IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT
IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK

Enceladus : ఈ అనంత విశ్వంలో భూమి కాకుండా నీరు ఉన్న గ్రహం అసలు ఉందా..?

Enceladus : సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ అనంతమైన ఈ విశ్వంలో భూమిలా అన్ని రకాలుగా తనకు సరిపోయే గ్రహం ఉందా అని అన్వేషణ సాగిస్తున్నాడు మానవుడు. ఆ వేటలో ఇప్పటికీ సరైన సమాధానం లభించకపోయినా అనంతమైన విశ్వం వేదికగా మనిషి అన్వేషణ సాగుతూనే ఉంది.

FOLLOW US: 

 Enceladus : ఎంతో అందమైన విశ్వం మనది. ఈ భూమిపై ఉన్న వాతావరణం..అపారమైన ప్రకృతి సంపద మనిషిని ఇక్కడ సుఖంగా జీవించేందుకు దోహదం చేస్తున్నాయి. సుమారుగా 6మిలియన్ సంవత్సరాలుగా ఉంటే 60లక్షల సంవత్సరాలుగా మానవుడు..అతడి పూర్వీకులు భూమిపై జీవనాన్ని సాగిస్తున్నాడు. ఇంకెన్నాళ్లు ఇక్కడే ఉంటాడనే అంశంపై స్పష్టమైన ఆధారాలు ఏవీ లేకపోయినా...ఇప్పుడు భూమి కేంద్రంగా జరుగుతున్న విధ్వంసం చూస్తే ఇక్కడ ఇంకెన్నాళ్లో ఉండలేమనే అంశం శాస్త్రవేత్తలకు కంటిమీద కునుకు కూడా వేయనీయటం లేదు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ అనంతమైన ఈ విశ్వంలో భూమిలా అన్ని రకాలుగా తనకు సరిపోయే గ్రహం ఉందా అని అన్వేషణ సాగిస్తున్నాడు మానవుడు. ఆ వేటలో ఇప్పటికీ సరైన సమాధానం లభించకపోయినా అనంతమైన విశ్వం వేదికగా మనిషి అన్వేషణ సాగుతూనే ఉంది.

మనిషి అన్వేషణ ఫలించిందా..?

పడుతున్న కష్టానికి ప్రతిఫలం అన్నట్లు ఓ విషయం అంతులేని ఆనందానికి కారణమవుతోంది. ఆ ఆనందానికి కారణం శని గ్రహం. రింగు రింగుల వలయాలతో...ఈ భూప్రపంచంపై ఎన్నో మిస్టీరియస్ మిత్స్ ను తనచుట్టూ తిప్పుకునే శని గ్రహానికి ఉన్న ఉపగ్రహాల్లో ఒకటైన ఎన్ సిలడస్ ఇప్పుడు శాస్త్రవేత్తల అన్వేషణకు తగిన ప్రతిఫలాన్ని చూపిస్తోంది. 1789లో బ్రిటన్ లో జన్మించిన జర్మన్ మూలాలు కలిగిన విలియం హెర్షల్ అనే ఖగోళ శాస్త్రవేత్త ఈ ఎన్ సిలడస్ అనే చందమామ శని చుట్టూ తిరుగుతుందని చెప్పినా....అప్పటికి ఇంత సాంకేతికత లేదు కాబట్టి...దానిపైన పెద్దగా పరిశోధనలు సాగలేదు. 1980,81 లో నాసా ప్రయోగించిన వోయేజ్ 1, 2 ఉపగ్రహాలు తొలిసారిగా ఎన్ సిలడస్ ఫోటోలు తీశాయి. తర్వాత శని పై ప్రయోగాల కోసం 2005లో నాసా ప్రయోగించిన కాసినీ అనే పేరుగల స్పేస్ క్రాఫ్ట్ ఎన్ సిలడస్ కు సంబంధించి కొన్ని ఆశ్చర్యపోయే విషయాలను బయటపెట్టింది.

(Image Credit : NASA)

ఎన్ సిలడస్ పై అసలు ఏముంది..?

కాసినీ తీసిన ఫోటోలను జాగ్రత్తగా పరిశీలించిన నాసా శాస్త్రవేత్తలు తెలుసుకున్న విషయం ఏంటంటే....ఆ ఉపగ్రహం దక్షిణార్థ గోళం నుంచి  నీటిబుగ్గలు స్పేస్ లోకి వెదజల్లుతున్నాయి. వాటిని చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. 2014లో మరోసారి కాసినో ఫోటోలు తీసి పంపించగా ఆ బయటికి వస్తున్న నీరు...క్రయో వోల్కనో ల నుంచి వస్తున్నట్లు కనుగొన్నారు.

(Image Credit : NASA)

అది నీరేనా ఏముంది దాంట్లో :

 నీటి ఆవిరి, మాలిక్యులర్ హైడ్రోజన్, ఘనరూపంలో గడ్డకట్టుకుపోయి ఉన్న సోడియం క్లోరైడ్ క్రిస్ట్రల్స్ ఆ పైకి ఉబుకుతున్న నీటిలో ఉన్నట్లు గుర్తించారు నాసా శాస్త్రవేత్తలు. సెకనుకు రెండొందల కిలోల బరువుతో వేగంగా గీజర్లలా వస్తున్న ఆ నీటికి కారణం ఎన్ సిలడస్ దక్షిణార్థం గోళంలో ఉపరితలానికి అడుగున మహాసముద్రంగా భావిస్తున్నారు. అక్కడి ఉపరితల పొరల్లో ఉన్న వేడి, ప్రెజర్ కారణంగా ఈ నీటి బుగ్గలు అలా వెదజల్లుతున్నట్లు గుర్తించారు. ఇప్పుడు నాసా శాస్త్రవేత్తలు దృష్టి సారించిన విషయం ఏంటంటే...నీరు సమస్త ప్రాణికోటికి ఆధారం. ఉపరితలం కింద సముద్రంలాంటి వ్యవహారం ఉందంటే అక్కడ జీవనానికి ఆస్కారం ఉన్నట్లే. మరి అక్కడ జీవం మొదలైందా. లేదా ఎప్పుడో అక్కడ ఉన్న ప్రాణికోటి మొత్తం తుడిచిపెట్టుకుపోయిందా ఇప్పుడిదే శాస్రవేత్తల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ప్రశ్న. ఇంతకీ బయటకు అలా లావా వెదజల్లుతున్నా నీరు స్పేస్ లో వరకూ వచ్చి తిరిగి గడ్డకట్టిన మంచు రూపంలో ఎన్ సిలడస్ లో పడుతుండగా...మిగిలిన ఆ నీరు లాంటి పదార్థం స్పేస్ లో ట్రావెల్ చేస్తూ శని చుట్టూ ఉన్న రింగులు ఏర్పడటానికి కారణమవుతోందని శాస్త్రవేత్తల దృష్టికి రావటం ఇక్కడ మరో ఆశ్చర్యానికి గురి చేసే అంశం.

(Image Credit : NASA)

Published at : 07 Apr 2022 10:27 PM (IST) Tags: Earth solar system Enceladus planet water in another planet earth like planet

సంబంధిత కథనాలు

Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!

Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!

Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ

Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ

China Plane Crash: ఎంత పనిచేశారు పైలట్లు! 132 మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు!

China Plane Crash: ఎంత పనిచేశారు పైలట్లు! 132 మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు!

Cannes Film Festival: మరో చాప్లిన్ రావాలి, పుతిన్‌ను ప్రపంచం ప్రశ్నించాలి: కేన్స్ చలన చిత్రోత్సవంలో జెలెన్‌స్కీ

Cannes Film Festival: మరో చాప్లిన్ రావాలి, పుతిన్‌ను ప్రపంచం ప్రశ్నించాలి: కేన్స్ చలన చిత్రోత్సవంలో జెలెన్‌స్కీ

Covid 19 in North Korea: ఉత్తర కొరియాను ఊపేస్తోన్న కరోనా వైరస్- మిలటరీని రంగంలోకి దింపిన కిమ్

Covid 19 in North Korea: ఉత్తర కొరియాను ఊపేస్తోన్న కరోనా వైరస్- మిలటరీని రంగంలోకి దింపిన కిమ్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు