Elon Musk Twitter Deal: ట్విట్టర్ టేకోవర్‌కు ఎలన్‌మస్క్ రెడీ- ఒక్కో షేర్ 54.20 డాలర్‌కు కొనేందుకు ప్రతిపాదన!
రష్యా రిఫరెండం నిర్వహించిన ప్రాంతాల్లో అమెరికా ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు ఎలన్‌మస్క్. అక్కడ ప్రజలు ఇచ్చే తీర్పును ఉక్రెయిన్, రష్యా గౌరవించాలన్నారు.
Elon Musk Twitter Deal:మరోసారి ట్విటర్, ఎలన్‌మస్క్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ట్విటర్‌ను టేకోవర్ చేసేందుకు ఎలన్‌మస్క్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే మంగళవారం ట్రేడింగ్‌లో ట్విట్టర్ షేర్లు ట్రేడింగ్ నిలిపేసినట్టు సమాచారం. ఒక్కో షేర్ 54.20 డాలర్లకు టేకోవర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రముఖ వార్తా సంస్థ బ్లూంబర్గ్ ఓ స్టోరీని పబ్లిష్ చేసింది.
ట్రేడింగ్ హాల్ట్ అయ్యే సమయానికి ట్విట్టర్ షేర్ 12.7 శాతం పుంజుకుంది. అదే టైంలో టెస్లా సంస్థ సుమారు మూడు శాతం నష్టాలు ఎదుర్కొంది. గతంలో చెప్పిన ప్రతిపాదనకే ట్విట్టర్ టేకోవర్ చేస్తానని ఎలన్ మస్క్ లెటర్ రాసినట్టు కూడా వార్తలు గుప్పుమంటున్నాయి.
Scoop - N*MUSK SAID TO PROPOSE TO TWITTER TO PROCEED W/ DEAL AT $54.20
— ed hammond (@EdHammondNY) October 4, 2022
ట్విట్టర్‌లో స్పామ్ ఖాతాలపై ఎలన్ మస్క్ వెనక్కి తగ్గారు. దీనిపై ట్విట్టర్ న్యాయపోరాటం చేస్తోంది. దీనిపై 17న డెలావర్ చాన్సరీ కోర్టులో విచారణ జరగనుంది. ఈలోపే ఎలమస్క్ నుంచి చెప్పిన ధరకే టేకోవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ యుద్దంపై ఎలన్‌మస్క్ పెట్టి ట్వీట్ సంచలనంగా మారింది. దీన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తప్పుపట్టారు.
Ukraine-Russia Peace:
— Elon Musk (@elonmusk) October 3, 2022
- Redo elections of annexed regions under UN supervision. Russia leaves if that is will of the people.
- Crimea formally part of Russia, as it has been since 1783 (until Khrushchev’s mistake).
- Water supply to Crimea assured.
- Ukraine remains neutral.
రష్యా రిఫరెండం నిర్వహించిన ప్రాంతాల్లో అమెరికా ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు ఎలన్‌మస్క్. అక్కడ ప్రజలు ఇచ్చే తీర్పును ఉక్రెయిన్, రష్యా గౌరవించాలన్నారు. క్రిమియా ప్రాంతాన్ని రష్యా భూభాగంగా గుర్తించి ప్రజా జీవనం నార్మలైజ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై జెలెన్‌స్కీ ఘాటుగా స్పందించారు. మీరు రష్యాకు మద్దతు ఇస్తారా లేకుంటే ఉక్రెయిన్ వైపు ఉంటారా అంటూ ప్రశ్నలు సంధించారు.
Which @elonmusk do you like more?
— Володимир Зеленський (@ZelenskyyUa) October 3, 2022