అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!

Human Rights Violations in USA: ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో ఉన్న లోటుపాట్లను బయటపెట్టింది ఓ నివేదిక. సంక్షోభాలు, జాతి వివక్షలు, లింక భేదాలు ఇలా అమెరికాలో ఉన్న ఎన్నో సమస్యలను కళ్ల ముందు పెట్టింది.

Human Rights Violations in USA: అమెరికా ఇటీవల మళ్లీ జాతీ విద్వేషం బుసలుకొట్టింది. ఓ శ్వేతజాతి యువకుడు చేసిన కాల్పుల్లో దాదాపు 10 మంది నల్లజాతీయులు మరణించారు. ఇంతలా అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా జాతి విద్వేషాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు జరగడం బాధాకరమని పలు సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో మానవహక్కుల ఉల్లంఘనలపై సెంటర్ ఫర్ డెమోక్రసీ, ప్లురలిజమ్ అండ్ హ్యూమన్ రైట్స్ (CDPHR) తాజాగా వారి సర్వే నివేదికను బయటపెట్టింది. ఈ నివేదికలో అసలు ఏముందో చూద్దాం.

సర్వే ఉద్దేశం

అగ్రరాజ్యంలో నమోదైన మానవ హక్కుల ఉల్లంఘనల కేసులపై విశ్లేషణాత్మకమైన అధ్యయనం నిర్వహించింది సీడీపీహెచ్ఆర్. మానవహక్కుల ఉల్లంఘనలు ముఖ్యంగా జాతి, మత, వర్గ, లింగ విద్వేషాల ఘటనలపై క్షుణ్ణంగా పరిశీలించింది. ఐక్యరాజ్యసమితి సూచించిన మార్గదర్శకాలు, సూచనలను అమలు చేసేందుకు సహాయం చేయడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. 

సర్వే లక్ష్యాలు

• అమెరికా ఆచరిస్తోన్న అంతర్జాతీయ మానవ హక్కులు, ఉల్లంఘిస్తోన్న హక్కులపై అవగాహన కల్పించడం. 
• జాతి, మత, కుల, వర్గ విద్వేషాలను ఉపయోగించుకుని వివక్ష, హింస, దేశంలో నేరాలను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో కనుక్కోవడం. 
• దేశంలో ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తోంది. ఎన్నికలు ఎంత నిజాయతీగా జరుగుతున్నాయి తెలుసుకోవడం. 
• రాజ్యాంగ సూత్రాలు, ప్రకృతి, పర్యావరణానికి విరుద్ధంగా ఉన్న చట్టాల పరిశీలన. 
• అంతర్జాతీయ సంస్థలతో అమెరికా సంబంధాలు, ప్రపంచంపై దీని ప్రభావం. 
• కరోనా సంక్షోభంలో జీవించే హక్కును ప్రభుత్వాలు ఎలా కాపాడుతున్నాయనే అంశంపై అధ్యయనం

రెండో ప్రపంచ యుద్ధంలో గెలుపు తర్వాత మానవ హక్కుల పరిరక్షణ కోసం అంతర్జాతీయంగా పలు సంస్థలు ఏర్పాటయ్యాయి. వీటి పరిరక్షణకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాల్సిందేనని తీర్మానించాయి.

1. తరువాతి తరాలను యుద్ధాల నుంచి రక్షించడం, జీవించే హక్కును కాపాడటం వంటి ప్రాథమిక మానవ హక్కులకు ఎట్టి పరిస్థితుల్లోను భంగం కలిగించకుండా చూడాలని ఐరాస తీర్మానించింది.
2. చిన్ని పిల్లలతో వ్యభిచారం చేయడం, చైల్డ్ పోర్నోగ్రఫీని ఎట్టిపరిస్థితుల్లోను సహించకూడదని తీర్మానించింది. అంతేకాకుండా యుద్ధ సమయాల్లో ప్రమాదకర వాయువులను ఉపయోగించకూడదు.

అయితే అమెరికాలో ఇప్పటికీ ఈ హక్కులు, మార్గదర్శకాలు ఉల్లంఘనలకు గురి అవుతున్నాయి. దీని వల్ల ప్రజలపై పెనుభారం పడుతోంది. అమెరికాతో సహా చాలా దేశాల్లో ఈ హక్కులను ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా జాతి, మత విద్వేషాల వల్లే ఈ హక్కులు ఎక్కువగా ఉల్లంఘనకు గురవుతున్నట్లు తేలింది.

మత స్వేచ్ఛను పాటించే విషయంలో కూడా అమెరికాలో ఉల్లంఘనలు జరిగాయి. ముఖ్యంగా హిందువులు, సిక్కులపై ఎన్నో హింసాత్మక దాడులు జరిగాయి. హిందువులు, షియా ముస్లింలు, మిజ్రాయ్ జ్యూలపై ప్రపంచవ్యాప్తంగా దాడులు జరిగినట్లు సర్వేలో తేలింది.

అమెరికాలో మహిళలకు దగ్కుతున్న గౌరవంపై కూడా సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. చాలా సంస్థలకు అధినేతలుగా ఇప్పటికీ పురుషులే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాకుండా మహిళలపై జరుగుతోన్న అకృత్యాలను వారు గొంతెత్తి చెప్పకుండా కూడా అడ్డుకుంటున్నారు. రాజకీయాలు, మీడియాతో బలమైన సంబంధాలున్న ఎంతోమంది వీటిని బయటకు రాకుండా సాయం చేస్తున్నారని సర్వేలో తేలింది. అమెరికాలో వాక్ స్వాతంత్య్రంపై కూడా ఎన్నో దాడులు జరుగుతున్నాయి. సోషల్ మీడియాను కూడా అడ్డుకుంటున్నారు. 

