బ్రెయిన్ డెడ్ మనిషికి పంది కిడ్నీ, 2 నెలల పాటు బాగా పని చేసిందంటూ వైద్యుల ప్రకటన
Pig Kidney in Human: అమెరికా వైద్యులు మనిషికి పంది కిడ్నీ అమర్చగా అది 2 నెలల పాటు మెరుగ్గా పని చేసినట్టు వైద్యులు తెలిపారు.
![బ్రెయిన్ డెడ్ మనిషికి పంది కిడ్నీ, 2 నెలల పాటు బాగా పని చేసిందంటూ వైద్యుల ప్రకటన America Surgeons Transplant Pig kidney works for 2 months in human body, sparks new debate బ్రెయిన్ డెడ్ మనిషికి పంది కిడ్నీ, 2 నెలల పాటు బాగా పని చేసిందంటూ వైద్యుల ప్రకటన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/15/248afc73d96ce5ed52ca324dd47c6f7f1694780768452517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pig Kidney in Human Body:
మెడికల్ మిరాకిల్..
వైద్య శాస్త్రంలో ఏదైనా అనూహ్యమైంది జరిగితే మెడికల్ మిరాకిల్ అంటూ ఉంటారు. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరవాత ఇలాంటి మిరాకిల్స్ చాలానే జరుగుతున్నాయి. న్యూయార్క్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బ్రెయిన్ డెడ్ వ్యక్తిలోకి పంది కిడ్నీ ప్రవేశపెట్టి పరిశోధనలు చేశారు. దాదాపు రెండు నెలల పాటు అది చాలా మెరుగ్గా పని చేయడం వైద్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. న్యూయార్క్‌లోని NYU Langone Healthలో పని చేస్తున్న డాక్టర్ రాబర్ట్ మాంట్‌గోమేరీ ఈ సర్జరీ చేశారు. ఆ తరవాత అది ఎలా పని చేస్తుందో అధ్యయనం చేశారు. దాదాపు రెండు నెలల పాటు పంది కిడ్నీ బాగా పని చేసినట్టు గుర్తించారు. ఈ స్టడీ పూర్తైన తరవాత ఆ కిడ్నీని తొలగించారు. ఆ డెడ్‌బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. జెనెటికల్‌గా మాడిఫై చేసిన ఓ పంది కిడ్నీ మనిషిలో ఇన్నాళ్ల పాటు పని చేయడం వైద్య చరిత్రలో ఇదే తొలిసారి. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ మెడికల్ టీమ్ త్వరలోనే Food and Drug Administration (FDA)కి నివేదించనుంది. అయితే...బతికి ఉన్న వ్యక్తుల్లో పంది కిడ్నీలు ప్రవేశపెట్టి పరీక్షించేందుకు అనుమతులు కోరనుంది. నిజానికి..జంతువుకి చెందిన అవయవాలను మనిషిలోకి ప్రవేశపెట్టడం చాలా టఫ్ టాస్క్. ఇప్పటికే అమెరికాలో Organ Donation కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. దాదాపు లక్ష మంది వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్టు అంచనా. వీరిలో ఎక్కువ మంది కిడ్నీల కోసమే చూస్తున్నారు. అందుకోసమే...ఈ స్టడీ చేశారు వైద్యులు. మిల్లర్ అనే బ్రెయిన్ డెడ్ పేషెంట్‌ని రెండు నెలల పాటు వెంటిలేటర్‌పై ఉంచి ఈ పరిశోధన చేశారు.
ఇదీ జరిగింది..
క్యాన్సర్‌తో చనిపోయిన మిల్లర్ అవయవాలను ఎవరికీ దానం చేయడానికి ఉండదు. అందుకే...కనీసం ఇలా సైంటిఫిక్ స్టడీ కోసమైనా తన బాడీ ఉపయోగపడుతుందని కుటుంబ సభ్యులు భావించారు. వైద్యులు అడిగిన వెంటనే అందుకు అంగీకరించారు. ఈ ఏడాది జులైన 14న మిల్లర్ పుట్టిన రోజు నాడే కిడ్నీలు తొలగించి పంది కిడ్నీని పెట్టారు. మొదటి నెల రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా పని చేసింది. ఆ తరవాత యూరిన్ ప్రొడక్షన్‌లో సమస్యలు వచ్చాయి. ఈ సవాలునీ మందులతో అధిగమించారు వైద్యులు. ఫలితంగా భవిష్యత్‌లో ఇలాంటి సర్జరీలు చేసి సక్సెస్ అవచ్చు అన్న నమ్మకం అందరిలోనూ కలిగింది. అంటే జంతువుల అవయవాలతో మనుషులను బతికించుకునే అవకాశముంటుంది. అయితే..అందుకోసం జెనెటికల్‌గా జంతువుల అవయవాల్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. వాటిని మనిషి శరీరానికి తగ్గట్టుగా మార్చాలి. అలా అయితే విజయం సాధించినట్టే. ఏదేమైనా...ఈ అధ్యయనం లక్ష్యం ఒకటే అని...భవిష్యత్‌లో ఎవరూ అవయవాల కోసం ఎదురు చూసి ప్రాణాలు కోల్పోకూడకుండా చూడాలని చెబుతున్నారు వైద్యులు. త్వరలోనే ఇది పూర్తి స్థాయిలో ప్రయోగించేందుకు అనుమతులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఒడిశాలో వణుకు పుట్టిస్తున్న స్క్రబ్ ఇన్‌ఫెక్షన్, ఆరుగురు మృతి - ప్రభుత్వం అలెర్ట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)