అన్వేషించండి

Iran-US ceasefire: అమెరికా - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ దిశగా ముందడుగు - 45 రోజుల ఒప్పందం జరిగే చాన్స్

Ceasefire: ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ జరిగే అవకాశం కనిపిస్తోంది. 45 రోజుల ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి.

Ceasefire between Iran and US:  అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, యుద్ధాన్ని నిలిపివేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.  గత ఫిబ్రవరి 28 నుండి కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగా ముగింపు పలికేందుకు ఒక ముసాయిదా ప్లాన్ సిద్ధమైంది. దీని ప్రకారం  45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని మధ్యవర్తులు ప్రతిపాదించారు. ఈ గడువులోగా రెండు దేశాలు చర్చలు జరిపి, యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేలా ఒక సమగ్ర ఒప్పందానికి రావాలనేది ఈ ప్లాన్   ముఖ్య ఉద్దేశ్యం.

హర్మూజ్ జలసంధి పునరుద్ధరణ

ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన  హర్మూజ్ జలసంధిని  తక్షణమే తెరవాలని ఈ ప్రతిపాదనలో సూచించారు. ఇరాన్ ఈ జలసంధిని మూసివేయడంతో గ్లోబల్ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే, దీనిని తెరవాలంటే అమెరికా తన ఆంక్షలను సడలించాలని, కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ కోసం జలసంధిని తెరవలేమని ఇరాన్ స్పష్టం చేస్తోంది.   

ముగ్గురు మధ్యవర్తుల పాత్ర

ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు  పాకిస్థాన్, ఈజిప్టు , తుర్కియే దేశాలు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలో ఈ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ , ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మధ్య ఈ మూడు దేశాలు రాయబారం నడుపుతున్నాయి.  ఇస్లామాబాద్ అకార్డ్  పేరుతో ఈ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ట్రంప్ డెడ్ లైన్ - ఉత్కంఠ 

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 7 మంగళవారం రాత్రి  లోపు హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై భారీ దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే, చర్చలు సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయని, సోమవారం నాటికి ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందం గనుక కుదిరితే, గత ఆరు వారాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధం ఆగిపోయి, చమురు సరఫరా యథాతథ స్థితికి చేరే అవకాశం ఉంది.                               

 

టాప్ హెడ్ లైన్స్

US PERM Labor Certification Suspension: అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్ - పెర్మ్ సస్పెన్షన్.. భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!
అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్ - పెర్మ్ సస్పెన్షన్.. భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
Embed widget