హైలెట్స్

1. జాతి వివక్ష 

అమెరికాలో జాతి వివక్ష ఎన్నో శతాబ్దాలుగా ఉంది. అక్కడి వ్యవస్థల్లో కూడా ఇది వేళ్లూనుకుంది. అక్కడి న్యాయవ్యవస్థలో కూడా జాతి వివక్ష, అవినీతి ఉందని నివేదికలో పేర్కొన్నారు.

రాజకీయ వ్యవస్థలో

అమెరికా రాజకీయాల్లో ఉన్న రెండు ప్రధాన పార్టీలు డెమోక్రటిక్, రిపబ్లికన్‌లలో కూడా ఈ జాతివివక్ష ఉంది. పైకి ఎలాంటి జాతి వివక్ష లేదని రెండు పార్టీలు చెబుతున్నప్పటికీ దీనిని నిరోధించేందుకు ఎలాంటి పాలసీలు పెట్టలేదు.

యూనివర్సిటీలు, మీడియాలో మైనార్టీలకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. కావాల్సిన అర్హతలు ఉన్నప్పటికీ నల్లజాతీయులకు అంత తొందరగా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా ఉద్యోగాలు దక్కడం లేదు. కేవలం వీరిని ఓటు బ్యాంకుల్లా మాత్రమే రాజకీయ నేతలు చూస్తున్నారు.

పేదరికం

అగ్రరాజ్యంలో ఉంటున్న నల్లజాతీయులు ఎక్కువ శాతం మంది పేదవాళ్లేనని రిపోర్టులో తేలింది. శ్వేత జాతీయులకు లబ్ధి చేకూర్చే పథకాలే ఎక్కువ ఉన్నట్లు పేర్కొన్నారు. నల్లజాతీయుల జనాభాను తగ్గించేందుకు కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నల్లజాతి మహిళలకే ఎక్కువ అబార్షన్ రేటు ఉండటం దీనికి ఉదాహరణ.

2. మత విద్వేషం

అమెరికాలో మత వివక్ష, విద్వేషం కూడా ఎక్కువగానే ఉన్నట్లు నివేదిక తేల్చింది. మైనార్టీలైన హిందువులు, జైనులు, సిక్కులు, బుద్ధులు ఎన్నోసార్లు వివక్షను ఎదుర్కొన్నారు. స్వస్తిక్ గుర్తు ద్వేషానికి సింబల్ అని ఓ బిల్లు కూడా అమెరికాలో ప్రవేశపెట్టారు. హిందువులు, సిక్కులపై బహిరంగంగా దాడులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి.

3. లింగ వివక్ష, హింస 

7-12వ తరగతి చదువుతోన్న 1965 మంది విద్యార్థులపై చేసిన ఓ అధ్యయనం ప్రకారం 48% మంది విద్యార్థులు తాము లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. పాఠశాలల్లో అత్యాచార శాతం 19గా ఉంది.

అమెరికాలో ప్రతి ఐదుగురు మహిళల్లో కనీసం ఒకరు అత్యాచారానికి లేదా అత్యాచార యత్నానికి గురవుతున్నారు. ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్న వారి జాబితాలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. మహిళా సంస్థలు కూడా పురుషుల హస్తగతాల్లోనే ఉన్నాయి. ప్రతి ఐదుగురిలో ఓ మహిళ తన జీవితంలో కనీసం ఒక్కసారైనా అత్యాచారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

పని చేసే కార్యాలయాల్లో కూడా లింగ వివక్షను ఎదుర్కొన్నట్లు 42 శాతం మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 25 శాతం మంది మహిళలకు పురుషులతో పోలిస్తే తక్కువ జీతాలు ఇస్తున్నారు.

4. మానవతా సంక్షోభాలు

అమెరికా వేలు పెట్టడం వల్ల ఇతర దేశాల్లో ఏర్పడిన మానవతా సంక్షోభాలు ఏర్పడిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఇరాక్‌పై అమెరికా చేసిన యుద్ధం వల్ల దాదాపు 92 లక్షల మంది శరణార్థులుగా మారారు. అఫ్గానిస్థాన్‌లో 59 లక్షలు, సోమాలియాలో 43 లక్షలు, యమెన్‌లో 46 లక్షలు, లిబియాలో 12 లక్షలు, సిరియాలో 71 లక్షల మంది శరణార్థులుగా తరలిపోయారు.

అఫ్గానిస్థాన్‌లో అమెరికా వల్ల జరిగిన యుద్ధంలో 241,000 మంది చనిపోయారు. ఇందులో 71 వేల మంది సాధారణ పౌరులు.

5. కరోనా సంక్షోభం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికాలో కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. కరోనా సెకండ్ వేవ్‌లో లక్షల మంది వైద్యం అందక అమెరికాలో మృతి చెందారు. అత్యాధునిక వైద్య పరికరాలు, ఆరోగ్య వ్యవస్థ కలిగిన అమెరికా కూడా కరోనా దెబ్బకు విలవిలలాడటం ఆ దేశ చరిత్రలోనే అతి పెద్ద సంక్షోభాల్లో ఒకటిగా నివేదిక పేర్కొంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Game Changer: ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
Embed widget