Online Auction: ఇదేందయ్యా బాబు.. గోల్డ్ స్పూన్ కాదు.. విరిగిపోయినా లక్షల్లో ధర.. అలా ఎలా?
ఇంట్లో ఉపయోగించే స్పూన్ ఎంత ధర ఉంటుంది. సరే 10, 20 రూపాయలు అనుకోండి. కానీ ఒక చెంచాను ఓ వ్యక్తి 90 పైసలకు కోని.. లక్షల్లో అమ్ముకున్నాడు.
మనం ఏదైనా వస్తువు కొన్నం. దానిని సెకండ్ హ్యాండ్ కింద అమ్మేస్తాం. సగం ధర రావడమే ఎక్కువ. అంతకంటే ఎక్కువ ఎవరూ పెట్టరు. ఏదో మన అదృష్టం బాగుండి.. వస్తువు బాగుంటే.. సగం కంటే ఎక్కువ ధర రావొచ్చు. కానీ ఓ వ్యక్తి అదృష్టం మామూలుగా లేదు. 90 పైసలు పెట్టి కొన్న చెంచా.. లక్షలకు అమ్ముడుపోయింది. ఇంతకీ దానికి ఎందుకు అంత డిమాండ్? ఓవైపు వంగి ఉన్నా.. ఎందుకు ఇంత ధర? అంత ధరకు అమ్ముడుపోవడానికి కారణం ఏంటి?
ఓ వ్యక్తి.. లండన్ లో కార్ బూట్ సేల్కు వెళ్లాడు. అతడికి అక్కడ ఓ స్పూన్ కనిపించింది. ఎందుకో అది ఆకర్షించింది. పాతగా తుప్పు పట్టి ఉంది. ఓవైపు సగం వంగిపోయినట్టు ఉంది. సాధారణంగా అయితే దానితో ఏం పని.. ఎవరూ తీసుకోరు. ఏహే ఇందులో ఏముంది అనుకుంటారు. కానీ ఓ వ్యక్తి ఆ చెంచాను చూసిన వెంటనే ఏదో ప్రత్యేకత ఉందనుకున్నాడు. కేవల 90 పైసలకు స్పూన్ ను కొన్నాడు. కానీ లక్షల్లో ఎలా ధర వచ్చింది.
స్పూన్ కొన్న ధరకు అమ్మిన ధరకు 12 వేల రేట్ల తేడా.. అంటే ఎంతో తెలుసా 2 లక్షలు అన్నమాట. కొన్నది 90 పైసలకే కానీ అమ్మింది మాత్రం 2 లక్షలకు. ఈ ధర అందరిని అవాక్కయ్యేలా చేసింది.
కొన్న వెంటనే స్పూన్ ను ఆ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత వేలానికి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆక్షనీర్స్ ను సంప్రదించాడు. అక్కడ దానిని పరిశీలించగా.. అసలు విషయం తెలిసింది. అది 13వ శతబ్దానికి చెందిన స్పూన్ అని. సరే కొన్నది 90 పైసలకేగా.. 51,712 రూపాయలకు వేలంలో పెట్టాడు. ఎంతో కొంత వస్తుంది కదా అనుకున్నాడు. ఎలాగైనా.. పాత కాలం నాటి స్పూన్ కాబట్టి ధర ఎక్కువనే వస్తుందనుకున్నాడు. కానీ మరి అంత ఎక్కువ వస్తుందని ఊహించలేదు.
ఇలా జరిగిన తర్వాత కొన్ని రోజులకు ఆ స్పూన్ విషయం అందరికీ తెలిసింది. 13వ శతాబ్దాం స్పూన్ అంటే మాటలా? అనుకున్నారంతా. వేలంలో ఎగబడ్డారు. స్పూన్ వంగిపోయిందా? పాతదా? అని ఎవరూ చూడలేదు. లాస్ట్ కి ఆ స్పూన్ 1,97,000 రూపాయలకు అమ్ముడుపోయింది. ట్యాక్స్, ఇతర ఛార్జీలు అన్నీ కలిపి 2 లక్షల రూపాయలు దాటింది. టైమ్ పాస్ కి వెళ్లి.. 90 పైసలకు కొని.. 2 లక్షలకు అమ్ముకున్న వ్యక్తిని చూసి.. అదృష్టవంతుడు అని అందరూ అంటున్నారు.