Afghan TV Journalist : ఒకప్పుడు టీవీ యాంకర్, ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ సెల్లర్, అప్ఘనిస్థాన్ లో ఆర్థిక సంక్షోభానికి నిదర్శనం!
Afghan TV Journalist : అప్ఘనిస్థాన్ ను తాలిబాన్లు ఆక్రమించిన తర్వాత పరిస్థితులు మారిపోయింది. దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. దీంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలో న్యూస్ యాంకర్ పనిచేసిన వ్యక్తి స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుంటున్నారు.
Afghan TV Journalist : అప్ఘనిస్థాన్ తానిబాన్ల హస్తగతం అయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయానడానికి నిదర్శనం ఈ ఫొటో. గతంలో న్యూస్ యాంకర్ గా పనిచేసిన మొహమ్మదీ ఆర్థిక సంక్షోభం కారణంగా స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుంటున్నారు. యాంకర్, రిపోర్టర్ గా ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఆయన ప్రస్తుతం సమోసాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. తమ కుటుంబానికి పోషించుకోడానికి తప్పనిస్థితిలో సమోసాలు అమ్ముకుంటున్నారు మొహమ్మదీ.
ప్రతిభ పేదరికం అనుభవిస్తోంది
మూసా మొహమ్మదీ అనే అఫ్ఘన్ జర్నలిస్ట్ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఆ ఫొటో చాలా మంది గుండెను పిండేస్తుంది. కొన్నాళ్లుగా మీడియా రంగంలో ఉన్న ఆయన ఇప్పుడు వీధిలో ఆహారాన్ని అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో ఆర్థిక పరిస్థితి క్షీణిస్తూనే ఉంది. అంతర్జాతీయ సహాయాన్ని కోల్పోవడం, పెరుగుతున్న వ్యయాలు, అధిక నిరుద్యోగిత రేటు ప్రపంచ బ్యాంకు 'భయంకరమైన' పరిస్థితికి దారితీసింది. జర్నలిస్ట్ నీలోఫర్ అయూబీ ట్వీట్ చేస్తూ దేశంలో ఎంత మంది ప్రతిభావంతులైన నిపుణులు పేదరికం అనుభవిస్తున్నారని ఈ ఫొటోలు ట్వీ్ట్ చేశారు.
Journalists life in #Afghanistan under the #Taliban. Musa Mohammadi worked for years as anchor & reporter in different TV channels, now has no income to fed his family. & sells street food to earn some money. #Afghans suffer unprecedented poverty after the fall of republic. pic.twitter.com/nCTTIbfZN3
— Kabir Haqmal (@Haqmal) June 15, 2022
ఇది హేమమైన చరిత్ర
అయోబీ అఫ్ఘన్ జర్నలిస్ట్ మూసా మొహమ్మదీ ఫోటోను షేర్ చేశారు. కొన్నాళ్లుగా మీడియా రంగంలో భాగమైన ఆయన ఇప్పుడు వీధి ఆహారాన్ని అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. “జర్నలిస్ట్‌గా జీవితకాలం పని, పోరాటాలు చేసిన ప్రతిభావంతులైన యువతరం భవిష్యత్ ఇలా ముగుస్తుంది. ఇది మా కోసం ప్రతి కొన్ని సంవత్సరాలకు పునరావృతమయ్యే హేయమైన చరిత్ర, ”అని అయోబి రాశారు.
ఆర్థిక సంక్షోభం
కబీర్ హక్మల్, ఆఫ్ఘనిస్తాన్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి కూడా మొహమ్మదీ గురించి ట్వీట్ చేశారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలకు తాలిబాన్లను నిందించారు. ఈ ఘటన రేడియో టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వాసిక్ దృష్టికి వచ్చింది. తన డిపార్ట్మెంట్లో టీవీ యాంకర్, రిపోర్టర్‌ను నియమిస్తానని వాసిక్ ఒక ట్వీట్లో పేర్కొన్నాడు. గత ఆగస్టులో తాలిబాన్ అఘ్షనిస్తాన్ స్వాధీనం చేసుకున్నప్పటీ నుంచి ఆ దేశంలో మానవతా, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాలిబాన్ దళాలు మీడియా సంస్థలపై విరుచుకుపడ్డాయి. గత కొన్ని నెలలుగా అనేక మంది జర్నలిస్టులు, ముఖ్యంగా మహిళలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 2022లో మరింత క్షీణిస్తుందని అంచనా వేసింది. 2020 -2022 ముగింపు మధ్య తలసరి వాస్తవ స్థూల దేశీయోత్పత్తి 30 శాతం పడిపోయినట్లు తెలుస్తోంది.