Cigarette Label: పఫ్ పఫ్‌లో విషం, స్మోకింగ్ చేస్తే పోతారు! సిగరెట్లపై కొత్త లేబుల్స్ ప్రభావం చూపుతాయా!
Cigarette Label: మమూలుగా భారత దేశంలో సిగరెట్ పెట్టెలపై ‘సిగరెట్లు క్యాన్సర్‌కు కారకం’, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. అయితే కెనడా ప్రభుత్వం చేస్తున్న ప్రకటన చూస్తే మీకు దిమ్మ తిరుగుతుంది.
Cigarette Label: ఇండియాలో కొన్ని వ్యాపార ప్రకటనలు కొంచెం వెరైటీగా ఉంటాయి. ఓ వాటర్ బాటిల్ సంస్థ బొట్టు బొట్టులో నిజాయితీ అంటుండగా, ఓ పాన్ మసాలా కంపెనీ పలుకు పలుకులో కేసరి అంటుంది. అయితే కెనడా ప్రభుత్వం మరింత కొత్తగా ఆలోచించి పఫ్ పఫ్‌లో విషం అంటూ సిగరెట్ల తాగడం ద్వారా కలిగే దుష్పరిణామాలను ప్రచారం చేస్తోంది. మమూలుగా భారత దేశంలో సిగరెట్ పెట్టెలపై ‘సిగరెట్లు క్యాన్సర్‌కు కారకం’, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది.
అయితే కెనడా ప్రభుత్వం చేస్తున్న ప్రకటన చూస్తే మీకు దిమ్మ తిరుగుతుంది. ఆ దేశ ప్రజల ఆరోగ్యం కోసం, యువతను సిగరెట్లు మానిపించేందుకు కెనడా ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై ప్రతి సిగరెట్‌పై ‘సిగరెట్లు క్యాన్సర్‌కు కారకం’ అనే లేబుల్‌ను ప్రచురించనుంది. దేశ యువత, ప్రజల ఆరోగ్యం కోసం ఇలా చేస్తున్న తొలి దేశంగా కెనడా రికార్డులకెక్కింది.
ఈ హెచ్చరికలను ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో ఉంటాయి. సిగరెట్ కు ఒకవైపు(నిలువులో) ‘సిగరెట్లు క్యాన్సర్‌కు కారకం’ అని .. మరోవైపు ‘ప్రతి పఫ్‌లో విషం’ అని రాసి ఉంటుంది. నార్మల్ సిగరెట్లకు సంబంధించి ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచే అమల్లోకి వచ్చాయి. అలాగే వార్నింగ్ లేబుల్స్‌తో కింగ్ సైజ్ సిగరెట్స్‌ను తయారు చేసేలా యంత్రాలను అప్ గ్రేడ్ చేసుకునేందుకు కంపెనీలకు 2024 జూలై వరకు గడువు ఇచ్చారు. 2025 ఏప్రిల్ నాటికి అన్ని నార్మల్ సైజ్ సిగరెట్లు, టిప్పింగ్ పేపర్, ట్యూబ్‌లతో కూడిన చిన్న సిగరెట్లపై తప్పనిసరిగా ఈ వార్నింగ్ లేబుళ్లను ప్రచురించాలి. కొత్త ఇండివిడ్యువల్ లేబుల్‌లతో కూడిన కింగ్-సైజ్ సిగరెట్‌లు ఒక సంవత్సరంలోపు స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయని, ఆ తర్వాత 2025 ప్రారంభంలో సాధారణ సైజు సిగరెట్లు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.
అంతే కాకుండా ఇక సిగరెట్ల చివర్లో ఉండే ఫిల్టర్లపై కూడా పిల్లల ఆరోగ్యానికి హాని, అవయవాలకు దెబ్బ, నపుంసకత్వం, లుకేమియా ముప్పు అనే పదాలను ముద్రిస్తారు. ఈ చర్యల ద్వారా 2035 నాటికి దేశంలో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని 5 శాతానికి తగ్గించాలని కెనడా భావిస్తోంది. పొగాకు వాడకంతో ప్రతి ఏటా 48,000 మంది కెనడియన్లు చనిపోతున్నారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా.. ఆధునిక గ్రాఫిక్ చిత్రాలతో పాటు, ధూమపానం వల్ల కలిగే ఆరోగ్య పరిణామాల గురించి వివరించేలా లేబుళ్లు పని చేస్తాయని కెనడా మాజీ మంత్రి కరోలిన్ బెన్నెట్ గతంలో చెప్పారు.
2000లో సైతం కెనాడా పొగాకు ఉత్పత్తులతో కలిగే అనర్థాలను వివరిస్తూ వాటిని ఉపయోగించి వ్యాధిగ్రస్తులైన గుండెలు, ఊపిరితిత్తుల భయంకరమైన చిత్రాలు, గ్రాఫిక్ హెచ్చరికలను ప్రచురించిన తొలి దేశంగా కెనడా నిలిచింది. గత రెండు దశాబ్దాలుగా ధూమపానం తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో 13 శాతం పొగాకు ఉత్పత్తుల వినియోగదారులు ఉన్నారు. 2035 నాటికి దేశ జనాభాలో ఐదు శాతానికి లేదా దాదాపు 2 మిలియన్ల మందికి తగ్గించాలని కెనడా లక్ష్యంగా పెట్టుకుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial