China Crime News: కిలేడీ మాస్టర్ ప్లాన్ - కోట్లు దోచేసి తప్పించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ, 25 ఏళ్ల తరువాత అరెస్ట్
China Crime News: డబ్బలు కోసం బ్యాంకులో దొంగతనం చేసింది. ఆపై పోలీసులకు దొరకకూడదని మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. 25 ఏళ్ల తర్వాత పోలీసులకు దొరికి ఊచలు లెక్కబెడుతోంది.
China Crime News: బ్యాంకులో దొంగతనం చేసి 4.77 కోట్ల రూపాయలను కొట్టేసింది. ఆపై పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఓ మహిళా ఉద్యోగిని ప్లాస్టిక్ సర్జరీతో మొహాన్నే మార్చేసుకుంది. ఆ నేరాన్ని దాచిపెట్టి పాతికేళ్ల పాటు హాయిగా జీవితాన్ని గడిపింది. కానీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతోంది ఆ కిలేడీ.
అసలేం జరిగిందంటే?
చైనాకు చెందిన చైన్ వేల్ అే మహిళ 1997లో యెకింగ్ లోని చైనా కన్ స్ట్రక్షన్ బ్యాంకులో క్లర్క్ గా విధులు నిర్వర్తించేది. అదే సమయంలో ఓ బ్యాంకింగ్ వ్యవస్థలోని ఒక లోపాన్ని గుర్తించింది. బ్యాంకులోని నగదును తన ఖాతాలోకి సులభంగా మళ్లించుకునే అవకాశం ఉందని గ్రహించింది. ఆ ప్రకారం తన ఖాతాలోకి రూ.6.8 కోట్లను జమ చేసుకుంది. అనంతరం అందులో నుంచి రూ.4.7 కోట్ల మొత్తాన్ని డ్రా చేసుకుంది. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి ప్లాస్టిక్ సర్జరీతో తన ముఖ రూపు రేఖలను మార్చుకుంది. పుట్టింటికి వెళ్లి, వారి కోసం కొంత డబ్బును అక్కడ దాచింది. వారు దాన్ని డ్రా చేసుకునే విధంగా ఖాతా పుస్తకాలను అక్కడ పెట్టింది. ఆమె ద్వారా ఈవిషయం తెలుసుకున్న కుటుంబ సబ్యులు ఇది సరికాదని వారించారు. వారు కొంత సొమ్మును బ్యాంకుకు తిరిగి ఇచ్చేశారు.
ఆమె మాత్రం వారి మాట వినకుండా వేరే రాష్ట్రానికి వెళ్లిపోయింది. అక్కడ పేరు మార్చుకొని, మరో పెళ్లి చేసుకుంది. ఒక కుమార్తెకు జన్మను కూడా ఇచ్చింది. వ్యాపారవేత్తగానూ ఎదిగింది. ఆ దొంగతనానికి పాల్పడకముందే ఆమెకు వివాహం కావడం గమనార్హం. ఆమెను గుర్తించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. 1997 నుంచి వారు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. చివరకు ఇటీవలే సదరు మహిళను పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు.
వరంగల్ లో చోరీ - తప్పించునే క్రామంలో బావిలో పడ్డ దొంగ
వరంగల్ జిల్లాలోని హసన్ పర్తి మండలం అనంతసాగర్ లోని ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో దొంగతనం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున హాస్టల్ రూమ్ లోకి వెళ్లిన దుండగులు విద్యార్థుల సెల్ ఫోన్స్, ల్యాప్ ట్యాప్ లు ఎత్తుకెళ్లారు. గర్ల్స్ హాస్టల్ లో సెక్యూరిటీ లోపానికి ఈ ఘటనలు నిదర్శనం అంటున్నారు విద్యార్థులు. వరుసగా నాలుగు రోజులుగా దొంగతనాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదివారం దొంగతానికి పాల్పడిన దుండగుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయాడు. హాస్టల్ లో మూడు సెల్ ఫోన్లు, ఒక లాప్ టాప్ చోరీ జరిగిందని విద్యార్థులు తెలిపారు. అలాగే దొంగ పారిపోతుండగా అతని వెనకాలే వెళ్లిన విద్యార్థినులు దొంగ బావిలో పడడం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బావిలో పడిపోయిన దొంగలను బయటకు తీశారు. అనంతరం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దొంగతో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని హసన్ పర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఇద్దరు హైదరాబాద్ కు చెందివారుగా గుర్తించారు.