Vral News: పక్క పక్క జైలుగదుల్లో ఉంచడమే తప్పయింది - ఏమీ చేసుకోకుండానే బిడ్డను కనేస్తున్నారు - ఈ అమెరికన్ నేరస్తుల జంట స్టోరీ డిఫరెంట్
Secret Pregnant : అది ఓ జైలు, రెండు చిన్న గదులు, ఒక్కో గదిలో ఒక్కో ఖైదీ ఉంటారు. అలా రెండు జైలు గదుల్లో ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. ఆరు నెలల గడిచే సరికి మహిళా ఖైదీ ప్రెగ్నెంట్ అయిపోయింది. ఎలా సాధ్యం?
Accused Murderers Get Pregnant in Secret Despite Never Seeing Each Other in Miami Jail: అమెరికాలో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఇది కూడా ఒకటి. మియామి జైల్లో అసలు శారీరకంగా కలవకుండానే ఓ మహిళా ఖైదీ ప్రెగ్నెంట్ అయ్యారు. అదేలా సాధ్యమయిందంటే అమె చెప్పిన కథ విని జైలు అధికారులు ఆశ్చర్యపోయారు. అది నిజమా కాదా అని క్రాస్ చెక్ చేసుకున్నారు. ఆమె చెబుతున్న వివరాలు మ్యాచ్ అయ్యాయి. కానీ ఇంకా చాలా మంది నమ్మలేకపోతున్నారు.
అమెరికాలోని ఫ్లోరిడా జైల్లో తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని ఉంచుతూ ఉంటారు. ఇలా ఓ హంతకుడ్ని, హంతకురాల్ని వేర్వేరు గదుల్లో ఉంచారు.ఆ జైల్లో పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. లోపల ఉన్న ఖైదీలు తమ జైలు గది నుంచి అటూ ఇటూ తిరగడానికి కూడా అవకాశం ఉండదు.ఎవరెవరు ఉన్నారో కూడా తెలియదు. అలాంటి జైల్లో రెండు పక్క పక్క గదుల్లో ఇద్దరు హంతకుల్ని బంధించారు. వారిలో ఒకరు యువతి.. మరొకరు యువకుడు.
కొన్ని రోజులకు యువతి ప్రెగ్నెంట్ అయింది. జైలు అధికారులు ఎవరైనా తొందరపడ్డారేమో అని ఉన్నతాధికారులు కంగారు పడ్డారు. కానీ ఆ ఖైదీ మాత్రం.. తన ప్రెగ్నెంట్ కి కారణం పక్క సెల్‌లో ఉన్న ఖైదీ అని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. పక్క సెల్ ఉన్న ఖైదీ గురించి ఎలా తెలుసు.. తెలిసినా ఎలా ప్రెగ్నెంట్ ను చేశాడు అని గచ్చి గుచ్చి అడిగితే అసలు విషయాలు చెప్పిది. ఆ సెల్ నుంచి.. ఈ సెల్‌లోకి ఓ చిన్న సిగరెట్ పట్టేంత బొక్క ఉందంట. ఆ బొక్క నుంచి మొదట మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఆ మాటల్లో అన్నీ ఉన్నాయి. చివరికి రొమాన్స్ కూడా మాటల్లోనే చేసుకున్నారు. మరి దానికే ప్రెగ్నెన్సీ రాదు కదా. దానికో పద్దతి ఉంటుంది.
ఓ రోజు బిడ్డను కనాలని ఇద్దరూ అనుకున్నారు. అందు కోసం ఎం చేయాలా అని ఆలోచించారు. తాము మాట్లాడుకునే బొక్కను పెద్దది చేస్తే దొరికిపోతారు. అందుకే వినూత్నమైన ప్లాన్ చేశారు. అదేమిటంటే.. మగ ఖైదీ హస్తప్రయోగం చేసుకుని ఆ స్పెర్మ్ చిన్న కాగితంలో పెట్టి ఇస్తే .. లేడీ ఖైదీ తన యోనిలో ప్రవేశ పెట్టుకుంటుందట. సహజంగా వైద్య పరిభాషలో ఐయూఐ, ఐవీఎఫ్ వంటి ప్రక్రియలు ఇలాంటివే.కానీ ఇలా .. ఎలాంటి మెడికల్ ప్రాసెస్ లేకుండా చేసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుందని ఎవరూ అనుకోరు. కానీ ఈ ఖైదీ కి వచ్చింది.
Also Read: సిరియాలో అంతర్యుద్ధానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే
తనకు ప్రెగ్రెన్సీ వచ్చిందన్న విషయాన్ని తానే నమ్మలేకపోయానని ఆ మహిళా ఖైదీ అంటున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇందులో ఏదో మతలబు ఉందని వెలికి తీయాలని అనుకుంటున్నారు. నిజంగానే వారు చెప్పిన పద్దతిలో ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే మాత్రం.. ఈ ఖైదీల తెలివి తేటలకు దండలేయాల్సిదేన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.