Advertisement: మా అత్తకు బాయ్ ఫ్రెండ్ కావలెను.. సర్ ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసిన కొడలు
ప్లాట్లు, ఉద్యోగాలు, వాణిజ్యం, వరుడు కావలెను, వధువు కావలెను లాంటి ప్రకటనలు చూస్తాం. కానీ ఓ కొడలు మాత్రం.. తన అత్తకు బాయ్ ఫ్రెండ్ కావలెను అని ప్రకటన ఇచ్చేసింది.. నిజంగా నిజం.. కావాలంటే చదవండి.
అత్తాకొడళ్లలో చాలా మంది.. ఎప్పుడూ పిల్లి ఎలుకలా... కొట్టుకుంటారు. ఒకరిమీద ఒకరు చాడీలు చెప్పుకొంటారు. కానీ ఇక్కడ మనం చెప్పుకునే కొడలు పూర్తి విరుద్ధం. తన అత్తను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో తెలుసా.. ఆమెకు ఒక తోడు ఉండాలని ఆరాటపడుతుంది. తన అత్తను ఫంక్షన్ కు సింగిల్ గా తీసుకెళ్లలంటేనే ఆమెకు బాధనిపించింది. అందుకే అత్తకు బాయ్ ఫ్రెండ్ కావలెను అని ప్రకటన ఇచ్చేసింది. అలా అని ఎవరైతేనేం అనుకోలేదు.. తన అత్తకు నచ్చినట్టె ఉండాలని మరి మరి చెప్పింది. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉందండి.. కేవలం రెండు రోజులు మాత్రమే ఆ బాయ్ ఫ్రెండ్ ఉండాలి. తర్వాత వెళ్లిపోవాల్సిందే.. అందుకు కొన్ని షరతులు మాత్రం పెట్టింది. ఈ పోస్ట్ ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. అదేంటి అనుకుంటున్నారా..? ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు చదువుదాం రండి..
అమెరికాలోని న్యూయార్క్‌లో ఉండే ఓ కోడలు.. ఆగస్టులో జరగబోయే తన బంధువుల పెళ్లికి వెళ్లాలనుకుంది. ఆ వివాహానికి అత్తగారిని కూడా తీసుకువెళ్లాలని ప్లాన్ వేసింది. కానీ, తన మామగారు చనిపోవడంతో అత్తగారు ఒంటరిగా ఉంటున్నారు. ఎలాగైనా అత్తను ఒంటరిగా ఉంచకూడదని ఫిక్స్ అయింది. పెళ్లికి అత్తను తనతోపాటే తీసుకువెళ్లాలని అనుకుంది. ఆగస్టులో హడ్సన్ వ్యాలీలో జరిగే ఈ పెళ్లి కోసం.. రెండు రోజుల పాటు తన అత్తకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని ప్రకటనలో తెలిపింది. 40-60 ఏళ్ల మధ్య వయస్సున్న బాయ్ ఫ్రెండ్ కావాలని ప్రకటన ఇచ్చింది. రెండు రోజుల పాటు ఉండాలని తెలిపింది. దానికోసం 72 వేల రుపాయలు ఇస్తానని వివరించింది. అంతేకాదండోయ్.. అత్తకు కాబోయే బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలో లిస్ట్ చెప్పింది.
'మా అత్తకు బాయ్ ఫ్రెండ్ గా ఉండే వ్యక్తి వయసు 40 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆయన మంచి డ్యాన్సర్ అయి ఉండాలి. అలాగే మంచి కమ్యూనికేషన్ మెయింటెన్ చేయాలి. మా అత్తగారు తెల్లటి దుస్తులు ధరిస్తారు.. కాబట్టి.. అందుకు సూట్ అయ్యేలా దుస్తులు ధరించాలి. ఆమెతో ఓ జంట మాదిరిగా నడుచుకోవాలి. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి' అని ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటన కాస్త సమయంలోనై వైరల్ అయింది. నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ట్రోలర్స్ పండగ చేసుకుంటున్నారు. మీ ఆంటీని నా కళ్లలో పెట్టుకొని చూసుకుంటా అని కొందరు.. మీకు మామ అయ్యే అన్ని లక్షణాలు నాలో ఉన్నాయి అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. తన అత్త కోసం ఎంత గొప్పగా ఆలోచించిందోనని.. తెగ సంబరపడిపోతున్నారు ఇంకొందరు.