Denmark Shooting: షాపింగ్‌మాల్‌లో కాల్పుల మోత- ముగ్గురు మృతి
Denmark Shooting: డెన్మార్క్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.
Denmark Shooting: యూరోప్‌లోని డెన్మార్క్ దేశంలో కాల్పుల మోత మోగింది. రాజధాని కోపెన్‌హగెన్ ఫీల్డ్స్ ప్రాంతంలో రద్దీగా ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురుకి తీవ్రంగా గాయాలయ్యాయి.
Earlier today in Copenhagen, Denmark, a 22-year-old opened fire in the Field’s mall, killing 3 people & injuring several others. The perpetrator has been arrested & identified as Noah Esbensen. This is now the deadliest mass shooting committed by an individual in Denmark history. pic.twitter.com/jNQe6UT4Uc
— ♔ 𝗲𝗺𝗶𝗹 (@JURYR00M) July 4, 2022
పోలీసుల ఆపరేషన్
కాల్పుల ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. కాల్పుల శబ్ధాలు విన్న జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. షాపింగ్‌మాల్‌ను చుట్టుముట్టారు. కేవలం 11 నిమిషాల్లోనే దుండగుడ్ని పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు. నిందితుడికి 22 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. కాల్పులకు గల కారణం ఇంకా తెలియలేదు.
Denmark: Mass shooting in a shopping center in Copenhagen on Sunday, left 3 dead and 3 wounded.
— Abdul Quadir - عبد القادر (@Journaltics) July 4, 2022
According to eyewitnesses, he was chasing Muslims in the mall.
A 22-year-old Danish man has been arrested in connection with the shooting and police have not yet revealed a motive. pic.twitter.com/yo07mjWE21
ఇటీవల మరో ఐరోపా దేశమైన నార్వేలో కూడా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మరువకముందే డెన్మార్క్ కాల్పులతో దద్దరిల్లింది. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Pakistan: లోయలో పడిన బస్సు- 19 మంది మృతి!
Also Read: Lalu Prasad Yadav hospitalized: మెట్లపై నుంచి జారిపడిన బిహార్ మాజీ సీఎం లాలూ- భుజానికి ఫ్రాక్చర్