అన్వేషించండి

Assam-Mizoram Border Dispute: రణరంగంలా అస్సాం-మిజోరం సరిహద్దు....అస్సాం సీఎంపై మిజోరంలో కేసు... నాగాలాండ్ తో ఒప్పందం

అస్సాం-మిజోరం సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. శనివారం మరోసారి సరిహద్దు ప్రాంతం రణరంగంలా మారింది. ఇతర రాష్ట్రాలతో సరిహద్దు వివాదాలకు తెరదించేందుకు అస్సాం ప్రయత్నాలు చేస్తుంది.

అస్సాం-మిజోరం సరిహద్దులో ఇటీవల ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో శనివారం పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఏ క్షణంలో ఏంజరుగుతుందో అన్న ఆందోళనలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఇతర రాష్ట్రాలతో సరిహద్దు విషయమై ఉన్న విభేదాలను పరిష్కరించుకునే దిశగా అస్సాం చర్యలు ప్రారభించింది. ఈ మేరకు అస్సాం- నాగాలాండ్‌ సరిహద్దులో నెలకొన్న వివాదం పరిష్కారానికి ఇరు ప్రభుత్వాలు శనివారం ఒక ఒప్పందానికి వచ్చాయి. వివాదాస్పద ప్రాంతాల్లోని రెండు రాష్ట్రాల సాయుధ పోలీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి, శిబిరాలకు తరలించాలని నిర్ణయించాయి. ఒప్పందం ప్రకారం దెస్సొయ్‌ లోయ అభయారణ్యంలోని వివాదాస్పద స్థలాల్లోని సాయుధ పోలీసులను 24 గంటల్లో పూర్తిగా ఉపసంహరించుకుంటారు. అనంతరం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు డ్రోన్‌ల ద్వారా, ఉపగ్రహ ఛాయా చిత్రాలతో యథాతథస్థితిని కొనసాగించేందుకు కృషి చేస్తాయి. ఈ ఒప్పందంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హర్షం వ్యక్తంచేశారు. నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నైఫియు రియోకు కృతజ్ఞతలు కూడా తెలిపారు.


మిజోరం రాష్ట్రంలో తనపై కేసు నమోదైనట్లు వచ్చిన వార్తలపై అస్సాం సీఎం బిశ్వశర్మ స్పందించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. అదే సమయంలో రాజ్యాంగ పరంగా మిజోరం భూభాగంలో జరిగిన ఘర్షణపై విచారణను తటస్థ సంస్థకు ఎందుకు అప్పజెప్పడం లేదని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. ఈ విషయాన్ని మిజోరం ముఖ్యమంత్రి జొరాంథాంగాకు తెలిపానని అన్నారు. ఘర్షణల్లో ఆరుగురు పోలీసులు మృతి చెందిన ఘటనకు సంబంధించి.. మిజోరంలోని కొలాసిబ్‌ అధికారులు ఆరుగురిపై అస్సాంలోని కచార్‌ జిల్లా అధికారులు కేసు నమోదు చేసి, సమన్లు జారీ చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి.

వాహన రాకపోకలు బంద్ 

జులై 26వ తేదీన సరిహద్దులో ఘర్షణలు చోటుచేసుకున్న రోజు నుంచి అస్సాం నుంచి ఒక్క ట్రక్కు కూడా రాష్ట్రంలోకి రాలేదని మిజోరం అధికారులు తెలిపారు. మిజోరంలో ముఖ్యమైన 306వ నెంబర్ జాతీయ రహదారిపై అస్సాంలోని వివిధ ప్రాంతాల్లో దిగ్బంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. సోమవారం నుంచి శనివారం వరకు అస్సాం నుంచి మిజోరం రాష్ట్రానికి ఒక్క వాహనం కూడా రాలేదని కొలాసిబ్‌ డిప్యూటీ కమిషనర్‌ హెచ్‌ లాల్తాంగ్లియానా ఉద్ఘాటించారు. అస్సాం మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. 

అసలు వివాదం ఏంటి?

19వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వారు ఈశాన్య ప్రాంతం ఆక్రమణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాంతంలో గిరిజనుల ఆధ్వర్యంలో ఉండే భూభాగాలను ఆక్రమించుకోడానికి అక్కడి ప్రాంతాల పరిపాలనకు అస్సాంను కేంద్రంగా చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఈశాన్య ప్రాంతాలు అస్సాంలో భాగంగానే ఉండేవి. అనంతరం నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అస్సాం నుంచి విడిపోయాయి. అయితే సరిహద్దుల విభజన మాత్రం అప్పట్లో సరిగా జరగలేదనే వాదన వినిపిస్తునే ఉంది. దీనిపై ఈ నాలుగు కొత్త రాష్ట్రాలు ముందు నుంచి అసంతృప్తితోనే ఉన్నాయి. 

ఈ సరిహద్దు వివాదాలు చినికి చినికి పెద్దవి కావడానికి ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులేనని నిపుణులు అంటున్నారు. అస్సాం నుంచి విడిపోయిన నాలుగు రాష్ట్రాలు రాజ్యాంగబద్ధంగా సరిహద్దులు నిర్దేశించుకున్నాయి. అయినా చారిత్రకంగా తమ సొంత భూములను కోల్పోయామనే భావన నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ వాసుల్లో బలంగా నాటుకుపోయింది. దీంతో తమ వనరులు కోల్పోవడానికి సిద్ధంగా లేని రాష్ట్రాలు, సరిహద్ధుల్లోని భూభాగాలపై హక్కులు కోసం ప్రయత్నిస్తునే ఉన్నాయి. 

అస్సాం-మిజోరాం సరిహద్దుల్లో సమస్యలు గతంలో సైతం హింసకు దారితీశాయి. నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లతో ఉన్న అస్సాం సరిహద్దుల్లో కూడా ఘర్షణలు తలెత్తాయి. ఇలాంటి వివాదాలను పరిష్కరించడానికి గతంలో ఏర్పాటు చేసిన సరిహద్దు కమీషన్ల వల్ల ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. కమీషన్లు ప్రతిపాదించిన సిఫార్సులను ఆయా రాష్ట్రాలు అంగీకరించడానికి సిద్ధంగాలేవు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
HMPV tests cost: హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Indias Largest Green Hydrogen Project | దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ విశాఖలో | ABP DesamAjith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
HMPV tests cost: హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Telangana News: తెలంగాణలో మందుబాబులకు బిగ్‌షాక్‌- కింగ్‌ఫిషర్ సరఫరా నిలిపివేత
తెలంగాణలో మందుబాబులకు బిగ్‌షాక్‌- కింగ్‌ఫిషర్ సరఫరా నిలిపివేత
HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?
మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?
ISRO Chairman : ఇస్రో కొత్త ఛైర్మన్ గా వి. నారాయణన్ - జనవరి 14 నుంచి రెండేళ్ల వరకు ఆయనే
ఇస్రో కొత్త ఛైర్మన్ గా వి. నారాయణన్ - జనవరి 14 నుంచి రెండేళ్ల వరకు ఆయనే
Embed widget