Pakistan: పాకిస్తాన్‌ను కబ్జా చేసేందుకు చైనా రెడీ - ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు !
Chaina: పాకిస్తాన్ మిత్ర దేశం చైనా. అయితే చైనాకు మిత్రులు ఎవరైనా సరే ఉపయోగపడినంత వరకే ఉంటారు. ప్రస్తుతం పాకిస్తాన్ ను క్యాప్చర్ చేసేదుకు ఆ దేశం చేస్తున్న కుట్రలు అలాంటివే.

China to capture Pakistan: చైనా, పాకిస్తాన్ పొరుగు దేశాలు. భారత్ ను వ్యతిరేకించే దేశాలు. భారత్ సరిహద్దుల్లో ఈ రెండు దేశాలు పెట్టే పుల్లలు అన్నీ ఇన్నీ కావు. అయితే చైనా పాకిస్తాన్ ను కూడా వదిలి పెట్టదని తాజాగా జరిగిన కీలక పరిణామం తేల్చేసింది. పాకిస్తాన్ లో చాలా కాలంగా బలూచిస్తాన్ ఉద్యమం ఉంది. పాకిస్థాన్ ప్రభుత్వం తమను సరిగ్గా చూసుకోవడం లేదని అక్కడి ప్రజలు తమను ప్రత్యేక దేశంగా చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వారి ఉద్యమంపై పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తుంది. అందుకే అక్కడి ఉద్యమకారులు మిలిటెంట్లుగా మారారు. ప్రత్యేకంగా విభజన ఉగ్రవాద సంస్థలు ఏర్పాటు చేసుకుని పోరాడుతున్నారు. వారికి ప్రజల మద్దతు ఉంటుంది.
పాకిస్తాన్ ఈ ప్రాంతంపై నిర్లక్ష్యం చూపిస్తుంది కానీ చైనా మాత్రం ఎంతో ఆసక్తి చూపిస్తుంది. చైనాకు సరిహద్దుల్లో ఉండే బలూచిస్తాన్ ప్రాంతం ఆ దేశానికి చాలా కీలకం. ఆ దేశం సిల్క్ రోడ్ అనే ప్రాజెక్టు చేపడుతుంది. అది బలూచిస్తాన మీదుగా వెళ్తుంది. చైనా అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టి ఇన్ ఫ్రా డెవలప్ చేస్తోంది.అక్కడంతా పని చేయడానికి చైనీయులే వస్తారు. ఇలా చైనీయులు రావడాన్ని బలూచిస్తాన్ ప్రజలు అంగీకరించడంలేదు. వారిపై దాడులు చేస్తున్నారు.కనిపించిన వారిని చంపేస్తున్నారు.ఈ కారణంగా ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి.
బలూచిస్తాన్ ప్రజలకు ‘ప్రత్యేక దేశం’ కోసం బీఎల్ఏ అనే రెబల్ సంస్థ చాలా కాలంగా ఉద్యమిస్తోంది. బలూచిస్తాన్‌లో చైనా కంపెనీలు అభివృద్ధి చేస్తున్న గ్వాదర్ పోర్ట్ సమీపంలోని వైమానిక స్థావరాలపై ఈ సంస్థ దాడి చేస్తోంది. ప్రావిన్స్‌లోకి వస్తున్న విదేశీ పెట్టుబడుల నుంచి లేదా అక్కడ విదేశీ కంపెనీల ద్వారా జరిగే ఖనిజాల వెలికితీతలో బలూచ్ ప్రజలకు న్యాయమైన వాటా దక్కడం లేదని బీఎల్ఏ వాదిస్తూ ఉంటుది. చైనా ఎగుమతుల కోసం కొత్త మార్గాలను రూపొందించడం కోసం సిద్దం చేసిన ప్రాజెక్ట్‌పై సంతకం చేసిన ఆయా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను చైనాతో మెరుగుపరచడానికి ఈ నిర్మాణాలు చేపడుతున్నారు.
చైనా అతిపెద్ద ప్రాజెక్టులలో చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ కటి. ఈ ప్రాజెక్టులో భాగంగా చైనా పశ్చిమ సరిహద్దు నుంచి పాకిస్తాన్ గుండా అరేబియా సముద్రం తీరంలోని గ్వాదర్ పోర్టు వరకు రోడ్డు, రైలు మార్గాలను నిర్మిస్తున్నారు. ఇది బలూచిస్తాన్ లో ఎక్కువగా ఉంటుంది. అందుకే తమ దేశ వాసులపై దాడులు చేయకుండా.. పాకిస్తాన్ ప్రభుత్వంతో పని లేకుండా ఉగ్రవాద సంస్థలతో చైనా ఒప్పందం చేసుకుంది. అంటే ఉగ్రవాద సంస్థలతో కలిసి చైనా బలూచ్ ప్రాంతాన్ని తమ స్వాధీనం లోకి తీసుకున్నట్లే. కొద్ది రోజుల తర్వాత పాకిస్థాన్ మొత్తాన్ని చైనా అలా స్వాధీనం చేసుకున్నా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది..
Also Read: సముద్రంలో తిమింగలం మింగేసింది కానీ వదిలి పెట్టేసింది - చావును చూసిన యువకుడు - వైరల్ వీడియో





















