అన్వేషించండి

Employee : సిక్‌ లీవ్ అడిగితే రిజెక్ట్ - డ్యూటీలో చనిపోయిన ఉద్యోగిని !

Employee dies : ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగిని ఆరోగ్యం బాగోలేదని లీవ్ కావాలని అడిగింది. దానికి మేనేజర్ అంగీకరించలేదు. కానీ పని ప్రదేశంలోనే ఆమె కుప్పకూలి చనిపోయింది.

Employee dies after manager denies sick leave : పని ప్రదేశాల్లో గడ్డు పరిస్థితులు ఉండటం ప్రపంచం అంతటా ఉంటుంది. అది ఉత్పాదక పరిశ్రమనా... లేకపోతే సేవల కంపెనీనా అన్నది తర్వాత విషయం. కానీ ఒత్తిడి.. వేధింపులు ఎక్కడైనా ఒక్కటే. ఇటీవల బారత్ లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీకి చెందిన ఓ ఓద్యోగిని పని ఒత్తిడి తట్టుకోలేకపోయిన ఘటనపై ఇప్పటికీ దేశవ్యాప్తంగా కార్పొరేట్ సర్కిల్స్ లో చర్చ జరుగు తోంది. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది. అయితే అది ఇండియా లో కాద ధాయ్ ల్యాండ్‌లో.                             

మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !

థాయ్‌ల్యాండ్‌లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు చాలా ఉంటాయి. వాటిలో ఉద్యోగులు కఠినమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా డెల్టా ఎలక్ట్రానిక్స్ అనే భారీ కంపెనీలో వేల మంది ఉపాధి పొందుతూ ఉంటారు. తాజాగా ఓ మహిళా ఉద్యోగిని ఉద్యోగం చేస్తూ కూర్చున్న చోటనే చనిపోయింది. అంతకు ముందు ఆమె తనకు ఆరోగ్యం బాగో లేదని సెలువు ఇవ్వాలని మేనేజర్ ను కోరింది. కానీ మేనేజర్ మాత్రం ఆమె నిజం చెప్పడం లేదని భావించి ఆ సెలవును రిజెక్ట్ చేశాడు. దాంతో ఆమె తప్పనిసరిగా విధులకు హాజరయింది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో పాటు పని ఒత్తిడి పెరిగిపోవడంతో ఆమె ఉన్న చోటనే కుప్పకూలిపోయారు.                                         

ఉద్యోగిని మృతి అంశం థాయ్ ల్యాండ్‌లో కలకలం రేపింది. ఈ అంశంపై అక్కడ విస్తృతంగా చర్చ జరగడంతో డెల్టా ఎలక్ట్రానిక్స్ కంపెనీ సీఈవో ఓ ప్రకటన చేశారు. ఉద్యోగిని మృతితో తాము కలత చెందామని.. ఏం జరిగిందో విచారణ చేస్తామని తెలిపారు. ఉద్యోగిని కుటుంబానికి సాయం చేస్తామన్నారు. ఈ ఘటన తర్వాత అన్ని పరిశ్రమల్లోనూ పని పరిస్థితులపై విస్తృత పరిశీలన చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఆ దిశగా తాము స్వచ్చందంగా పరిశీలన చేసుకుంటామని డెల్టా లాంటి కంపెనీలు ప్రకటించాయి .                          

రోజువారీ కూలీ వెయ్యి రూపాయలు పైనే..! అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త చట్టం!                            

ఇటీవల  ఇండియాలో మరణించిన ఈవై కంపెనీ ఉద్యోగిని అన్నా సెబాస్టియన్ అంశంపై కూడా ఇలాగే చర్చ జరిగింది. మల్టినేషనల్ కంపెనీలు.. తమ కార్యాలయాల్లో  పని పిరిస్థితులపై అధ్యయనం చేస్తామని ఒత్తిళ్లు లేకుండా ఉండేలా చూసుకుంటామని ప్రకటించింది. ఇప్పుడు ఇలాంటి మరణాలతో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న  పరిశ్రమలు, ఫ్యాక్టరీలు.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడుభారత్ వీర విధ్వంసం, సఫారీ గడ్డపైనే రికార్డు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Game Changer: ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Sharmila: ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
Embed widget