్ణయం ఉత్తర అమెరికాను ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. భారతదేశం వంటి మార్కెట్లపై తక్కువ ప్రభావం ఉంటాయని అంచనా వేశారు.
ఖర్చు తగ్గించుకునే యోచనలో కంపెనీలు
ఉత్తర అమెరికాతో సహా కొన్ని మార్కెట్‌లలో డిమాండ్ మందగించడంతో 2023 చివరి నాటికి 9 బిలియన్ క్రౌన్‌లు ($880 మిలియన్లు) తగ్గిస్తామని కంపెనీ డిసెంబర్‌లో తెలిపింది. పోటీలో నిలిచేందుకు ఖర్చు తగ్గించుకోవాలని ఎఖోల్మ్ మెమోలో తెలిపారు. కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో చాలా టెలికాం కంపెనీలు తమ ఇన్వెంటరీలను పెంచుకున్నాయి, అది ఇప్పుడు టెలికాం పరికరాల తయారీదారులకు ఆర్డర్‌లు మందగించడానికి దారితీస్తోంది. అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటైన వెరిజోన్, ఈ ఏడాది $18.25 బిలియన్, $19.25 బిలియన్ల మధ్య ఖర్చు చేయాలని యోచిస్తోంది. గత సంవత్సరం $23 బిలియన్ల మూలధన వ్యయం బడ్జెట్ నుంచి తగ్గింది. ఎరిక్సన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కార్ల్ మెల్లాండర్ గతంలో రాయిటర్స్‌తో మాట్లాడుతూ... కన్సల్టెంట్లు, రియల్ ఎస్టేట్, ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా ఖర్చు తగ్గింపు ఉంటుందని తెలిపారు. నోర్డిక్ రైవల్ నోకియా ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించలేదు.