Donald Trump on Dollar: అమెరికా డాలర్‌కు ముప్పు ? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను భయపెడుతున్న అంశాలు ఏంటి?
Trump Tariffs on India | అమెరికా డాలర్‌పై బ్రిక్స్ కూటమి దాడికి ప్రయత్నిస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. బ్రిక్స్ లో చేరాలనుకునే దేశాలపై భారీ టారిఫ్ విధిస్తానని బెదిరించారు.

Donald Trump on BRICS | ఈ ఏడాది ప్రపంచంలోని పలు దేశాలపై సుంకాలు విధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికా కరెన్సీపై ఆందోళన చెందుతున్నారు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన కరెన్సీ డాలర్‌కు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోందనిపిస్తోంది, దీని వెనుక బ్రిక్స్ దేశాలు ఉన్నాయని మరోసారి ఆరోపించారు. బ్రిక్స్ దేశాల కూటమిని అమెరికా డాలర్‌పై దాడిగా అభివర్ణించారు. బ్రిక్స్ లో చేరాలనుకునే దేశాలపై టారిఫ్ విధిస్తామని తాను బెదిరించానని, ఆ తర్వాత కొన్ని దేశాలు వెనక్కి తగ్గారని పేర్కొన్నారు.
డాలర్‌కు ముప్పు తప్పదా..
బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, భారతదేశం (India), చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఉన్నాయి. ఈ దేశాలు అమెరికా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ట్రంప్ అన్నారు. అందుకే ఆయన ఈ దేశాలపై అదనపు సుంకాలు విధించేందుకు సిద్ధమని హెచ్చరించారు. మరోవైపు, బ్రిక్స్ దేశాలు ట్రంప్ ఏకపక్షంగా విధిస్తున్న సుంకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డాలర్ మారకంతో ఆధారపడి ఉన్నందున ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై, వ్యాపారాలపై టారిఫ్ కచ్చితంగా ప్రభావం చూపుతుంది.
అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మైలీతో ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. డాలర్ విలువపై తన వైఖరి స్పష్టం చేశారు. డాలర్ కాకుండా వేరే కరెన్సీతో లావాదేవీలు చేసే వారి కంటే డాలర్ లో బిజినెస్ చేసే వారికి ఎక్కువ లాభాలు, ప్రయోజనాలు ఉంటాయన్నారు. డాలర్ కు వ్యతిరేకంగా ఉండే వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తా అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ ఎందుకు భయపడుతున్నారు?
టారిఫ్ లు విధించి అమెరికాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడేలా చేస్తున్నా డొనాల్డ్ ట్రంప్ తగ్గడం లేదు. బ్రిక్స్ కూటమిలో చేరాలనుకునే దేశాలన్నింటికీ ఓ విషయం చెప్పాను మీ దేశంపై భారీ సుంకాలు విధిస్తాము. తరువాత వాటికి నాది బాధ్యత కాదు. ఆలోచించుకోవాలని హెచ్చరించడంతో బ్రిక్స్ కూటమిలో చేరాలనుకున్న ప్రతి ఒక్కరూ వెనక్కి తగ్గారు. బ్రిక్స్ కూటమి డాలర్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీ తేవాలని చూస్తుంది. ఇది కచ్చితంగా అమెరికా కరెన్సీపై జరిగే దాడి. ఏ దేశమైనా బ్రిక్స్ లో చేరాలనుకుంటే, అమెరికాకు వచ్చే మీ ఎగుమతులపై భారీ సుంకాలు విధిస్తానని ట్రంప్ అన్నారు.
గత నెలలో బ్రిక్స్ దేశాలు తమ ప్రకటనలో సుంకాలలో ఇలాంటి భారీ పెరుగుదల, అధిక టారిఫ్ లు ప్రపంచ వాణిజ్యానికి ముప్పుగా మారతాయన్నారు. ట్రంప్ పరిపాలన ఒక్క ఏడాదిలోనే పలు దేశాలపై ప్రతికూల ప్రభావం చూపారు. ఆయన పదవీకాలం ముగిసేవరకూ పరిస్థితిలో మార్పు వస్తుందని ఈ కూటమి భావించడం లేదు. ముఖ్యంగా భారత్ మీద ట్రంప్ మండిపడుతూనే.. మై గుడ్ ఫ్రెండ్ మోదీ అని అంటున్నారు. రష్యా, చైనాలపై సైతం టారిఫ్ వార్ కొనసాగిస్తున్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనొద్దని భారత్ మీద 25 శాతం టారిఫ్ వేశారు.
భారతదేశంపై ప్రభావం
భారతదేశం నుండి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అమెరికా 25 శాతం టారిఫ్ విధించింది. రష్యా నుండి అమెరికా కూడా ముడి చమురును కొంటున్నా.. భారత్ పై మాత్రం ఈ కొనుగోలు సాకుగా చూపి అదనంగా 25 శాతం టారిఫ్ విధించారు. ఓవరాల్ గా చూస్తే భారత్ ఎగుమతులపై మొత్తం 50 శాతం టారిఫ్ కొనసాగుతోంది. హెచ్1బీ వీసాలకు లక్ష డాలర్లు చేసి భారతదేశం నుంచి అమెరికాకు టెకీలు రాకుండా చర్యలు చేపట్టారు.























